90 బంతులు.. 12 పరుగులు! నీ ఓపికకు ఓ దండం సామీ? | IND vs SL: Lahiru Kumara goes after batting for 90 balls, his best knock for Sri Lanka | Sakshi
Sakshi News home page

IND vs SL: 90 బంతులు.. 12 పరుగులు! నీ ఓపికకు ఓ దండం సామీ?

Aug 27 2026 6:01 PM | Updated on Aug 27 2026 6:12 PM

IND vs SL: Lahiru Kumara goes after batting for 90 balls, his best knock for Sri Lanka

కొలంబో వేదిక‌గా భారత్‌తో జ‌రిగిన‌ రెండో టెస్టులో శ్రీలంక పేస్ బౌలర్ లాహిరు కుమార బ్యాట్‌తో అద్భుతమైన పోరాట పటిమ కనబరిచాడు. ఈ మ్యాచ్‌ను శ్రీలంక డ్రా చేసుకోవ‌డంలో కుమారది కీల‌క పాత్ర‌.  ఫాలో ఆన్‌లో ఆతిథ్య జ‌ట్టును త్వరగా ఆలౌట్ చేయాలని భావించిన భారత జ‌ట్టు ఆశలపై అత‌డు నీళ్లు జల్లాడు. 

పదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కుమార.. అసాధారణ డిఫెన్స్‌తో టీమిండియా బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టాడు. భారత స్పిన్నర్లను అలోవకగా ఆడుతూ క్రీజులో పాతుకుపోయాడు. అప్ప‌టికే టీమిండియాకు కొర‌క‌రాని కొయ్య‌గా మారిన సునాల్ దినుష‌తో క‌లిసి లహిరు తమ జట్టును ఓటమి నుంచి గట్టెక్కించాడు. 

ఏకంగా 90 బంతులు ఎదుర్కొన్న కుమార కేవలం 12 పరుగులు మాత్రమే చేశాడు. చివరికి రవీంద్ర జడేజా బౌలింగ్‌లో జైశ్వాల్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఈ క్రమంలో నెటిజన్లు అతడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఒక టెయిలెండర్ అయి ఉండి భారత బౌలింగ్‌ను ఎదుర్కొంటూ ఆ తరహా బ్యాటింగ్‌ చేయడం నిజంగా గ్రేట్‌ అని కొనియాడుతున్నారు. 

కాగా ఫాలో ఆన్‌లో శ్రీలంక బ్యాటర్లు విరోచిత పోరాటం కనబరిచారు. ముఖ్యంగా యువ ఆటగాడు సోనల్‌ దినుష(133 నాటౌట్‌) అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. రెండు ఇన్నింగ్స్‌లలోనూ శతక్కొట్టి భారత్‌కు కీలక విజయాన్ని దూరం చేశాడు.

అతడికి సపోర్ట్‌గా లంక టెయిలాండర్లు కూడా నిలిచారు. దీంతో లంక తమ రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 429 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌ డ్రా ముగిసినప్పటికి, రెండు టెస్టుల సిరీస్‌ను 1-0 తేడాతో భారత్‌ సొంతం చేసుకుంది.

సంక్షిప్త స్కోర్లు..
భార‌త తొలి ఇన్నింగ్స్ – 503/9 డిక్లేర్‌
శ్రీలంక రెండో ఇన్నింగ్స్ – 290 ఆలౌట్‌
శ్రీలంక రెండో ఇన్నింగ్స్ – 429/9 డిక్లేర్‌
చదవండి: IND vs SL: డ్రా ముగిసిన కొలంబో టెస్టు.. సిరీస్‌ భారత్‌దే

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement