IND vs SL: భారత్‌-శ్రీలంక రెండో టెస్టు డ్రా | IND Vs SL 2nd Test Day 5 Live Score Updates, Highlights, Result And Viral Videos, Sri Lanka Under Pressure As India Eye Victory | Sakshi
Sakshi News home page

IND vs SL: భారత్‌-శ్రీలంక రెండో టెస్టు డ్రా

Aug 27 2026 9:48 AM | Updated on Aug 27 2026 5:12 PM

IND vs SL 2nd Test Day 5 Colombo: Updates Highlights Result

IND vs SL 2nd Test Day 5: కొలంబో వేదికగా భారత్‌-శ్రీలంక మధ్య జరిగిన రెండో టెస్టు డ్రా ముగిసింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-0 తేడాతో భారత్‌ సొంతం చేసుకుంది. ఫాలో ఆన్‌లో శ్రీలంక బ్యాటర్లు అద్భుతమైన పోరాట పటిమ కనబరిచారు. 229/6తో ఐదో రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంక.. తమ రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 429 పరుగులు చేసింది. సోనల్ దినూష (133 నాటౌట్) అజేయ సెంచరీతో టీమిండియాకు గెలుపును దూరం చేశాడు. 

శ్రీలంక తొమ్మిదో వికెట్‌ డౌన్‌
ఎట్టకేలకు శ్రీలంక తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది. 90 బంతులు ఆడి 12 పరుగులు చేసిన కుమార.. జడేజా బౌలింగ్‌లో ఔటయ్యాడు. శ్రీలంక ప్రస్తుతం 190 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.

శతక్కొట్టిన దినుష
133.1: సిరాజ్‌ బౌలింగ్‌లో రెండు పరుగులు తీసి సెంచరీ పూర్తి చేసుకున్న దినుష. 196 బంతుల్లో వంద మార్కుల అందుకున్న ఆల్‌రౌండర్‌. ఈ సిరీస్‌లో మూడో సెంచరీ పూర్తి చేసుకున్న 25 ఏళ్ల దినుష. లంక స్కోరు: 385-8. 172 పరుగుల ఆధిక్యం.

పోరాడుతున్న శ్రీలంక.. సెంచరీకి చేరువలో దినుష
కొలంబో టెస్టులో శ్రీలంక డ్రా దిశగా  పోరాడుతోంది. ఆఖరి రోజు టీ బ్రేక్‌ సమయానికి శ్రీలంక తమ రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు కోల్పోయి 383 పరుగులు చేసింది. లంక ప్రస్తుతం 170 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. సోనల్‌ దినుష(195 బంతుల్లో 6 ఫోర్లుతో 98) సెంచరీకి చేరువలో ఉన్నాడు.

150 పరుగుల ఆధిక్యంలో శ్రీలంక
లాహిరు కుమార 1, దినుష 83 పరుగులతో ఉన్నారు. లంక స్కోరు: 363-8.

ఎనిమిదో వికెట్‌ కోల్పోయిన శ్రీలంక
116.3 వ ఓవర్‌: రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ధ్రువ్‌ జురెల్‌కు క్యాచ్‌ ఇచ్చి ఎనిమిదో వికెట్‌గా వెనుదిరిగిన ప్రబాత్‌ జయసూరియ. లాహిరు కుమార క్రీజులోకి వచ్చాడు. లంక స్కోరు: 355-8 (117). దినుష 76 పరుగులతో ఉన్నాడు. శ్రీలంక ఆధిక్యం 142 పరుగులు.

140 పరుగుల ఆధిక్యంలో శ్రీలంక
దినుష 76, ప్రబాత్‌ సున్నా పరుగులతో ఉన్నారు. స్కోరు: 353/7 (115).

శ్రీలంక స్కోరు: 341-7 (110)
దినుష 65, ప్రబాత్‌ సున్నా పరుగులతో ఉన్నారు. ఆధిక్యం 128 పరుగులు.

ఏడో వికెట్‌ కోల్పోయిన శ్రీలంక
టీమిండియా రెండో సెషన్‌ను ఘనంగా ఆరంభించింది. భోజన విరామం తర్వాత మానవ్‌ సుతార్‌ అటాకింగ్‌కు వచ్చి.. నాలుగో బంతికే కేశారా నువాంతను పెవిలియన్‌కు పంపాడు. జురెల్‌కు క్యాచ్‌ ఇచ్చి 46 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నువాంత వెనుదిరిగాడు. 

దీంతో లంక ఏడో వికెట్‌ కోల్పోయింది. స్కోరు: 330-7 (105). ప్రబాత్‌ జయసూరియ క్రీజులోకి రాగా.. దినుష 56 పరుగులతో ఉన్నాడు. లంక ఆధిక్యం 118 పరుగులు.

తొలి సెషన్‌లో శ్రీలంక ఆధిపత్యం
కీలకమైన ఐదో రోజు ఆటలో తొలి సెషన్‌లో భారత బౌలర్లు తేలిపోయారు. సొనాల్‌ దినుష, కేశారా నువాంత జోడీని విడదీసేందకు ఆపసోపాలు పడ్డారు. ఈ క్రమంలో దినుష అర్ధ శతకం (55*) పూర్తి చేసుకోగా.. నువాంత (46*) హాఫ్‌ సెంచరీకి చేరువయ్యాడు.

భోజన విరామ సమయానికి శ్రీలంక 104 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 329 పరుగులు సాధించింది. తద్వారా 116 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.

