Photo Credit: Twitter
కొలంబో వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక బ్యాటర్ సోనల్ దినూష ఒంటరిపోరాటం చేస్తున్నాడు. మూడోరోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 8 వికెట్లు కోల్పోయినప్పటికీ దినూష వికెట్ తీయడంలో మాత్రం భారత బౌలర్లు విఫలమయ్యారు. ప్రస్తుతం దినూష 85 పరుగులతో అజేయంగా క్రీజులో ఉన్నాడు.
తొలి టెస్టులో సెంచరీతో మెరిసిన దినూష రెండో టెస్టులోనూ లంక పాలిట ఆపద్బాంధవుడయ్యాడు. ఒకపక్క వరుసగా వికెట్లు పడుతున్నప్పటికీ, దినూష మాత్రం తన బ్యాటింగ్‌తో భారత్‌కు కొరకరాని కొయ్యలా తయారయ్యాడు. ఈ నేపథ్యంలోనే సోనల్ దినూష టెస్టుల్లో ఒక అరుదైన రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు.
భారత్‌తో జరిగిన టెస్టుల్లో తొలి మూడు ఇన్నింగ్స్‌ల్లో 80 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు సాధించిన మూడో బ్యాటర్‌గా దినూష నిలిచాడు. తొలి టెస్టులో దినూష మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో 84 పరుగులు, తాజాగా రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 85 పరుగులతో అజేయంగా కొనసాగుతున్నాడు. గతంలో జహీర్ అబ్బాస్ (176, 96, 235 నాటౌట్), ఎవర్టన్ వీక్స్ (128, 194, 162) భారత్‌పై ఈ ఫీట్ అందుకున్నారు. అయితే భారత్‌పై టెస్టుల్లో తొలి నాలుగు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు బాదిన ఏకైక బ్యాటర్‌గా ఎవర్టన్ వీక్స్ నిలిచాడు.
స్వీప్ షాట్లతో మరో రికార్డు
పనిలో పనిగా దినూష మరో రికార్డు కూడా అందుకున్నాడు. అదేంటంటే, ఒక టెస్టు సిరీస్‌లో స్పిన్నర్ల బౌలింగ్‌లో స్వీప్ షాట్లు ఆడుతూ ఎక్కువ పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో దినూష (106 పరుగులు) ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్‌తో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. తొలి స్థానం కూడా జో రూట్‌దే.
2021లో శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో రూట్ స్పిన్నర్ల బౌలింగ్‌లో స్వీప్ షాట్లు ఆడి 160 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత మరో ఇంగండ్ బ్యాటర్ బెన్ డకెట్ 2022లో పాకిస్తాన్ తో టెస్టు సిరీస్‌లో స్వీప్ షాట్ల రూపంలో 112 పరుగులు సాధించాడు. దినూష తర్వాత యూనిస్ ఖాన్ (103 పరుగులు), మిస్బా ఉల్ హక్ (103 పరుగులు) సంయుక్తంగా నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు.
లంక తరఫున రెండో బ్యాటర్‌గా
శ్రీలంక తరఫున భారత్‌పై తొలి మూడు టెస్టు ఇన్నింగ్స్‌లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించిన రెండో బ్యాటర్‌గానూ సోనల్ దినూష నిలిచాడు. గతంలో 1982లో దులీప్ మెండిస్ భారత్‌పై వరుసగా 105, 105, 51 పరుగులు సాధించాడు. సోనల్ దినూష స్పిన్ బౌలింగ్‌లో సాధించిన 284 పరుగుల్లో 122 రన్స్ (42.95 శాతం) స్వీప్, స్లాగ్, రివర్స్ షాట్ల ద్వారా సాధించడం విశేషం. ఇందులో 11 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి.
మ్యాచ్ విషయానికొస్తే.. మూడోరోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. సోనల్ దినూష (85), లాహిరు కుమారా (8) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో మానవ్ సుతార్, ప్రసిధ్ క్రిష్ణలు చెరో 3 వికెట్లు తీశారు. లంక మరో 238 పరుగులు వెనుకబడి ఉంది. అంతకముందు టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌ను 503/9 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. పడిక్కల్, ధ్రువ్ జురెల్ శతకాలతో చెలరేగారు.
Sonal Dinusha keeps Sri Lanka’s hopes alive against India in Colombo 👊#WTC27 📝: https://t.co/8NP3Qr1pnQ pic.twitter.com/3HMx47B3av
— ICC (@ICC) August 25, 2026
Sonal Dinusha is only the second Sri Lankan batter to score three consecutive 50+ scores in his first three Test innings against India! 🇱🇰🤍🌟#SLvIND #Tests #WTC #Sportskeeda pic.twitter.com/DlAq45rejU
— Sportskeeda (@Sportskeeda) August 25, 2026
Read: ఆసీస్ తరఫున క్రికెట్ ఆడనున్న సంజయ్ బంగర్ కుమార్తె!


