breaking news
Sonal Dinusha
-
టీమిండియాను గడగడలాడించిన ప్లేయర్‌కు ప్రతిష్టాత్మక అవార్డు
ఇటీవల జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో టీమిండియాను గడగడలాడించిన శ్రీలంక మిడిలార్డర్ బ్యాటర్ సోనల్ దినుషాకు ప్రతిష్టాత్మక ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ (ఆగస్ట్) అవార్డు లభించింది. ఇంగ్లండ్ పేసర్ ఓల్లీ రాబిన్సన్, బంగ్లాదేశ్ సంచలన పేసర్ హసన్ మహముద్ పోటీపడినప్పటికీ.. దినుషానే ఈ అవార్డు వరించింది.వీరు ముగ్గురు ఆగస్ట్ నెలలో టెస్ట్ క్రికెట్లో విశేషంగా రాణించారు. దినుషా భారత్‌తో ఆడిన 4 ఇన్నింగ్స్‌ల్లో 140 సగటున ఏకంగా 420 పరుగులు (3 శతకాలు, ఓ హాఫ్ సెంచరీ) సాధించగా.. పాకిస్తాన్‌తో జరిగిన తొలి రెండు టెస్ట్‌ల్లో రాబిన్సన్ 16 వికెట్లు తీశాడు. హసన్ మహముద్ ఆసీస్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో 9 వికెట్లతో చెలరేగి, ఆసీస్ గడ్డపై బంగ్లాదేశ్‌కు చారిత్రక విజయాన్నందించాడు.మహిళల విషయానికొస్తే.. ఆగస్ట్ నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును ఐల్ ఆఫ్ మ్యాన్ క్రికెటర్ లూసీ బార్నెట్కు లభించింది. థాయ్‌లాండ్ స్పిన్నర్ సులీపోర్న్ లావోమీ, వికెట్‌కీపర్-బ్యాటర్ నన్నపట్ కొంచరోయెంకై నుంచి పోటీ ఎదుర్కొన్న 19 ఏళ్ల బార్నెట్ ఈ అవార్డు దక్కించుకుంది. ఆగస్ట్ నెలలో బార్నెట్ విశేషంగా రాణించింది. నాలుగు ఇన్నింగ్స్‌ల్లోనే 257 పరుగులు సాధించి ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు ఎంపికైంది.ఇదీ చదవండి: విండీస్ గడ్డపై చరిత్ర సృష్టించిన పాక్ ప్లేయర్ -
ప్రతిష్టాత్మక అవార్డు రేసులో టీమిండియాను ఇబ్బందిపెట్టిన ప్లేయర్
ఇటీవల భారత్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన శ్రీలంక మిడిలార్డర్ బ్యాటర్ సోనల్ దినుషా ప్రతిష్టాత్మక ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ (ఆగస్ట్) అవార్డుకు నామినేట్ అయ్యాడు. ఇంగ్లండ్ పేసర్ ఓల్లీ రాబిన్సన్, బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ హసన్ మహ్ముద్తో కలిసి దినుషా ఈ అవార్డు కోసం పోటీ పడనున్నాడు.ప్రస్తుతం దినుషా పేరు క్రికెట్ ప్రపంచంలో మార్మోగుతోంది. భారత్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో అతడు ఏకంగా 420 పరుగులు (140 సగటు) చేశాడు. భారత్‌తో సిరీస్‌కు ముందు దినుషా కేవలం మూడు టెస్టులు మాత్రమే ఆడాడు. తన టెస్టు కెరీర్లో తొలి ఐదు ఇన్నింగ్స్‌ల్లో అతడి ఖాతాలో ఒక్క అర్ధ సెంచరీ మాత్రమే ఉంది.అయితే భారత్‌తో సిరీస్‌లో మాత్రం దినుషా పూర్తిగా భిన్నమైన ఆటగాడిగా కనిపించాడు. గాలేలో జరిగిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అద్భుతమైన సెంచరీ సాధించిన దినుషా.. రెండో ఇన్నింగ్స్‌లోనూ 84 పరుగులతో రాణించాడు. అయితే ఆ మ్యాచ్‌లో శ్రీలంక 165 పరుగుల తేడాతో ఓడిపోయింది. సిరీస్‌లో 0-1తో వెనుకబడిన శ్రీలంకకు రెండో టెస్టులో దినుషా అండగా నిలిచాడు.ఒకే టెస్టులో రెండు సెంచరీలుకొలంబోలో జరిగిన సిరీస్ నిర్ణయాత్మక టెస్టులో దినుషా మరోసారి చెలరేగిపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో 162 బంతుల్లో 103 పరుగులు.. రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా ఏడు గంటలకు పైగా క్రీజులో నిలిచి 264 బంతుల్లో 133 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. తద్వారా శ్రీలంకను ఓటమి నుంచి కాపాడాడు.రాబిన్సన్ విషయానికొస్తే.. ఆగస్ట్ నెలలో పాకిస్తాన్‌తో జరిగిన రెండు టెస్టుల్లో అతడు 16 వికెట్లు పడగొట్టాడు. రాబిన్సన్ ప్రదర్శనల కారణంగా ఇంగ్లండ్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది.మరోవైపు బంగ్లా ఫాస్ట్ బౌలర్ హసన్ మహ్ముద్ ఆస్ట్రేలియాపై అద్భుత ప్రదర్శన చేశాడు. డార్విన్‌లో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్లు తీసుకుని బంగ్లాదేశ్‌కు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు.చదవండి: భారత్-ఆఫ్ఘనిస్తాన్ తొలి టీ20 వాయిదా..? -
ర్యాంకింగ్స్‌లో దుమ్ములేపిన పడిక్కల్, అతడికి కెరీర్ బెస్ట్!
శ్రీలంకతో ముగిసిన టెస్టు సిరీస్‌లో రెండు సెంచరీలతో అదరగొట్టిన భారత క్రికెటర్ దేవదత్ పడిక్కల్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపాడు. బుధవారం విడుదల చేసిన ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ బ్యాటింగ్ విభాగంలో పడిక్కల్ ఐదు స్థానాలు ఎగబాకి 54వ స్థానంలో నిలిచాడు. నిజానికి ఇదేమి గొప్ప ర్యాంక్ కాకపోయినప్పటికీ, పడిక్కల్ మాత్రం తనకు వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా సద్వినియోగం చేసుకోవడమే గాక, భారత్ తరఫున టాప్ స్కోరర్‌గా (328 పరుగులు) నిలిచాడు. టెస్టు సిరీస్‌ను 1-0తో భారత్ గెలవడం వెనుక పడిక్కల్ కీలకపాత్ర పోషించాడు. గిల్, పంత్ మినహామిగతా బ్యాటర్ల విషయానికొస్తే కెప్టెన్ శుబ్‌మన్ గిల్ లంక సిరీస్‌లో ఒక అర్థసెంచరీ మాత్రమే సాధించాడు. దీంతో ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు దిగజారి తొమ్మిదో స్థానంలో నిలిచాడు. ఇక వికెట్ కీపర్ రిషబ్ పంత్ మాత్రం తన ఏడో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 11వ స్థానంలో కొనసాగుతున్నాడు. బ్యాటింగ్ విభాగంలో టాప్-10లో భారత్ నుంచి గిల్, పంత్ మాత్రమే చోటు దక్కించుకున్నారు. రెండుకు ఎగబాకిన స్మిత్ఇదే సిరీస్‌లో రెండు సెంచరీలతో భారత్‌కు కొరకరాని కొయ్యగా మారిన లంక బ్యాటర్ సోనల్ దినూష ఏకంగా 29 స్థానాలు ఎగబాకి కెరీర్ బెస్ట్ 25వ స్థానానికి చేరుకోవడం విశేషం. ఇక టాప్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ (856 పాయింట్లు) కొనసాగుతుండగా, ఆసీస్ స్టార్ స్టీవ్ స్మిత్ ఒక స్థానం ఎగబాకి రెండో స్థానానికి చేరుకోగా, ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ మూడో స్థానానికి పడిపోయాడు. బౌలింగ్ ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. మోకాలి గాయంతో లంక టూర్‌కు దూరమైన టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా రెండో స్థానానికి పడిపోగా, బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో అదరగొట్టిన ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ నంబర్‌వన్ స్థానాన్ని అధిరోహించాడు. న్యూజిలాండ్ బౌలర్ మాట్ హెన్రీ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆల్‌రౌండర్ల విభాగంలో భారత స్టార్ రవీంద్ర జడేజా తన నెంబర్‌వన్ స్థానాన్ని నిలబెట్టుకోగా, ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ఒక స్థానం ఎగబాకి ఆరో స్థానానికి చేరుకున్నాడు. భారత్ నుంచి జడేజాతో పాటు వాషింగ్టన్ సుందర్ (ఏడో స్థానం) టాప్-10లో చోటు దక్కించుకున్నాడు.Read: తిలక్ వర్మ వన్‌మ్యాన్ షో.. ఫైనల్లో సౌత్‌జోన్ -
'కోహ్లి ఉండుంటే ఆ "సైంధవుడి" ఆట సాగేది కాదు!'
కొలంబో వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టెస్టును టీమిండియా డ్రాగా ముగించిన సంగతి తెలిసిందే. అయితే చివరి రోజు ఆటలో నాలుగు వికెట్లు కూల్చడంలో విఫలమైన భారత్ చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయింది. సోనల్ దినూష (133 నాటౌట్) అజేయ సెంచరీతో కెరీర్ బెస్ట్ ఇన్నింగ్స్‌తో సైంధవుడిలా మారి భారత విజయాన్ని ఒంటిచేత్తో అడ్డుకున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటతీరుపై విమర్శలు వస్తున్న వేళ మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కొలంబో టెస్టులో విరాట్ కోహ్లి ఆడి ఉంటే మాత్రం ఫలితం వేరేలా ఉండేదని, ఆ సైంధవుడి (సోనల్ దినూష) ఆటలు సాగేవి కాదంటూ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు."టెస్టు క్రికెట్ ఆడడం అంత సులువు కాదు. లాంగ్ ఫార్మాట్ గేమ్‌గా పిలువబడే ఆటలో ఓపిక, సహనం చాలా అవసరం. అలసిపోయినా గంటల కొద్ది ఓవర్లు బౌలింగ్ చేస్తూనే ఉండాలి. ఒకవేళ ఈ మ్యాచ్‌లో కోహ్లి ఆడి ఉంటే ప్రతీసారి జట్టును ఎంకరేజ్ చేస్తూ గెలుపుకోసం పోరాడుదామని ప్రేరణనిస్తూ జట్టులో స్ఫూర్తిని నింపేవాడేమో. కోహ్లి ఆడి ఉంటే సోనల్ దినూషను ఎక్కువగా టార్గెట్ చేస్తూ అతడిని ఔట్ చేసేందుకు పదేపదే బౌలర్లను మారుస్తూ ఫలితం రాబట్టేవాడు. కోహ్లి ఉంటే ప్రత్యర్థిని తన వ్యూహాలతో బోల్తా కొట్టించి వాళ్లను ఒత్తిడిలోని నెట్టేసేవాడు. లాంగ్‌ఫార్మాట్ అయిన టెస్టుల్లో కొన్నిసార్లు మనం బౌలింగ్ చేస్తూనే పోతాం.. బంతి బాగా టర్న్ అయ్యి వికెట్పడుతుందిలే అనుకొని పొరపాటు పడతాం. కొలంబో టెస్టులో ఇలాంటి విషయాలను సీరియస్‌గా తీసుకోకపోవడం వల్లే ఫలితం ఇలా వచ్చిందేమో." అని కైఫ్ చెప్పుకొచ్చాడు.ఇక 2025 మేలో విరాట్ కోహ్లి టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అప్పటినుంచి కోహ్లి కేవలం వన్డే ఫార్మాట్‌కు మాత్రమే పరిమితమయ్యాడు. 2027 వన్డే ప్రపంచకప్ అనంతరం కోహ్లి అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికే అవకాశముంది. 123 టెస్టులాడిన కోహ్లి 9,230 పరుగులు సాధించాడు. ఇందులో 30 శతకాలు, 31 హాఫ్ సెంచరీలున్నాయి.Read: ‘పబ్జీ’ మొబైల్ గేమ్ సృష్టికర్త మృత్యువాత! -
ఒక్క తప్పు కూడా చేయలేదు.. అతడొక అద్భుతం: అశ్విన్
కొలంబో వేదికగా భారత్-శ్రీలంక మధ్య రెండో టెస్టు డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. ఓటమి ఖాయమనుకున్న చోట శ్రీలంక యువ బ్యాటర్ సోనల్ దినూషా అద్భుతం చేశాడు. దాదాపు 100 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి తన జట్టును ఓటమి నుంచి గట్టెక్కించాడు. భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ తన విరోచిత పోరాటంతో మ్యాచ్‌ను డ్రాగా ముగించాడు. ఈ నేపథ్యంలో సోనల్ దినూషాపై భారత దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల వర్షం కురిపించాడు."కొలంబో టెస్టులో నిజానికి భారత్ గెలవాల్సింది. పరీక్షల్లో 'అవుట్ ఆఫ్ సిలబస్' ప్రశ్నలా.. దినూషా భారత జట్టుకు కొరకరాని కొయ్యగా మారాడు. 'ఎవరీ కొత్త ఆటగాడు?' అని అందరూ ఆశ్చర్యపోయేలా అద్భుత ప్రదర్శన కనబరిచాడు. డ్రా అయినప్పటికి ఇది శ్రీలంకకు ఒక విజయం లాంటిదే. నాలుగు రోజులకే ముగుస్తుందనుకున్న మ్యాచ్‌ను ఆఖరి రోజు చివరి సెషన్ వరకు తీసుకొచ్చారు. వారికి ప్రస్తుతం కేవలం ఇద్దరు మంచి స్పిన్నర్ల అవసరముంది. ఈ సమస్య తీరితే శ్రీలంక తమ పూర్వవైభవాన్ని తిరిగి పొందే అవకాశముంది" అని అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు.అదేవిధంగా సోనల్ బ్యాటింగ్ స్కిల్స్‌ను కూడా అశ్విన్ మాట్లాడాడు. ఈ మ్యాచ్‌లో దినూషా ఆడిన నాలుగు ఇన్నింగ్స్‌లు చూశాను. కఠినమైన పిచ్‌లపై కూడా అతడు అద్భుతంగా ఆడాడు. ఎక్కడ కూడా చిన్న పొరపాటు చేయలేదు. పడిక్కల్ కంటే బాగా ఆడాడు. పడిక్కల్ ఎక్కువగా బ్యాక్‌ఫుట్‌పై షాట్లు ఆడతాడు. కానీ అతడు మరీ ఎక్కువగా వెనక్కి వెళ్లడం వల్ల బౌల్డ్ అయ్యాడు. కానీ ఈ లంక కుర్రాడు ఒక్క బంతికి కూడా ఇబ్బంది పడలేదు. బంతి లెంగ్త్‌ను ముందే అంచనా వేస్తున్నాడు. భారత స్పిన్నర్లను అతడు ఆడిన స్వీప్ షాట్లు గురుంచి ఎంత చెప్పుకొన్న తక్కువే అని ఈ సీఎస్కే లెజెండరీ స్పిన్నర్ కొనియాడాడు. -
గెలుపు చేజారె...
ప్రత్యర్థి ఆధిక్యం 16 పరుగులు మాత్రమే... మిగిలిన 4 వికెట్లు తీసేందుకు ఎంతో సమయం పట్టదు...ఆ తర్వాత ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించడమే మిగిలింది... సిరీస్‌ను 2–0తో క్లీన్ స్వీప్ చేయడం ఖాయం... రెండో టెస్టు చివరి రోజు మైదానంలోకి దిగే ముందు భారత టీమ్ మేనేజ్మెంట్తో పాటు సగటు అభిమాని కూడా బహుశా ఇదే తరహాలో అనుకొని ఉంటారు. కానీ శ్రీలంక మాత్రం భిన్నంగా ఆలోచించింది... యువ బ్యాటర్ సోనాల్ దినూషా అయితే అసాధారణ ఆటకు మారుపేరుగా నిలిచాడు. టీమిండియాకు విజయం దక్కకుండా అడ్డుగోడలా అతను మారగా... లోయర్ ఆర్డర్ బ్యాటర్లు కూడా పట్టుదలతో అండగా నిలిచారు. ఫలితంగా మ్యాచ్ ‘డ్రా’... సునాయాసంగా గెలుస్తుందనుకున్న టెస్టును బౌలింగ్ వైఫల్యం, వ్యూహాత్మక లోపాలతో చివరకు శుబ్‌మన్ గిల్ బృందం సమంగా ముగించాల్సి వచ్చింది. పేరుకు సిరీస్ 1–0తో భారత్ నెగ్గినా... వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) కోణంలో చూస్తే స్వయంకృతంతో విలువైన పాయింట్లు చేజార్చుకున్నట్లే!కొలంబో: తొలి రోజు నుంచి భారత్ ఆధిపత్యం ప్రదర్శించిన రెండో టెస్టు మ్యాచ్ చివరకు ‘డ్రా’గా ముగిసింది. గురువారం ముగిసిన ఈ పోరులో శ్రీలంక బ్యాటర్ల పోరాటంతో టీమిండియాకు విజయం చేజారింది. ఓవర్‌నైట్ స్కోరు 229/6తో చివరి రోజు ఆట కొనసాగించిన శ్రీలంక తమ రెండో ఇన్నింగ్స్‌ను 154 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 429 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. సోనాల్ దినూషా (264 బంతుల్లో 133 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ శతకంతో చెలరేగగా, కెషారా నువాంతా (150 బంతుల్లో 46; 4 ఫోర్లు) రాణించాడు. 216 పరుగుల ఆధిక్యంతో లంక ఆట ముగించాక మిగిలిన 15 ఓవర్ల సమయంలో ఛేదన అసాధ్యం కాబట్టి ఇరు జట్ల ఆటగాళ్లు ‘షేక్ హ్యాండ్’లతో మైదానం వీడారు. తొలి టెస్టు నెగ్గిన భారత్ 1–0తో సిరీస్ సొంతం చేసుకుంది. దినూషా ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలవగా, మొత్తం 328 పరుగులు చేసిన దేవదత్ పడిక్కల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. లోయర్ ఆర్డర్ అండతో... 292 (48.4 ఓవర్లు)... శ్రీలంక 8, 9, 10, 11 స్థానాల బ్యాటర్లు కలిపి ఇన్ని బంతులు ఆడారంటే వారి ప్రతిఘటన ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు! ఒకవైపు దినూషా చక్కటి బ్యాటింగ్ ప్రదర్శనను కనబర్చగా, మరో ఎండ్‌నుంచి దక్కిన మద్దతు లంకను గట్టెక్కించింది. పిచ్ బాగా నెమ్మదించడంతో ఒక్కో వికెట్ కోసం భారత్ తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. దినూషా, నువాంతా ఏడో వికెట్‌కు 112 పరుగులు (246 బంతుల్లో) జోడించారు. ఆ తర్వాత ప్రభాత్ జయసూర్య (28 బంతుల్లో 2), లాహిరు కుమార (90 బంతుల్లో 12; 1 ఫోర్) భారత బౌలర్లను ఆటాడుకున్నాడు. టీ విరామం తర్వాత తొలి బంతికే దినూషా సెంచరీ (196 బంతుల్లో) పూర్తయింది. సిరీస్‌లో అతనికిది మూడో శతకం. ఎట్టకేలకు కుమారను కూడా భారత్ అవుట్ చేసినా... దినూషా, అసిత ఫెర్నాండో (24 బంతుల్లో 0 నాటౌట్) కలిసి అభేద్యంగా మరో 56 బంతులు ఆడి లాంఛనం ముగించారు.3 వరుసగా రెండు ఇన్నింగ్స్‌లలో (ఫాలోఆన్ ఆడుతూ) సెంచరీలు చేసిన మూడో బ్యాటర్‌గా దినూషా నిలిచాడు. గతంలో భారత ప్లేయర్ విజయ్ హజారే (1948లో అడిలైడ్‌లో ఆ్రస్టేలియాపై; 116, 145), జింబాబ్వే ప్లేయర్ ఆండీ ఫ్లవర్ (2001లో హరారేలో దక్షిణాఫ్రికాపై; 142, 199 నాటౌట్) ఈ ఫీట్ నమోదు చేశారు.1 శ్రీలంకను భారత్ 9 సార్లు ఫాలోఆన్ ఆడించగా... టీమిండియా గెలవకపోవడం ఇదే తొలిసారి.స్కోరు వివరాలు ; భారత్ తొలి ఇన్నింగ్స్: 503/9 డిక్లేర్డ్; శ్రీలంక తొలి ఇన్నింగ్స్: 290; శ్రీలంక రెండో ఇన్నింగ్స్ (ఫాలోఆన్): ఉడారా (సి) సారాంశ్ (బి) సిరాజ్ 3; మిషారా (ఎల్బీ) (బి) జడేజా 32; సూర్యబండారా (స్టంప్డ్) పంత్ (బి) సుతార్ 92; కమిందు (సి) గిల్ (బి) ప్రసిధ్ 55; ధనంజయ (సి) పడిక్కల్ (బి) సుతార్ 23; దినూషా (నాటౌట్) 133; డిక్వెలా (ఎల్బీ) (బి) సారాంశ్ 6; నువాంతా (సి)జురేల్ (బి) సుతార్ 46; ప్రభాత్ (సి) జురేల్ (బి) జడేజా 2; లాహిరు కుమార (సి) జైస్వాల్ (బి) జడేజా 12; అసిత ఫెర్నాండో (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 25; మొత్తం (154 ఓవర్లలో 9వికెట్లకు డిక్లేర్డ్) 429. వికెట్ల పతనం: 1–5, 2–63, 3–178, 4–209, 5–212, 6–218, 7–330, 8–355, 9–402. బౌలింగ్: ప్రసిధ్ 18.3–3–57–1, సిరాజ్ 15–7–26–1, సుతార్ 41–7–121–3, సారాంశ్ 37–4–98–1, జడేజా 38.3–4–94–3, గిల్ 2–0–8–0, జైస్వాల్ 1–0–9–0, జురేల్ 1–0–1–0. -
IND vs SL: డ్రా ముగిసిన కొలంబో టెస్టు.. సిరీస్ భారత్‌దే
కొలంబో వేదికగా భారత్-శ్రీలంక మధ్య జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగిసింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-0 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్ ఫాలో ఆన్‌లో శ్రీలంక బ్యాటర్లు అద్భుతం చేశారు. 229/6తో ఐదో రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంకను భారత బౌలర్లు ఆలౌట్ చేయలేకపోయారు. నాలుగో రోజే శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు పడగొట్టిన మన బౌలర్లు.. చివరి రోజున మిగిలిన 4 వికెట్లు తీయలేకపోయారు.లంక బ్యాటర్ సోనల్ దినూష (133 నాటౌట్) అజేయ సెంచరీతో టీమిండియాకు గెలుపును దూరం చేశాడు. అసాధారణ బ్యాటింగ్‌తో క్రీజులో పాతుకుపోయిన అతడి వికెట్ కోసం భారత్ చేసిన ప్రయోగాలన్నీ విఫలమయ్యాయి. అతడితో పాటు టెయిలాండర్లు లహిరు కుమార (90 బంతుల్లో 12), కేశర నువాంత (150 బంతుల్లో 46), అషిథా ఫెర్నాండో (24 బంతుల్లో 0 నాటౌట్) వీరోచిత పోరాటం కనబరిచారు.తొమ్మిదో వికెట్‌గా కుమార అవుట్ కావడంతో శ్రీలంకను భారత్ త్వరగా ఆలౌట్ చేసి బ్యాటింగ్‌కు వస్తుందని అంతా భావించారు. కానీ పదకొండో నంబర్ బ్యాటర్ ఫెర్నాండో కూడా తన జిడ్డు బ్యాటింగ్‌తో విసుగు తెప్పించాడు. అతడి వికెట్ కోసం ఆఖరికి కెప్టెన్ శుబ్‌మన్ గిల్, యశస్వి జైశ్వాల్, ధ్రువ్ జురెల్ కూడా బౌలింగ్ చేశారు.అయినా చివరి వికెట్‌ను పడగొట్టలేకపోయారు. దీంతో మరో 18 ఓవర్ల ఆట మిగిలి ఉండగానే ఇరు జట్లూ డ్రాకు అంగీకరించాయి. అప్పటికే శ్రీలంక 216 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఒకవేళ భారత్ బ్యాటింగ్‌కు దిగినా ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.బెడిసి కొట్టిన టీమిండియా ప్లాన్ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌ను 503/9 వద్ద డిక్లేర్ చేసింది. భారత బ్యాటర్లలో దేవ్‌దత్త్ పడిక్కల్(117), ధ్రువ్ జురెల్(115) సెంచరీలతో సత్తాచాటగా.. గిల్(50), పంత్(63) అర్ధ శతకాలతో రాణించారు. అనంతరం శ్రీలంక తమ మొదటి ఇన్నింగ్స్‌లో 290 పరుగులకు ఆలౌటైంది. ఈ ఇన్నింగ్స్‌లో కూడా సోనల్ దినుష(103) సెంచరీతో చెలరేగాడు. అతడితో పాటు పసిందు సూరియబండార(80) కూడా రాణించాడు.మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 213 పరుగుల ఆధిక్యం లభించింది. ఈ క్రమంలో సునాయస విజయం సాధించవచ్చనే నమ్మకంతో భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్ లంక జట్టుకు ఫాలో-ఆన్‌కు ఆహ్వానించాడు. గిల్ తీసుకున్న ఈ నిర్ణయం బెడిసికొట్టిందనే చెప్పాలి. ఫాలో ఆన్‌లో శ్రీలంక అద్భుతమైన పోరాటం కనబరిచి మ్యాచ్‌ను డ్రా ముగించింది.సంక్షిప్త స్కోర్లు..భారత తొలి ఇన్నింగ్స్ – 503/9 డిక్లేర్శ్రీలంక రెండో ఇన్నింగ్స్ – 290 ఆలౌట్శ్రీలంక రెండో ఇన్నింగ్స్ – 429/9 డిక్లేర్చదవండి: చరిత్ర సృష్టించిన వరుస సెంచరీల వీరుడు సొనాల్ దినుష -
వరుస సెంచరీలు!.. చరిత్ర సృష్టించిన సొనాల్ దినుష
శ్రీలంకతో రెండో టెస్టులో టీమిండియాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఐదో ఆరోజు ఆటలో లంకను త్వరగా అవుట్ చేయాలన్న భారత జట్టు ఆశలపై సొనాల్ దినుష నీళ్లు చల్లాడు. వరుసగా రెండో ఇన్నింగ్స్‌లో శతక్కొట్టి శ్రీలంకకు ఊపిరిలూదాడు.ఈ క్రమంలోనే సొనాల్ దినుష సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో టీమిండియాపై ఇంత వరకు ఏ ఆసియా క్రికెటర్‌కూ సాధ్యంకాని ఓ అరుదైన ఘనత సాధించాడు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-26లో భాగంగా రెండు మ్యాచ్‌లు ఆడేందుకు టీమిండియా శ్రీలంకకు వెళ్లింది.శతక్కొట్టిన దినుషగాలె వేదికగా తొలి టెస్టులో టీమిండియా ఆతిథ్య లంకను 165 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లో లంక ప్రదర్శన ఎలా ఉన్నప్పటికీ ఆల్‌రౌండర్ దినుష మాత్రం అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో సరిగ్గా శతకం సాధించిన ఈ 25 ఏళ్ల లెఫ్టాండర్ బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్‌లో 84 పరుగులు చేశాడు.ఇక కొలంబో వేదికగా రెండో టెస్టులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 503-9 వద్ద తమ మొదటి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అనంతరం శ్రీలంకను 290 పరుగులకే ఆలౌట్ చేసింది. దీంతో భారత్‌కు 213 పరుగుల ఆధిక్యం లభించగా శ్రీలంకను ఫాలో ఆన్ ఆడమని చెప్పింది.వరుసగా రెండో సెంచరీఇదిలా ఉంటే.. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగుల స్కోరు చేయడంలో సొనాల్ దినుషదే కీలక పాత్ర. ఏడో స్థానంలో వచ్చిన అతడు 162 బంతులు ఎదుర్కొని 103 పరుగులు సాధించాడు. ఇక ఫాలో ఆన్‌లో భాగంగా రెండో ఇన్నింగ్స్‌లో లంక తేలిగ్గానే తలవొంచుతుందని భావించిన టీమిండియా దినుష ఊహించని షాకిచ్చాడు.తొలి ఆసియా బ్యాటర్‌గా..ఆఖరిదైన గురువారం రోజు ఆటలో ఏడు పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మొదలుపెట్టిన దినుష.. అనూహ్య రీతిలో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీ బ్రేక్ తర్వాత తొలి బంతికే రెండు పరుగులు తీసి వంద పరుగుల మార్కు అందుకున్న అతడు.. జిడ్డు బ్యాటింగ్‌తో భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టాడు.ఇక ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లోనూ శతక్కొట్టిన సొనాల్ దినుష.. టీమిండియాతో టెస్టుల్లో ఆడిన తొలి నాలుగు ఇన్నింగ్స్‌లో వరుసగా ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించిన ఏకైక ఆసియా బ్యాటర్‌గా నిలిచాడు. గాలె టెస్టులో 100, 84.. కొలంబోలో 103, 100* స్కోర్లు సాధించి ఈ అరుదైన ఘనత అందుకున్నాడు.చదవండి: భారత జట్టు ప్రకటన.. సెహ్వాగ్ కుమారుడికి చోటు -