నొప్పితో విలవిల్లాడిన నువాంత
103.2వ ఓవర్‌: రవీంద్ర జడేజా వేసిన బంతి నువాంత కాలికి తగిలింది. దీంతో నొప్పితో విలవిల్లాడగా ఫిజియో వచ్చి పరిశీలించాడు. అయితే, వెంటనే నువాంత మళ్లీ బ్యాటింగ్‌ మొదలుపెట్టాడు. జడ్డూ ఎల్బీడబ్ల్యూకు అప్పీలు చేయగా.. అంపైర్‌ నుంచి ప్రతికూల ఫలితమే వచ్చింది.

115 పరుగుల ఆధిక్యంలో శ్రీలంక
వికెట్లు తీయలైక భారత బౌలర్ల పాట్లు.. శ్రీలంక స్కోరు: 328-6. నువాంత 46, దినుష 54 పరుగులతో ఉన్నారు.

శ్రీలంక స్కోరు: 320-6 (99)
దినుష 52, నువాంత 41 పరుగులతో ఉన్నారు. శ్రీలంక ఆధిక్యం 107 పరుగులు.

దినుష హాఫ్‌ సెంచరీ
99 బంతులలో యాభై పరుగులు పూర్తి చేసుకున్న దినుష. నువాంత 39 పరుగులతో ఉండగా.. లంకస్కోరు: 315-6. 102 పరుగుల ఆధిక్యంలో శ్రీలంక.

శ్రీలంక స్కోరు: 306-6 (94)
93 పరుగుల ఆధిక్యంలో శ్రీలంక. దినుష 42, నువాంత 37 పరుగులతో ఉన్నారు.

89 పరుగుల ఆధిక్యంలో శ్రీలంక
దినుష 39, నువాంత 37 పరుగులతో ఉ‍న్నారు. స్కోరు: 302-6 (91).

డ్రింక్స్‌ బ్రేక్‌ సమయానికి శ్రీలంక స్కోరు: 284-6
దినుష 34, నువాంత 28 పరుగులతో ఉన్నారు. శ్రీలంక ఆధిక్యం 71 పరుగులకు చేరుకుంది. చేతిలో ఇంకా నాలుగు వికెట్లు ఉన్నాయి.

శ్రీలంక స్కోరు: 276-6 (86)
50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన దినుష, నువాంత. దినుష 29, నువాంత 27 పరుగులతో ఉన్నారు. 63 పరుగుల ఆధిక్యంలో శ్రీలంక

నిలకడగా ఆడుతున్న దినుష, నువాంత
దినుష 22, నువాంత 20 పరుగులతో ఉన్నారు. స్కోరు: 262-6 (84). 49 పరుగుల ఆధిక్యంలో శ్రీలంక. 

44 పరుగుల ఆధిక్యంలో లంక
దినుష 21, నువాంత 17 పరుగులతో ఉన్నారు.

35 పరుగుల ఆధిక్యంలో లంక
సొనాల్‌ దినుష 13, నువాంత 16 పరుగులతో ఉన్నారు. లంక స్కోరు: 248/6 (78)

శ్రీలంక ఓవర్‌నైట్‌ స్కోరు: 229-6
సొనాల్‌ దినుష ఏడు, కేశారా నువాంత మూడు పరుగులతో అజేయంగా నిలిచారు.

స్వల్ప ఆధిక్యంలో లంక
ఫాలో ఆన్‌ ఆడుతున్న శ్రీలంక బుధవారం ఆట పూర్తయ్యేసరికి 72.4 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. తద్వారా 16 పరుగుల స్వల్ప ఆధిక్యంలోకి వెళ్లింది. పసిందు సూరియబండారా (92), కమిందు మెండిస్‌ (55) రాణించడంతో ఎట్టకేలకు లంక ఇన్నింగ్స్‌ ఓటమి నుంచి తప్పించుకోగలిగింది.

సింహళీస్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌లో ఆదివారం మొదలైన ఈ మ్యాచ్‌లో భారత్‌ తమ తొలి ఇన్నింగ్స్‌ను 503-9 వద్ద డిక్లేర్‌ చేసింది. అనంతరం శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులకే కుప్పకూలడంతో టీమిండియా ఆతిథ్య లంకను ఫాలో ఆన్‌ ఆడమని చెప్పింది. కాగా వర్షం వల్ల బుధవారం నాటి నాలుగో రోజు ఆటను ముందుగానే ముగించాల్సి వచ్చింది. 

క్లీన్‌స్వీప్‌పై గురి
ఇదిలా ఉంటే.. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గాలెలో జరిగిన తొలి టెస్టులో టీమిండియా శ్రీలంకను 165 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఇదే జోరులో రెండో టెస్టులోనూ గెలిచి సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్‌ చేసేందుకు భారత్‌ సిద్ధమైంది.

తుదిజట్లు
భారత్‌
యశస్వి జైస్వాల్‌, కేఎల్‌ రాహుల్‌, దేవదత్‌ పడిక్కల్‌, శుబ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), రిషభ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), రవీంద్ర జడేజా, ధ్రువ్‌ జురెల్‌, సారాంశ్‌ జైన్‌, మానవ్‌ సుతార్‌, మహ్మద్‌ సిరాజ్‌, ప్రసిద్‌ కృష్ణ

శ్రీలంక
లాహిరు ఉదార, కమిల్‌ మిశారా, పసిందు సూరియబండారా, కమిందు మెండిస్‌, ధనంజయ డి సిల్వ (కెప్టెన్‌), సొనాల్‌ దినుష, నిరోషన్‌ డిక్‌వెల్లా (వికెట్‌ కీపర్‌), కేశారా నువాంత, ప్రబాత్‌ జయసూరియ, లాహిరు కుమార, అసిత ఫెర్నాండో.

చదవండి: IND vs SL: ఫాలో ఆన్‌ ఆడి గెలిచిన జట్లు ఇవే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement