వీరేందర్ సెహ్వాగ్.. భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత విధ్వంసకర బ్యాటర్లలో ఒకడిగా పేరు గాంచాడు. ఈ మాజీ ఓపెనర్ తన 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో టీమిండియా ఎన్నో అద్భుత విజయాలను అందించాడు. 1999లో పాకిస్తాన్‌పై అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సెహ్వాగ్.. మూడు ఫార్మాట్లలో కలిపి భారత జట్టు తరపున 374 మ్యాచ్‌లు ఆడాడు.
ఈ డేర్ అండ్ డాషింగ్ ఓపెనర్ కెరీర్‌లో 72 అర్ధసెంచరీలు, 38 సెంచరీలు ఉన్నాయి. అయితే ఇప్పుడు సెహ్వాగ్ అడుగు జాడల్లోనే తన పెద్ద కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ కూడా నడుస్తున్నాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో వెస్ట్ ఢిల్లీ లయన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆర్యవీర్.. తాజాగా తన తండ్రి బ్యాటింగ్ శైలిని గుర్తు చేస్తూ అభిమానులను అలరించాడు.
మైదానంలో తండ్రిలాగే స్క్వేర్ డ్రైవ్, కవర్ డ్రైవ్ వంటి ఐకానిక్ షాట్లను ఆర్యవీర్ రీక్రియేట్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను స్టార్ స్పోర్ట్స్ ఎక్స్ వేదికగా షేర్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
ఇది చూసిన నెటిజన్లు తండ్రికు తగ్గ తనయుడు అంటూ కొనియాడుతున్నారు. కాగా ఈ టోర్నీలో జూనియర్ సెహ్వాగ్‌కు కేవం రెండు మ్యాచ్‌లలో మాత్రమే ఆడే అవకాశం లభించింది. ఓ మ్యాచ్‌లో విఫలమైనప్పటికి.. మరో మ్యాచ్‌లో 22 పరుగులతో ఆకట్టుకున్నాడు.
చదవండి: IND vs SL: ధ్రువ్ జురెల్ సెంచరీ.. దెబ్బకు ధోని ఆల్‌టైమ్ రికార్డ్ బ్రేక్
ತಂದೆಗೆ ತಕ್ಕ ಮಗ!😎😍#VirenderSehwag #AryavirSehwag #StarSportsKannada pic.twitter.com/rN8d8X9Eay
— Star Sports Kannada (@StarSportsKan) August 24, 2026