సచిన్ మాదిరే: శ్రీలంక ప్లేయర్‌పై బీసీసీఐ ఉపాధ్యక్షుడి ప్రశంసలు
శ్రీలంక ఆటగాడు సొనాల్ దినుషపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షడు రాజీవ్ శుక్లా ప్రశంసలు కురిపించాడు. సొనాల్ అత్యద్భుతమైన ఆటగాడని.. అతడి ఆట టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్‌ను గుర్తుకుతెస్తోందని కొనియాడాడు.కాగా టీమిండియా ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27లో భాగంగా ఆతిథ్య జట్టుతో రెండు మ్యాచ్‌లు ఆడుతోంది. ఈ క్రమంలో గాలెలో జరిగిన తొలి టెస్టులో భారత్ లంకను 165 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసింది.దినుష అద్భుత ప్రదర్శనఅయితే, ఈ మ్యాచ్‌లో శ్రీలంక యువ ఆల్‌రౌండర్ సొనాల్ దినుష మాత్రం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో సరిగ్గా సెంచరీ (100) చేసి అవుటైన ఈ 25 ఏళ్ల ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్‌లో 84 పరుగులతో ఆకట్టుకున్నాడు.ఇక కొలంబో వేదికగా ఆదివారం మొదలైన రెండో టెస్టులోనూ సొనాల్ దినుష అద్భుత ప్రదర్శన కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 163 బంతులు ఎదుర్కొన్న సొనాల్ దినుష.. 103 పరుగులు సాధించాడు. ఇందులో 8 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. పసిందు సూరియబండారా (80)తో కలిసి దినుష జట్టును ఆదుకున్నాడు.పసిందుతో కలిసి..అయితే, మొదటి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 290 పరుగులకే ఆలౌట్ కావడంతో.. భారత్‌కు 213 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. దీంతో టీమిండియా శ్రీలంకను ఫాలో ఆన్ ఆడేందుకు ఆహ్వానించింది. ఈ క్రమంలో పసిందు సూరియబండారా (92), కమిందు మెండిస్ (55) పట్టుదలగా నిలబడ్డారు. దీంతో బుధవారం నాటి నాలుగోరోజు ఆటలో లంక 16 పరుగుల స్వల్ప ఆధిక్యంలో నిలిచింది.ఇక నాలుగో రోజు ఆట పూర్తయ్యేసరికి దినుష ఏడు పరుగులు చేశాడు. అయితే, కీలకమైన గురువారం నాటి ఆఖరి రోజు ఆటలో మాత్రం దినుష భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారి భోజన విరామ సమయానికి ముందే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఈ పరిణామాల క్రమంలో రాజీవ్ శుక్లా సొనాల్ దినుషపై ప్రశంసలు కురిపించాడు.సొనాల్ అత్యద్భుతమైన ఆటగాడు‘‘శ్రీలంకకు చెందిన సొనాల్ అత్యద్భుతమైన ఆటగాడు. టెండుల్కర్లా అనిపిస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో టెస్టుల్లో గొప్ప ఆటగాడిగా ఎదగగల సత్తా అతడికి ఉంది’’ అని రాజీవ్ శుక్లా ఎక్స్ వేదికగా కొనియాడాడు. అయితే, నెటిజన్ల నుంచి ఇందుకు మిశ్రమ స్పందన వస్తోంది. దిగ్గజ సచిన్‌తో అప్‌కమింగ్ ప్లేయర్‌ను ఎలా పోలుస్తారని పలువురు రాజీవ్ శుక్లాను విమర్శిస్తున్నారు.కాగా గతేడాది దినుష బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటికి ఐదు మ్యాచ్‌లలో కలిపి 500కు పైగా పరుగులు సాధించాడు. ఇదిలా ఉంటే.. సచిన్ టెండుల్కర్ తన రెండున్నర దశాబ్దాల కెరీర్లో 200 టెస్టులు ఆడి.. 15,921 పరుగులు చేసి అత్యధిక పరుగుల వీరుడిగా చెక్కు చెదరని రికార్డు సొంతం చేసుకున్నాడు. అత్యధికంగా 51 టెస్టు సెంచరీలతో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు.చదవండి: IND vs AUS: భారత జట్టు ప్రకటన.. సెహ్వాగ్, ద్రవిడ్ కుమారులకు చోటు -
IND vs SL: భారత్-శ్రీలంక రెండో టెస్టు డ్రా
IND vs SL 2nd Test Day 5: కొలంబో వేదికగా భారత్-శ్రీలంక మధ్య జరిగిన రెండో టెస్టు డ్రా ముగిసింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-0 తేడాతో భారత్ సొంతం చేసుకుంది. ఫాలో ఆన్‌లో శ్రీలంక బ్యాటర్లు అద్భుతమైన పోరాట పటిమ కనబరిచారు. 229/6తో ఐదో రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంక.. తమ రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 429 పరుగులు చేసింది. సోనల్ దినూష (133 నాటౌట్) అజేయ సెంచరీతో టీమిండియాకు గెలుపును దూరం చేశాడు. శ్రీలంక తొమ్మిదో వికెట్ డౌన్ఎట్టకేలకు శ్రీలంక తొమ్మిదో వికెట్ కోల్పోయింది. 90 బంతులు ఆడి 12 పరుగులు చేసిన కుమార.. జడేజా బౌలింగ్‌లో ఔటయ్యాడు. శ్రీలంక ప్రస్తుతం 190 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.శతక్కొట్టిన దినుష133.1: సిరాజ్ బౌలింగ్‌లో రెండు పరుగులు తీసి సెంచరీ పూర్తి చేసుకున్న దినుష. 196 బంతుల్లో వంద మార్కుల అందుకున్న ఆల్‌రౌండర్. ఈ సిరీస్‌లో మూడో సెంచరీ పూర్తి చేసుకున్న 25 ఏళ్ల దినుష. లంక స్కోరు: 385-8. 172 పరుగుల ఆధిక్యం.పోరాడుతున్న శ్రీలంక.. సెంచరీకి చేరువలో దినుషకొలంబో టెస్టులో శ్రీలంక డ్రా దిశగా పోరాడుతోంది. ఆఖరి రోజు టీ బ్రేక్ సమయానికి శ్రీలంక తమ రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు కోల్పోయి 383 పరుగులు చేసింది. లంక ప్రస్తుతం 170 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. సోనల్ దినుష(195 బంతుల్లో 6 ఫోర్లుతో 98) సెంచరీకి చేరువలో ఉన్నాడు.150 పరుగుల ఆధిక్యంలో శ్రీలంకలాహిరు కుమార 1, దినుష 83 పరుగులతో ఉన్నారు. లంక స్కోరు: 363-8.ఎనిమిదో వికెట్ కోల్పోయిన శ్రీలంక116.3 వ ఓవర్: రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ధ్రువ్ జురెల్‌కు క్యాచ్ ఇచ్చి ఎనిమిదో వికెట్‌గా వెనుదిరిగిన ప్రబాత్ జయసూరియ. లాహిరు కుమార క్రీజులోకి వచ్చాడు. లంక స్కోరు: 355-8 (117). దినుష 76 పరుగులతో ఉన్నాడు. శ్రీలంక ఆధిక్యం 142 పరుగులు.140 పరుగుల ఆధిక్యంలో శ్రీలంకదినుష 76, ప్రబాత్ సున్నా పరుగులతో ఉన్నారు. స్కోరు: 353/7 (115).శ్రీలంక స్కోరు: 341-7 (110)దినుష 65, ప్రబాత్ సున్నా పరుగులతో ఉన్నారు. ఆధిక్యం 128 పరుగులు.ఏడో వికెట్ కోల్పోయిన శ్రీలంకటీమిండియా రెండో సెషన్‌ను ఘనంగా ఆరంభించింది. భోజన విరామం తర్వాత మానవ్ సుతార్ అటాకింగ్‌కు వచ్చి.. నాలుగో బంతికే కేశారా నువాంతను పెవిలియన్‌కు పంపాడు. జురెల్‌కు క్యాచ్ ఇచ్చి 46 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నువాంత వెనుదిరిగాడు. దీంతో లంక ఏడో వికెట్ కోల్పోయింది. స్కోరు: 330-7 (105). ప్రబాత్ జయసూరియ క్రీజులోకి రాగా.. దినుష 56 పరుగులతో ఉన్నాడు. లంక ఆధిక్యం 118 పరుగులు.తొలి సెషన్లో శ్రీలంక ఆధిపత్యంకీలకమైన ఐదో రోజు ఆటలో తొలి సెషన్లో భారత బౌలర్లు తేలిపోయారు. సొనాల్ దినుష, కేశారా నువాంత జోడీని విడదీసేందకు ఆపసోపాలు పడ్డారు. ఈ క్రమంలో దినుష అర్ధ శతకం (55*) పూర్తి చేసుకోగా.. నువాంత (46*) హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు.భోజన విరామ సమయానికి శ్రీలంక 104 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 329 పరుగులు సాధించింది. తద్వారా 116 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.నొప్పితో విలవిల్లాడిన నువాంత103.2వ ఓవర్: రవీంద్ర జడేజా వేసిన బంతి నువాంత కాలికి తగిలింది. దీంతో నొప్పితో విలవిల్లాడగా ఫిజియో వచ్చి పరిశీలించాడు. అయితే, వెంటనే నువాంత మళ్లీ బ్యాటింగ్ మొదలుపెట్టాడు. జడ్డూ ఎల్బీడబ్ల్యూకు అప్పీలు చేయగా.. అంపైర్ నుంచి ప్రతికూల ఫలితమే వచ్చింది.115 పరుగుల ఆధిక్యంలో శ్రీలంకవికెట్లు తీయలైక భారత బౌలర్ల పాట్లు.. శ్రీలంక స్కోరు: 328-6. నువాంత 46, దినుష 54 పరుగులతో ఉన్నారు.శ్రీలంక స్కోరు: 320-6 (99)దినుష 52, నువాంత 41 పరుగులతో ఉన్నారు. శ్రీలంక ఆధిక్యం 107 పరుగులు.దినుష హాఫ్ సెంచరీ99 బంతులలో యాభై పరుగులు పూర్తి చేసుకున్న దినుష. నువాంత 39 పరుగులతో ఉండగా.. లంకస్కోరు: 315-6. 102 పరుగుల ఆధిక్యంలో శ్రీలంక.శ్రీలంక స్కోరు: 306-6 (94)93 పరుగుల ఆధిక్యంలో శ్రీలంక. దినుష 42, నువాంత 37 పరుగులతో ఉన్నారు.89 పరుగుల ఆధిక్యంలో శ్రీలంకదినుష 39, నువాంత 37 పరుగులతో ఉన్నారు. స్కోరు: 302-6 (91).డ్రింక్స్ బ్రేక్ సమయానికి శ్రీలంక స్కోరు: 284-6దినుష 34, నువాంత 28 పరుగులతో ఉన్నారు. శ్రీలంక ఆధిక్యం 71 పరుగులకు చేరుకుంది. చేతిలో ఇంకా నాలుగు వికెట్లు ఉన్నాయి.శ్రీలంక స్కోరు: 276-6 (86)50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన దినుష, నువాంత. దినుష 29, నువాంత 27 పరుగులతో ఉన్నారు. 63 పరుగుల ఆధిక్యంలో శ్రీలంకనిలకడగా ఆడుతున్న దినుష, నువాంతదినుష 22, నువాంత 20 పరుగులతో ఉన్నారు. స్కోరు: 262-6 (84). 49 పరుగుల ఆధిక్యంలో శ్రీలంక. Ravindra Jadeja gets one to turn sharply as #TeamIndia hunt for wickets. 😮💨 Watch #SLvIND, 2nd Test, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #BeautifulGameOfTestCricket pic.twitter.com/cMB2L0A3Ro— Sony Sports Network (@SonySportsNetwk) August 27, 202644 పరుగుల ఆధిక్యంలో లంకదినుష 21, నువాంత 17 పరుగులతో ఉన్నారు.35 పరుగుల ఆధిక్యంలో లంకసొనాల్ దినుష 13, నువాంత 16 పరుగులతో ఉన్నారు. లంక స్కోరు: 248/6 (78)శ్రీలంక ఓవర్‌నైట్ స్కోరు: 229-6సొనాల్ దినుష ఏడు, కేశారా నువాంత మూడు పరుగులతో అజేయంగా నిలిచారు.స్వల్ప ఆధిక్యంలో లంకఫాలో ఆన్ ఆడుతున్న శ్రీలంక బుధవారం ఆట పూర్తయ్యేసరికి 72.4 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. తద్వారా 16 పరుగుల స్వల్ప ఆధిక్యంలోకి వెళ్లింది. పసిందు సూరియబండారా (92), కమిందు మెండిస్ (55) రాణించడంతో ఎట్టకేలకు లంక ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించుకోగలిగింది.సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్లో ఆదివారం మొదలైన ఈ మ్యాచ్‌లో భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 503-9 వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులకే కుప్పకూలడంతో టీమిండియా ఆతిథ్య లంకను ఫాలో ఆన్ ఆడమని చెప్పింది. కాగా వర్షం వల్ల బుధవారం నాటి నాలుగో రోజు ఆటను ముందుగానే ముగించాల్సి వచ్చింది. క్లీన్‌స్వీప్‌పై గురిఇదిలా ఉంటే.. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గాలెలో జరిగిన తొలి టెస్టులో టీమిండియా శ్రీలంకను 165 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఇదే జోరులో రెండో టెస్టులోనూ గెలిచి సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసేందుకు భారత్ సిద్ధమైంది.తుదిజట్లుభారత్యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, సారాంశ్ జైన్, మానవ్ సుతార్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణశ్రీలంకలాహిరు ఉదార, కమిల్ మిశారా, పసిందు సూరియబండారా, కమిందు మెండిస్, ధనంజయ డి సిల్వ (కెప్టెన్), సొనాల్ దినుష, నిరోషన్ డిక్వెల్లా (వికెట్ కీపర్), కేశారా నువాంత, ప్రబాత్ జయసూరియ, లాహిరు కుమార, అసిత ఫెర్నాండో.చదవండి: IND vs SL: ఫాలో ఆన్ ఆడి గెలిచిన జట్లు ఇవే! -
IND vs SL: ఎట్టకేలకు ఆధిక్యంలోకి శ్రీలంక!
టీమిండియాతో రెండో టెస్టులో ఫాలో ఆన్ ఆడుతున్న శ్రీలంక ఎట్టకేలకు ఆధిక్యంలోకి వచ్చింది. పసిందు సూరియబండారా అద్భుత ఆట తీరుతో లంక పరువును కాపాడాడు. కాగా కొలంబో వేదికగా శ్రీలంక- భారత్ మధ్య నిర్ణయాత్మక రెండో టెస్టు ఆదివారం మొదలైన సంగతి తెలిసిందే.సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగి.. 503-9 వద్ద తమ మొదటి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. దేవదత్ పడిక్కల్ (117), ధ్రువ్ జురెల్ (115 నాటౌట్) శతకాల వల్ల భారత్ భారీ స్కోరు సాధించగలిగింది.290 రుగులకే ఆలౌట్అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక బుధవారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా.. తొలి ఇన్నింగ్స్‌లో 290 రుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్ల దాటికి లంక టాపార్డర్ కుదేలు కాగా.. నాలుగో స్థానంలో వచ్చిన పసిందు సూరియబండారా (80) జట్టును ఆదుకున్నాడు. ఇక ఆల్‌రౌండర్ సొనాల్ దినుష శతకం (103)తో చెలరేగాడు. దీంతో లంక దాదాపు మూడు వందల పరుగులకు చేరువకాగలిగింది.ఫాలో ఆన్భారత బౌలర్లలో మానవ్ సుతార్, ప్రసిద్ కృష్ణ చెరో మూడు వికెట్లు కూల్చగా.. అరంగేట్ర ఆటగాడు సారాంశ్ రెండు, మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా తలా ఒక వికెట్ పడగొట్టారు. ఇక లంకను 290 పరుగులకే ఆలౌట్ చేసిన టీమిండియాకు తొలి ఇన్నింగ్స్‌లో 213 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. దీంతో ఫాలో ఆన్‌లో భాగంగా వెంటనే శ్రీలంకను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.రాణించిన పసిందు, కమిందుఈ క్రమంలో బుధవారం రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన కాసేపటికే శ్రీలంక తమ ఓపెనర్ లాహిరు ఉదార (3) వికెట్ కోల్పోయింది. అయితే, మరో ఓపెనర్ కమిల్ మిశార (32)తో కలిసి వన్‌డౌన్ బ్యాటర్ పసిందు రెండో వికెట్‌కు 58 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. ఆ తర్వాత కమిందు మెండిస్‌తో కలిసి మూడో వికెట్‌కు 115 పరుగులు జోడించాడు.ఈ క్రమంలో కమిందు అర్ధ శతకం (55) పూర్తి చేసుకున్న తర్వాత అవుట్ కాగా.. పసిందు సెంచరీ దిశగా పయనించాడు. అయితే, మానవ్ సుతార్ స్పిన్ మాయలో చిక్కుకుని.. 92 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. మిగతా వారిలో కెప్టెన్ ధనంజయ డి సిల్వ 23 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. వికెట్ కీపర్ బ్యాటర్ నిరోషన్ డిక్వెల్లా (6) విఫలమయ్యాడు.ఎట్టకేలకు ఆధిక్యంలోకి లంకఅయితే, వర్షం వల్ల ముందుగానే ఆటను నిలిపివేశారు. మొత్తానికి నాలుగో రోజు ఆట పూర్తయ్యే సమయానికి శ్రీలంక ఆరు వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. తద్వారా 16 పరుగుల స్వల్ప ఆధిక్యం సంపాదించింది. సెంచరీ వీరుడు సొనాల్ దినుష ఏడు, కేశారా నువాంత మూడు పరుగులతో అజేయంగా నిలిచారు.భారత బౌలర్లలో మానవ్ సుతార్ రెండు వికెట్లు తీయగా.. ప్రసిద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, సారాంశ్ జైన్, రవీంద్ర జడేజా తలా ఒక వికెట్ పడగొట్టారు. ఆటకు గురువారమే చివరి రోజు. అయితే, బుధవారం వర్షం వల్ల ముందుగానే ఆటను నిలిపివేసిన క్రమంలో గురువారం ఉదయం 9.45 నిమిషాలకే మ్యాచ్ ఆరంభమవుతుంది. ఇదిలా ఉంటే.. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇప్పటికే గాలెలో టీమిండియా గెలుపొందింది. కొలంబోలోనూ భారత్ గెలుపు దాదాపు ఖాయమైంది. అయితే, వర్షం ముప్పు కారణంగా గురువారం వీలైనంత త్వరగా లంకను ఆలౌట్ చేసి.. విజయం సాధించాలని టీమిండియా పట్టుదలగా ఉంది.చదవండి: IND vs SL: ఫాలో ఆన్ ఆడి గెలిచిన జట్లు ఇవే! -
IND vs SL: చరిత్ర సృష్టించిన శ్రీలంక ఆల్‌రౌండర్
టీమిండియాతో టెస్టుల్లో శ్రీలంక ప్రదర్శన ఎలా ఉన్నా.. ఆ జట్టు ఆల్‌రౌండర్ సొనాల్ దినుష మాత్రం అదరగొడుతున్నాడు. గాలె వేదికగా తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మిగతా బ్యాటర్లంతా విఫలమైన చోట సొనాల్ దినుష సెంచరీ (100)తో మెరిశాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ 84 పరుగులతో ఆకట్టుకున్నాడు.భారత్ భారీ స్కోరుఅదే విధంగా.. భారత్‌తో రెండో టెస్టులోనూ సొనాల్ దినుష అద్భుత ప్రదర్శన కనబరిచాడు. కొలంబో వేదికగా టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసి... 503-9 వద్ద తమ మొదటి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక టాపార్డర్‌ను భారత బౌలర్లు కుప్పకూల్చారు. ఓపెనర్లు లాహిరు ఉదార (1), కమిల్ మిశారా (19)లను ప్రసిద్ కృష్ణ పెవిలియన్‌కు పంపగా.. వన్‌డౌన్‌లో వచ్చిన ప్రభాత్ జయసూరియ (2)ను మానవ్ సుతార్ అవుట్ చేశాడు.పసిందు పోరాటంఇలా జట్టు కష్టాల్లో కూరుకుపోగా పసిందు సూరియబండారా (80), కమిందు మెండిస్ (32) కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దారు. వీళ్లిద్దరు అవుటైన తర్వాత శ్రీలంక నామమాత్రపు స్కోరుకే ఆలౌట్ అవుతుందని భావించగా.. సొనాల్ దినుష నేనున్నానంటూ మరోసారి ఆపన్నహస్తం అందించాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఈ ఆల్‌రౌండర్ శతక్కొట్టాడు.సెంచరీ చేశాడు.. కానీమొత్తంగా 162 బంతులు ఎదుర్కొన్న సొనాల్ దినుష.. 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 103 పరుగులు సాధించాడు. పసిందుతో కలిసి 34, కేశారా నువాంతతో కలిసి 57, లాహిరు కుమారతో కలిసి 58 పరుగులు జోడించి.. జట్టు పరువును కాపాడగలిగాడు. అయితే, ఫాలో ఆన్ గండం నుంచి మాత్రం తప్పించలేకపోయాడు. కొలంబోలో నాలుగో రోజు ఆటలో భాగంగా భారత స్పిన్నర్ సారాంశ్ జైన్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి సొనాల్ దినుష పదో వికెట్‌గా వెనుదిరిగాడు.సరికొత్త చరిత్ర అయితే, తన అద్భుతమైన ఆట తీరుతో 25 ఏళ్ల సొనాల్ దినుష శ్రీలంక తరఫున సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీమిండియాతో టెస్టుల్లో బ్యాటింగ్ ఆర్డర్లో ఆరు లేదంటే అంతకంటే దిగువ స్థానంలో వచ్చి అత్యధిక సెంచరీలు బాదిన తొలి లంక ఆటగాడిగా రికార్డు సాధించాడు. గాలె, కొలంబో టెస్టుల్లో శతకాలు బాది ఈ ఘనత సాధించాడు. కాగా దినుష గతేడాది జూన్‌లో అరంగేట్రం చేశాడు. ఇదిలా ఉంటే.. లంకను 290 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్.. తొలి ఇన్నింగ్స్‌లో 213 పరుగుల ఆధిక్యం సంపాదించింది. ఈ క్రమంలో లంకను ఫాలో ఆన్ ఆడిస్తోంది. కాగా గాలె టెస్టులో శ్రీలంక టీమిండియా చేతిలో 165 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే.టీమిండియాతో టెస్టుల్లో ఆరు లేదంటే అంతకంటే దిగువ స్థానంలో వచ్చి అత్యధిక సెంచరీలు బాదిన శ్రీలంక క్రికెటర్లుసొనాల్ దినుష- 2 శతకాలుదినేశ్ చండిమాల్-1 శతకంతిలక్రత్నె దిల్షాన్-1 శతకంప్రసన్న జయవర్దనె-1 శతకంఅర్జున రణతుంగ-1 శతకంతిలాన్ సమరవీర-1 శతకంహషాన్ తిలకరత్నె-1 శతకం.A STAR IN THE MAKING! ⭐ Against all odds, Sonal Dinusha stood tall with a brilliant century to keep Sri Lanka’s hopes alive. 💪 Watch #SLvIND, 2nd Test, LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV. #SonySportsNetwork #SonyLIV #BeautifulGameOfTestCricket pic.twitter.com/YoMY8T0h3I— Sony Sports Network (@SonySportsNetwk) August 26, 2026చదవండి: టెస్టు క్రికెట్లో ఫాలో ఆన్ అంటే? -
శ్రీలంక ఆలౌట్.. ఫాలో ఆన్ ఆడిస్తున్న టీమిండియా
టీమిండియాతో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 290 పరుగులకు ఆలౌట్ అయింది. పసిందు సూరియబండారా భారీ అర్ధ శతకం (80)తో రాణించగా.. సొనాల్ దినుష శతక్కొట్టాడు. ఏడో స్థానంలో వచ్చిన దినుష 162 బంతులు ఎదుర్కొని 103 పరుగులు సాధించాడు. అయితే, మిగతా వారంతా విఫలం కావడంతో శ్రీలంకకు ఫాలో ఆన్ గండం తప్పలేదు.కాగా కొలంబో వేదికగా శ్రీలంక- భారత్ మధ్య ఆదివారం రెండో టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. దేవదత్ పడిక్కల్ (117) శతక్కొట్టగా.. ధ్రువ్ జురెల్ అజేయ శతకం (115) సాధించాడు. వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (63), కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (50) హాఫ్ సెంచరీలతో అలరించగా.. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 45 పరుగులతో రాణించాడు.ఫలితంగా సోమవారం నాటి రెండో రోజు ఆటలో భారత్ 503-9 పరుగుల భారీ స్కోరు వద్ద తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. లంక బౌలర్లలో అసిత ఫెర్నాండో నాలుగు వికెట్లతో చెలరేగగా.. ప్రభాత్ జయసూరియ, కేశారా నువాంత చెరో రెండు వికెట్లు తీశారు. లాహిరు కుమారకు ఒక వికెట్ దక్కింది.అనంతరం బ్యాటింగ్‌కు దిగిన లంక రెండో ఆటలో రెండు వికెట్ల నష్టానికి కేవలం ఎనిమిది పరుగులే చేసింది. ఈ క్రమంలో 8/2 ఓవర్ నైట్ స్కోరుతో మంగళవారం నాటి మూడో రోజు ఆట మొదలుపెట్టిన శ్రీలంకకు పసిందు ఊపిరిలూదాడు. మొత్తంగా 133 బంతుల్లో 80 పరుగులు సాధించాడు. అయితే, రవీంద్ర జడేజా బౌలింగ్‌లో బౌల్డ్ కావడంతో అతడి ఇన్నింగ్స్‌కు తెరపడింది.మిగతా వారిలో కమిందు మెండిస్ (32) ఓ మోస్తరుగా రాణించగా.. కెప్టెన్ ధనంజయ డి సిల్వ (8), వికెట్ కీపర్ బ్యాటర్ నిరోషన్ డిక్వెల్లా (0) పూర్తిగా విఫలమయ్యారు. ఇలాంటి దశలో సొనాల్ దినుష పట్టుదలగా నిలబడ్డాడు. ఫలితంగా మూడో రోజు ఆట ముగిసే సరికి శ్రీలంక ఎనిమిది వికెట్ల నష్టానికి 265 పరుగులు చేయగలిగింది.ఇక బుధవారం నాటి నాలుగో రోజు ఆటను 265/8తో మొదలుపెట్టగా.. సారాంశ్ జైన్ లాహిరు కుమార (12)ను వెనక్కి పంపాడు. అప్పటికే సెంచరీ పూర్తి చేసుకున్న దినుషను సైతం సారాంశ్ పెవిలియన్‌కు పంపడంతో లంక ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో ప్రసిద్ కృష్ణ, మానవ్ సుతార్ మూడేసి వికెట్లు పడగొట్టగా.. సారాంశ్ జైన్‌కు రెండు, మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజాలకు తలా ఒక వికెట్ దక్కాయి. ఫాలో ఆన్ అంటే?టెస్టు క్రికెట్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు.. సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టు కంటే తొలి ఇన్నింగ్స్‌లో కనీసం 200 లేదా అంతకంటే ఎక్కువ ఆధిక్యంలో ఉంటే.. ఫాలో ఆన్ ఆడిస్తుంది. అంటే.. సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టు ఆలౌట్ కాగానే మళ్లీ బ్యాటింగ్ చేయమని కోరుతుంది. మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (MCC)లోని 14.1.1 నిబంధన ప్రకారం తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యంలో ఉన్న జట్టుకు ఈ హక్కు లభిస్తుంది. భారత్- శ్రీలంక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. లంకను 290 పరుగులకు ఆలౌట్ చేసింది. తద్వారా తొలి ఇన్నింగ్స్‌లో 213 పరుగుల ఆధిక్యం సాధించింది. కాబట్టి ఫాలో ఆన్ ఆడిస్తోంది. అసలే ఈ మ్యాచ్‌కు వాన ముప్పు ఉంది. మరోవైపు ఆట ఇప్పటికే నాలుగో రోజుకు చేరుకుంది. దీంతో టీమిండియా ఫాలో ఆన్‌కు మొగ్గుచూపింది. కాగా తొలి టెస్టులో భారత్ 165 పరుగుల భారీ తేడాతో శ్రీలంకను చిత్తు చేసిన సంగతి తెలిసిందే.చదవండి: భువీ విజృంభణ -
జిడ్డులా తగులుకున్నాడు.. లంక బ్యాటర్ అరుదైన రికార్డు!
కొలంబో వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక బ్యాటర్ సోనల్ దినూష ఒంటరిపోరాటం చేస్తున్నాడు. మూడోరోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 8 వికెట్లు కోల్పోయినప్పటికీ దినూష వికెట్ తీయడంలో మాత్రం భారత బౌలర్లు విఫలమయ్యారు. ప్రస్తుతం దినూష 85 పరుగులతో అజేయంగా క్రీజులో ఉన్నాడు.తొలి టెస్టులో సెంచరీతో మెరిసిన దినూష రెండో టెస్టులోనూ లంక పాలిట ఆపద్బాంధవుడయ్యాడు. ఒకపక్క వరుసగా వికెట్లు పడుతున్నప్పటికీ, దినూష మాత్రం తన బ్యాటింగ్‌తో భారత్‌కు కొరకరాని కొయ్యలా తయారయ్యాడు. ఈ నేపథ్యంలోనే సోనల్ దినూష టెస్టుల్లో ఒక అరుదైన రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు.భారత్‌తో జరిగిన టెస్టుల్లో తొలి మూడు ఇన్నింగ్స్‌ల్లో 80 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు సాధించిన మూడో బ్యాటర్‌గా దినూష నిలిచాడు. తొలి టెస్టులో దినూష మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో 84 పరుగులు, తాజాగా రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 85 పరుగులతో అజేయంగా కొనసాగుతున్నాడు. గతంలో జహీర్ అబ్బాస్ (176, 96, 235 నాటౌట్), ఎవర్టన్ వీక్స్ (128, 194, 162) భారత్‌పై ఈ ఫీట్ అందుకున్నారు. అయితే భారత్‌పై టెస్టుల్లో తొలి నాలుగు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు బాదిన ఏకైక బ్యాటర్‌గా ఎవర్టన్ వీక్స్ నిలిచాడు.స్వీప్ షాట్లతో మరో రికార్డుపనిలో పనిగా దినూష మరో రికార్డు కూడా అందుకున్నాడు. అదేంటంటే, ఒక టెస్టు సిరీస్‌లో స్పిన్నర్ల బౌలింగ్‌లో స్వీప్ షాట్లు ఆడుతూ ఎక్కువ పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో దినూష (106 పరుగులు) ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్‌తో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. తొలి స్థానం కూడా జో రూట్‌దే.2021లో శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో రూట్ స్పిన్నర్ల బౌలింగ్‌లో స్వీప్ షాట్లు ఆడి 160 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత మరో ఇంగండ్ బ్యాటర్ బెన్ డకెట్ 2022లో పాకిస్తాన్ తో టెస్టు సిరీస్‌లో స్వీప్ షాట్ల రూపంలో 112 పరుగులు సాధించాడు. దినూష తర్వాత యూనిస్ ఖాన్ (103 పరుగులు), మిస్బా ఉల్ హక్ (103 పరుగులు) సంయుక్తంగా నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు.లంక తరఫున రెండో బ్యాటర్గాశ్రీలంక తరఫున భారత్‌పై తొలి మూడు టెస్టు ఇన్నింగ్స్‌లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించిన రెండో బ్యాటర్‌గానూ సోనల్ దినూష నిలిచాడు. గతంలో 1982లో దులీప్ మెండిస్ భారత్‌పై వరుసగా 105, 105, 51 పరుగులు సాధించాడు. సోనల్ దినూష స్పిన్ బౌలింగ్‌లో సాధించిన 284 పరుగుల్లో 122 రన్స్ (42.95 శాతం) స్వీప్, స్లాగ్, రివర్స్ షాట్ల ద్వారా సాధించడం విశేషం. ఇందులో 11 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. మ్యాచ్ విషయానికొస్తే.. మూడోరోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. సోనల్ దినూష (85), లాహిరు కుమారా (8) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో మానవ్ సుతార్, ప్రసిధ్ క్రిష్ణలు చెరో 3 వికెట్లు తీశారు. లంక మరో 238 పరుగులు వెనుకబడి ఉంది. అంతకముందు టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌ను 503/9 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. పడిక్కల్, ధ్రువ్ జురెల్ శతకాలతో చెలరేగారు.Sonal Dinusha keeps Sri Lanka’s hopes alive against India in Colombo 👊#WTC27 📝: https://t.co/8NP3Qr1pnQ pic.twitter.com/3HMx47B3av— ICC (@ICC) August 25, 2026Sonal Dinusha is only the second Sri Lankan batter to score three consecutive 50+ scores in his first three Test innings against India! 🇱🇰🤍🌟#SLvIND #Tests #WTC #Sportskeeda pic.twitter.com/DlAq45rejU— Sportskeeda (@Sportskeeda) August 25, 2026Read: ఆసీస్ తరఫున క్రికెట్ ఆడనున్న సంజయ్ బంగర్ కుమార్తె! -
మెరిసిన పసిందు, దినుష.. ఇంకా వెనుకబడే ఉన్న శ్రీలంక
టీమిండియాతో రెండో టెస్టు మూడో రోజు ఆటలో శ్రీలంక పోరాట పటిమ కనబరిచింది. కొలంబోలో 8/2 ఓవర్‌నైట్ స్కోరుతో మంగళవారం ఆట మొదలుపెట్టింది ఆతిథ్య జట్టు. కాసేటికే ఓపెనర్ కమిల్ మిశారా (19) వెనుదిరిగినప్పటికీ.. నాలుగో నంబర్ బ్యాటర్ పసిందు సూరియబండారా పట్టుదలగా నిలబడ్డాడు.మెరిసిన పసిందుభారత బౌలర్ల సహనానికి పరీక్ష పెడుతూ.. కమిందు మెండిస్‌తో కలిసి ఐదో వికెట్‌కు 87 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. మొత్తంగా 133 బంతులు ఎదుర్కొన్న పసిందు తొమ్మిది ఫోర్ల సాయంతో 80 పరుగులు సాధించాడు. అయితే, సెంచరీ దిశగా పయనిస్తున్న వేళ రవీంద్ర జడేజా అద్భుత బంతితో పసిందును బౌల్డ్ చేశాడు. దీంతో టీమిండియాకు మంచి బ్రేక్ లభించింది.మిగిలిన వారిలో కమిందు మెండిస్ (32) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ ధనంజయ డి సిల్వ (8) విఫలమయ్యాడు. వికెట్ కీపర్ బ్యాటర్ నిరోషన్ డిక్వెల్లా డకౌట్ అయి నిరాశపరచగా.. ఈసారి సొనాల్ దినుష బాధ్యత తీసుకున్నాడు. అతడికి తోడుగా కేశారా నువాంత (74 బంతుల్లో 18) నిలబడ్డాడు.దినుష పోరాటంమంగళవారం ఆట ముగిసే సమయానికి దినుష 137 బంతుల్లో 85 పరుగులతో అజేయంగా నిలవగా.. అతడికి తోడుగా లాహిరు కుమార (8*) నిలిచాడు. వర్షం వల్ల భోజన విరామం తర్వాత ఆటకు అంతరాయం కలిగింది. ఆ తర్వాత చాలా సేపు ఆట కొనసాగగా.. మూడో సెషన్‌ను మధ్యాహ్నం 3.45 నుంచి సాయంత్రం 5.45 నిమిషాల వరకు నిర్వహించాలని భావించారు. అయితే, మరోసారి వర్షం వల్ల అంతరాయం కలగడంతో దాదాపు ఇరవై ఎనిమిది నిమిషాలకు ముందుగానే ఆటను నిలిపివేశారు. అప్పటికి శ్రీలంక ఎనిమిది వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా కంటే.. ఇంకా 238 పరుగులు వెనుబడి ఉంది. ఓవరాల్‌గా భారత బౌలర్లలో ప్రసిద్ కృష్ణ, మానవ్ సుతార్ చెరో మూడు వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్ తలా ఒక వికెట్ పడగొట్టారు. కాగా రెండో రోజు ఆటలో భారత్ తొమ్మిది వికెట్ల నష్టానికి 503 పరుగుల వద్ద తమ మొదటి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే.చదవండి: టెక్నిక్ లేకుండా ఆడతాడు.. పంత్‌కు అదొక్కటే ప్లస్! -
ఇదేం గేమ్ ప్లాన్?: టీమిండియాపై విమర్శలు
టీమిండియా- శ్రీలంక మధ్య తొలి టెస్టు తుది అంకానికి చేరుకుంది. వర్షం వల్ల గనుక అంతరాయం కలగకుంటే.. ఆటకు చివరి రోజైన బుధవారం ఫలితం తేలే అవకాశం ఉంది. కాగా భారత్ ఈ మ్యాచ్‌లో గెలవాలంటే ఆఖరి రోజు వీలైనంత త్వరగా ఆరు వికెట్లు తీయాల్సి ఉంది.టార్గెట్ 372గాలె వేదికగా శనివారం మొదలైన ఈ టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో 462 పరుగులకు ఆలౌట్ అయిన గిల్ సేన.. శ్రీలంకను 284 పరుగులకు కట్టడి చేసింది.తద్వారా 178 పరుగుల భారీ ఆధిక్యంతో మంగళవారం నాడు నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్.. 193 పరుగులకు ఆలౌట్ అయింది. తద్వారా శ్రీలంకకు 372 పరుగుల భారీ లక్ష్యాన్ని విధించింది. ఈ క్రమంలో మంగళవారం ఆట ముగిసే సరికి లంక నాలుగు వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. ఆరంభంలో లంక త్వరత్వరగా వికెట్లు కోల్పోయినప్పటికీ.. కెప్టెన్ ధనంజయ డి సిల్వ, సొనాల్ దినుష పట్టుదలగా నిలబడి ఇన్నింగ్స్ చక్కదిద్దారు.వాన వల్ల అంతరాయం కలిగితే?ఈ నేపథ్యంలో మంగళవారం ఆట సందర్భంగా టీమిండియా నాయకత్వ బృందం అనుసరించిన వ్యూహాన్ని ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే విమర్శించాడు. వర్షం ముప్పు ఉన్న ఈ మ్యాచ్‌లో భారత్‌కు ఆఖరి రోజు లంకను ఆలౌట్ చేసే అవకాశాలు తక్కువని పేర్కొన్నాడు. టీమిండియాపై విమర్శలునిజానికి రెండో ఇన్నింగ్స్‌లో కాస్త వేగంగా ఆడటం లేదంటే.. ఇన్నింగ్స్ కాస్త ముందుగానే డిక్లేర్ చేసి ఉంటే బాగుండేదని హర్ష అభిప్రాయపడ్డాడు. ‘‘నాలుగో రోజు ఆటలో ఆఖరి నలభై నిమిషాల్లో టీమిండియా వైఖరి నాకెందుకో అంతుపట్టలేదు. బ్యాటర్లు చాలా సమయం తీసుకున్నారు. కానీ స్కోరు బోర్డు మీద కావాల్సినన్ని పరుగులు జమచేయలేకపోయారు.వాతావరణం అసలే బాగాలేదు. అలాంటపుడు ఇలా చేయడం ఎంతమాత్రం సరికాదు. గ్రౌండ్ సిబ్బంది కవర్లు కప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. అయినా కూడా టీమిండియా మాత్రం నెమ్మదిగా ఆడింది’’ అని హర్షా భోగ్లే భారత జట్టు ఆట తీరును తప్పుబట్టాడు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టాడు. కాగా బుధవారం నాటి ఆటలో ధనంజయ డి సిల్వ, సొనాల్ దినుష అర్ధ శతకాలు పూర్తి చేసుకున్నారు. డ్రింక్స్ బ్రేక్ సమయానికి శ్రీలంక విజయానికి 234 పరుగుల దూరంలో నిలిచింది.చదవండి: శుభవార్త చెప్పిన గ్లెన్ మాక్స్వెల్ -
టీమిండియాకు బ్యాడ్‌న్యూస్!
శ్రీలంకతో తొలి టెస్టులో పట్టు బిగిస్తున్న టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో స్టార్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ గాయపడ్డాడు. నొప్పితో విలవిల్లాడుతూ మైదానం వీడాడు. అతడి స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ ఫీల్డింగ్‌కు వచ్చాడు.ఆరంభంలోనే చెలరేగిన బౌలర్లుకాగా గాలె వేదికగా మొదటి టెస్టులో టీమిండియా శ్రీలంకకు 372 పరుగుల లక్ష్యాన్ని విధించింది. ఈ క్రమంలో ఛేదనకు దిగిన ఆతిథ్య జట్టు.. 47 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్ నిశాన్ మధుష్క (6)ను అవుట్ చేసి సిరాజ్ వికెట్ల వేటను ఆరంభించాడు.అనంతరం స్పిన్నర్ మానవ్ సుతార్ వన్‌డౌన్‌లో వచ్చిన పసిందు సూరియబండారాను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో అతడు గోల్డెన్ డకౌట్‌గా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత ప్రసిద్ కృష్ణ కమిందు మెండిస్ (2)ను అవుట్ చేయగా.. సుతార్ బౌలింగ్‌లో లాహిరు ఉదార (16) నాలుగో వికెట్‌గా వెనుదిరిగాడు.నిలకడగా ధనంజయ, దినుషఈ క్రమంలో కెప్టెన్ ధనంజయ డి సిల్వకు తోడైన సొనాల్ దినుష నిలకడగా ఆడుతూనే వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలిస్తున్నాడు. అయితే, లంక రెండో ఇన్నింగ్స్‌లో 28వ ఓవర్లో మానవ్ సుతార్ బంతితో రంగంలోకి దిగి.. ఫ్లైటెడ్ డెలివరీని సంధించాడు. బంతి బలంగా తాకడంతోదీంతో స్వీప్ షాట్ ఆడే ప్రయత్నంలో దినుష బంతిని బలంగా బాదగా.. ఫీల్డర్ జురెల్ కాళ్లకు తాకింది. అతడు నొప్పితో విలవిల్లాడగా ఫిజియో వచ్చి పరిశీలించాడు. నొప్పి తగ్గకపోవడంతో ఫిజియో సాయంతో జురెల్ మైదానాన్ని వీడగా.. సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా సర్ఫరాజ్ ఖాన్ మైదానంలోకి వచ్చాడు. కాగా గాలె వేదికగా తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో జురెల్ హాఫ్ సెంచరీ (51) చేశాడు. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం ఏడు పరుగులే చేసి అవుటయ్యాడు.ఇదిలా ఉంటే.. మంగళవారం నాటి నాలుగో రోజు ఆట పూర్తయ్యేసరికి శ్రీలంక నాలుగు వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. ధనంజయ 31, దినుష 25 పరుగులతో క్రీజులో నిలిచారు. లంక గెలవాలంటే ఆటకు చివరి రోజైన బుధవారం లంకకు 288 పరుగులు అవసరం. ఇక టీమిండియా గెలవాలంటే వీలైనంత త్వరగా ఆఖరి రోజు ఆరు వికెట్లు తీయాలి.చదవండి: IND vs SL: గాలెలో అత్యధిక పరుగుల లక్ష్య ఛేదన ఎంతో తెలుసా? -
టీమిండియాపై వీరోచిత సెంచరీ.. ఎవరీ సోనల్ దినూష?
గాలే వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక యువ బ్యాటర్ సోనల్ దినూష అద్భుతమైన పోరాట పటిమ కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 90 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన దినుష తన వీరోచిత సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. ఈ యంగ్ బ్యాటర్ డిక్వెల్లతో కలిసి 6వ వికెట్‌కు 146 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 25 ఏళ్ల దినుషకు ఇదే తొలి అంతర్జాతీయ సెంచరీ. ఈ క్రమంలో సోనాల్ దినూషకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.17 ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఎంట్రీ👉సోనాల్ దినూష కేవలం 17 ఏళ్లకే కొలంబో క్రికెట్ క్లబ్ తరఫున ఫస్ట్ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. 2018లో అరంగేట్రం చేసిన అతడు ఇప్పటివరకు 68 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌లలో సోనాల్ 45.09 సగటుతో 3,698 పరుగులు చేశాడు. ఇందులో 11 సెంచరీలు, 19 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అంతేకాకుండా దినుష బంతితో కూడా మ్యాజిక్ చేయగలడు. లెఫ్టార్మ్ స్పిన్నర్‌గా అతడు ఫస్ట్ క్రికెట్లో ఇప్పటివరకు 133 వికెట్లు పడగొట్టాడు.👉కొలంబో క్రికెట్ క్లబ్ తరఫున మేజర్ లీగ్ టోర్నీలో దినూష ఓ అరుదైన రికార్డును సాధించాడు. ఓపెనింగ్ బ్యాటర్‌గా, ఓపెనింగ్ బౌలర్‌గా బరిలోకి దిగి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఆ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో అతడు అదరగొట్టాడు. మ్యాచ్ మొత్తంలో 11 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు.👉ఆతర్వాత సౌతాఫ్రికా వేదికగా జరిగిన అండర్ 19 ప్రపంచకప్-2026లో శ్రీలంక జట్టులో దినుష భాగమయ్యాడు. ఈ టోర్నీలో ఆల్‌రౌండర్‌గా తన సేవలను అందించాడు. లోయార్డర్‌లో వచ్చి మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడడం అతడి స్పెషాలిటీ.👉దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తుండడంతో గతేడాది జాన్‌లో శ్రీలంక జాతీయ జట్టు సెలక్టర్ల నుంచి దినూషకు పిలుపువచ్చింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌పై టెస్టు అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత వెస్టిండీస్ టూర్లో కూడా భాగమయ్యాడు. ఇప్పటివరకు కేవలం 4 టెస్టులు మాత్రమే ఆడిన దినుష.. 57.2 సగటుతో 286 పరుగులు చేశాడు. అదేవిధంగా 6 వికెట్లు సాధించాడు.👉సోనాల్ దినూష ప్రతిష్టాత్మక మహానామ కాలేజీలో విధ్యను అభ్యసించాడు. ఈ కాలేజీకి శ్రీలంక క్రికెట్ చరిత్రలో ఓ ప్రత్యేకమైన స్ధానముంది. ఈ కళశాలలో చదివిన చాలా మంది విద్యార్థులు శ్రీలంక జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు.ప్రస్తుత లంక టెస్ట్ కెప్టెన్ ధనంజయ డి సిల్వా కూడా ఈ కాలేజీకి చెందినవాడే కావడం గమనార్హం. -
IND vs SL: చరిత్ర సృష్టించిన శ్రీలంక జోడి
టీమిండియాతో తొలి టెస్టులో శ్రీలంక తిరిగి పుంజుకుంది. సోమవారం నాటి మూడో రోజు ఆట సందర్భంగా బ్యాటింగ్‌కు దిగిన లంక జట్టు.. 99 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. ఓపెనర్లలో నిశాన్ ఫెర్నాండో డకౌట్ కాగా.. లాహిరు ఉదార 27 పరుగులు చేయగలిగాడు. వన్‌డౌన్ బ్యాటర్ దినేశ్ చండిమాల్ (4), కమిందు మెండిస్ (14) విఫలం కాగా.. కెప్టెన్ ధనంజయ డి సిల్వ 21 పరుగులకే పెవిలియన్ చేరాడు.ఈ క్రమంలో 99 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన శ్రీలంకను ఆరో నంబర్ బ్యాటర్ సొనాల్ దినుష, వికెట్ కీపర్ బ్యాటర్ నిరోషన్ డిక్వెల్లా కలిసి ఆదుకున్నారు. వీరిద్దరూ పట్టుదలగా నిలబడి భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారారు.అయితే, ప్రసిద్ కృష్ణ బౌలింగ్‌లో రిషభ్ పంత్‌కు క్యాచ్ ఇవ్వడంతో డిక్విల్లా ఇన్నింగ్స్‌కు తెరపడింది. మొత్తంగా 115 బంతులు ఎదుర్కొన్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. ఏడు ఫోర్ల సాయంతో 80 పరుగులు సాధించాడు. సొనాల్ దినుషతో కలిసి ఆరో వికెట్‌కు 146 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.ఈ క్రమంలో సొంతగడ్డ మీద టీమిండియాతో టెస్టుల్లో ఆరో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా సొనాల్ దినుష- నిరోషన్ డిక్వెల్లా చరిత్ర సృష్టించారు. ఇంతకు ముందు ఈ రికార్డు ఏంజెలో మాథ్యూస్, కుశాల్ పెరీరా పేరిట ఉండేది. ఇదిలా ఉంటే.. దినుష సెంచరీ చేసి అవుటయ్యాడు.స్వదేశంలో భారత్‌తో టెస్టుల్లో ఆరో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన శ్రీలంక జోడీలు1. సొనాల్ దినుష- నిరోషన్ డిక్వెల్లా- 146 పరుగులు2. ఏంజెలో మాథ్యూస్- కుశాల్ పెరీరా- 135 పరుగులు3. దినేశ్ చండిమాల్- లాహిరు తిరిమన్నె- 125 పరుగులు4. మహేళ జయవర్దనె- హషాన్ తిలకరత్నె- 95 పరుగులు5. టీఎల్ దిల్షాన్- ప్రసన్న జయవర్దనె- 91 పరుగులు.


