వేదపఠనం నుంచి వికెట్ల వేట దాకా.. ! అతడో ఓ అద్భుతం.. | Nagayalanka's Amba Sai Kiran Sharma Play role both priest and cricketer | Sakshi
Sakshi News home page

మంత్రాలూ తెలుసు.. మ్యాచ్‌లు గెలవడమూ తెలుసు!

Oct 9 2026 11:14 AM | Updated on Oct 9 2026 11:28 AM

Nagayalanka's Amba Sai Kiran Sharma Play role both priest and cricketer

వృత్తి రీత్యా పురోహితుడు, ప్రవృత్తి రీత్యా క్రికెట్‌కి సన్నిహితుడు. ఉదయం గర్భగుడిలో దైవారాధన, సాయంత్రం గ్రౌండ్‌లో క్రికెటారాధన... నిత్యం వేదపఠనం.. వెసులుబాటు దొరికితే గ్రౌండ్‌ వైపు  పయనం.. ఇదీ నాగాయలంకకు చెందిన అంబా సాయి కిరణ్‌ శర్మ నిత్య కైంకర్యం..

నాగాయలంక శ్రీప్రసన్న గణపతి దేవస్థానంలో ప్రధాన అర్చకుడిగా పని చేస్తున్న సాయికి చిన్నప్పటి నుంచి క్రికెట్‌పైనే ఆసక్తి. పుట్టింది అవని గడ్డలోనైనా పెరిగింది హైదరాబాద్‌లోనే. ఎనిమిదో తరగతిలోనే బడి మానేసి కీసరగుట్టలోని శ్రీ వేంకటేశ్వర సంస్కృత పాఠశాలలో వేదాధ్యయనం ప్రారంభించి 2005లో కోర్సు పూర్తి చేశాడు. తర్వాత నాగాయలంక గణపతి దేవస్థానంలో అర్చకుడిగా, పురోహితుడిగా ప్రాచుర్యం పొందాడు. 

క్రికెటర్‌గా.. గ్రామీణ యూత్‌ సంఘాల ఆధ్వర్యంలో 2007 నుంచి బ్యాటింగ్, బౌలింగ్‌లో ఆరితేరి సాయి కిరణ్‌ తన 19వ ఏట ఆల్‌ రౌండర్‌గా గుర్తింపు పొందాడు. 2021లో ఏర్పడిన బ్రాహ్మణులు, పురోహితులతో కూడిన మహావీర్‌ కింగ్స్‌ క్రికెట్‌ జట్టుతో హైదరాబాద్, ఖమ్మం, కాకినాడ, కొవ్వూరు, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, తెనాలి, మోపిదేవి, చల్లపల్లి ప్రాంతాల టోర్నమెంట్స్‌లో అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించాడు. అర్చకుడిగా, పురోహితుడిగా, క్రికెటర్‌గా రాణిస్తూ సాయికిరణ్‌ యువతకు ఆదర్శంగా నిలిచాడు.

కెరీర్‌..  ఇప్పటికి 300కి పైగా మ్యాచ్‌లలో ఆడిన సాయికిరణ్‌ 5వేలకు పైగా పరుగులు సాధించి, 230 వికెట్లు తీసి, 40 సార్లు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్, 16 పర్యాయాలు మ్యాన్‌  ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డులు కైవసం చేసుకున్నాడు. అత్యధిక స్కోరు 84 చేసి, బెస్ట్‌ బౌలింగ్‌ 6–5 తీసుకున్నాడు. ఒక టోర్నమెంట్‌లో 40 పరుగులిచ్చి ఆరు వికెట్లు తీసుకోవడం మర్చిపోలేని అనుభవంగా శర్మ చెపుతాడు.
– సింహాద్రి కృష్ణ ప్రసాద్, సాక్షి, నాగాయలంక,

ఇదీ చదవండి: వేద విద్య నేర్చుకుంటూనే.. ఇస్రో శాస్త్రవేత్త రేంజ్‌కి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement