లంక కెప్టెన్‌ను ట్రాప్‌ చేసిన సర్ఫరాజ్‌; ఏం జ‌రిగిందంటే? | Sarfaraz Khan-Sledging-Traps-SL-Captain-Dhananjaya-Wicket 2nd Test | Sakshi
Sakshi News home page

లంక కెప్టెన్‌ను ట్రాప్‌ చేసిన సర్ఫరాజ్‌; ఏం జ‌రిగిందంటే?

Aug 25 2026 3:28 PM | Updated on Aug 25 2026 3:59 PM

Sarfaraz Khan-Sledging-Traps-SL-Captain-Dhananjaya-Wicket 2nd Test

Photo Credit: BCCI Twitter

కొలంబో వేదిక‌గా టీమిండియాతో జ‌రుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక ఎదురీదుతోంది. ప్ర‌స్తుతం 7 వికెట్ల న‌ష్టానికి 204 ప‌రుగులు చేసిన లంక మ‌రో 299 ప‌రుగులు వెనుక‌బ‌డి ఉంది. ఈ విష‌యం ప‌క్క‌న‌బెడితే శ్రీలంక కెప్టెన్ ధ‌నంజ‌య డి సిల్వా వికెట్ తీయ‌డంలో స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌కు క్రెడిట్ ఇవ్వాల్సిందే. మాన‌వ్ సుతార్ బౌలింగ్‌లో ధ‌నంజయ‌ వెనుదిరగ‌డానికి ముందు  షార్ట్ లెగ్‌, సిల్లీ పాయింట్ వ‌ద్ద ఫీల్డింగ్ చేసిన స‌ర్ఫ‌రాజ్ ఖాన్ త‌న మాట‌ల‌తో లంక కెప్టెన్‌ను క‌న్‌ఫ్యూజ‌న్‌కు గురి చేశాడు.

"బ్రో ఇక్క‌డేం లేదు బ్రో, స్ట్రెయిట్‌గా చూడు. ఎందుకు ప్ర‌తీసారి లెఫ్ట్, రైట్ (లాంగాన్‌, లాంగాఫ్‌) చూస్తున్నావు. నువ్వు టైం మొత్తం వృథా చేస్తున్నావు. భ‌య‌ప‌డ‌కుండా ఆడు బ్రో. నువ్వు ఒక జ‌ట్టుకు కెప్టెన్ అన్న‌ విష‌యం గుర్తుంచుకో. నువ్వు ఈ క్ష‌ణం కోసం ఎదురుచూస్తున్నావు" అని చెప్ప‌డం మైక్‌స్టంప్‌లో రికార్డ‌యింది. 

ఆ వెంట‌నే సుతార్ బౌలింగ్‌లో డిఫెన్స్ ఆడే ప్ర‌య‌త్నంలో, ఎడ్జ్ అవ్వ‌డంతో రాహుల్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో 8 ప‌రుగులు మాత్ర‌మే చేసిన ధ‌నంజ‌య డిసిల్వా పెవిలియ‌న్ బాట ప‌ట్టాడు. ఇక తొలి టెస్టులో జైస్వాల్ కూడా లంక బ్యాట‌ర్‌ను ఇలాగే క‌న్ఫూజ‌న్‌కు గురి చేసి అత‌డు ఔటవ్వ‌డంలో కీల‌క‌పాత్ర పోషించాడు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే టీమిండియా తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్ల నష్టానికి 503 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. పడిక్కల్‌, ధ్రువ్ జురెల్‌లు శతకాలతో విరుచుకుపడ్డారు. గిల్‌, పంత్ అర్ధసెంచరీలు సాధించారు. ఇక లంక  రెండో రోజు ఆటలో టీ విరామ సమయానికి 7 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. సోనాల్ దినూష (52), కెషారా నువంతా (13) బ్యాటింగ్ చేస్తున్నారు.

 

చదవండి: అన్‌మోల్ సిక్సర్ల వర్షం..సెమీస్‌కు సౌత్ ఢిల్లీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement