PC: BCCI/X
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలే అవకాశముంది. ఈ సిరీస్‌కు స్టార్ ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ద్ కృష్ణ గాయం కారణంగా దూరం కానున్నట్లు తెలుస్తోంది. వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డే సందర్భంగా తొడ కండరాల గాయానికి గురైన అతడు కోలుకోవడానికి కనీసం మూడు వారాల సమయం పట్టనున్నట్లు సమాచారం.
ప్రసిద్ద్ ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్'లో పునరావాసం పొందుతున్నాడు. అయితే . నవంబర్ 4 నుంచి ప్రారంభం కానున్న న్యూజిలాండ్ వన్డే సిరీస్ సమయానికి ప్రసిద్ధ్ కోలుకోవడం ప్రశ్నార్థకంగా మారింది. మూడు వారాల తర్వాత అతడి తిరిగి బౌలింగ్ ప్రాక్టీస్ ప్రారంభించనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
అయితే వన్డే సిరీస్ తర్వాత నవంబర్ 19 నుంచి ప్రారంభమయ్యే న్యూజిలాండ్ టెస్టు సిరీస్ నాటికి ప్రసిద్ధ్ పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తారని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. మరోవైపు రంజీ ట్రోఫీలో కర్ణాటక జట్టుకు ఎంపికైనప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌తో జరిగే తొలి మ్యాచ్‌కు అతడు దూరమయ్యాడు.
కాగా రాబోయే టెస్టు సిరీస్‌ను దృష్టిలో ఉంచుకుని పేసర్ల వర్క్‌లోడ్‌ను జాగ్రత్తగా మేనెజ్ చేయాలని టీమ్ మేనెజ్‌మెంట్ భావిస్తోంది. ఈ క్రమంలోనే ప్రసిద్ద్ విషయంలో ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవాడని మేనెజ్‌మెట్ సిద్దంగా లేదు.
కాగా ప్రసిద్ద్ ప్రస్తుతం వన్డే, టెస్టు జట్టులో కీలక ఫాస్ట్ బౌలర్‌గా కొనసాగుతున్నాడు. అతడు ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ప్రసిద్ద్ 5.86 ఎకానమీతో 5 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. పేసర్లకు అనుకూలించే వికెట్లపై అతడు మరింత చెలరేగిపోతాడు. న్యూజిలాండ్ పిచ్‌లు ఈ కర్ణాటక పేసర్‌కు సరిగ్గా సరిపోతాయి.
చదవండి: హర్మన్ ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం


