Sri Lanka Vs India 2nd Test Match, Day 3:
మూడో రోజు మొదలైన ఆట
8 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండిన శ్రీలంక మూడో రోజు ఆటను దూకుడుగా ప్రారంభించింది. ఈ రోజు తొలి ఓవర్‌లోనే ఆ జట్టు రెండు బౌండరీలు సహా 12 పరుగులు రాబట్టింది. ప్రసిద్ద్ కృష్ణ వేసిన ఈ ఓవర్‌లో కమిల్ మిషారా రెండు బౌండరీలు బాదాడు.ప్రస్తుతం శ్రీలంక స్కోర్ 20-2గా ఉంది. మిషారా 14, పసిందు సూరియబండార 3 పరుగులతో ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నారు.
495 పరుగుల వెనుకంజలో శ్రీలంక
కొలంబో వేదికగా భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి శ్రీలంక 2 వికెట్ల నష్టానికి 8 పరుగులు చేసింది. కమిల్ మిషారా 5 పరుగులతో క్రీజులో ఉన్నాడు. మానవ్ సుతార్, ప్రసిధ్ క్రిష్ణలు చెరో వికెట్ తీశారు. ప్రస్తుతం లంక 495 పరుగుల వెనుకబడి ఉంది.
అంతకముందు మానవ్ సుతార్ బౌలింగ్‌లో ప్రబాత్ జయసూరియ (2) ఎల్బీగా వెనుదిరగడంతో లంక రెండో వికెట్ కోల్పోయింది. ఇక భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్ల నష్టానికి 503 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. పడిక్కల్, ధ్రువ్ జురెల్ శతకాలతో విజృంభించగా; గిల్, పంత్ అర్ధసెంచరీలతో రాణించారు.


