హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ సంచ‌ల‌న నిర్ణ‌యం | Harmanpreet Kaur quits as India cricket captain | Sakshi
Sakshi News home page

హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ సంచ‌ల‌న నిర్ణ‌యం

Oct 6 2026 11:23 AM | Updated on Oct 6 2026 11:54 AM

Harmanpreet Kaur quits as India cricket captain

భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కీలక నిర్ణయం తీసుకుంది. టీమిండియా అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ఆమె ప్రకటించింది. ఈ విషయాన్ని హర్మన్‌ప్రీత్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

కెప్టెన్‌గా తప్పుకున్నప్పటికీ, ఒక ప్లేయర్‌గా మాత్రం జట్టులో కొనసాగుతానని స్పష్టం చేసింది. ఇటీవల ముగిసిన ఆసియా క్రీడల్లో హర్మన్‌ప్రీత్ సారథ్యంలోనే భారత జట్టు స్వర్ణ పతకం సాధించింది. 

ఇదే సరైన సమయం..
"ఈ రోజు నేను భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాను. ఇది నాకు చాలా కఠినమైన నిర్ణయం, కానీ ఇందుకు ఇదే సరైన సమయం. భారత జట్టు సారథిగా ఈ ప్రయాణం ఎన్నో జ్ఞాపకాలు, భావోద్వేగాలు, త్యాగాలతో కూడుకున్నది. 

అత్యున్నత స్థాయిలో భారత జట్టును నడిపించినందుకు గర్వపడుతున్నాను. ఇక కెప్టెన్‌గా నా జర్నీ ముగిసింది. యువ ఆటగాళ్లకు బాధ్యతలను అప్పగించి, జట్టు భవిష్యత్తు మరింత మెరుగ్గా రూపుదిద్దుకోవాలనే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఒక ప్లేయర్‌గా జట్టుకు సేవలు అందిస్తూనే ఉంటాను" అని ఆమె ఓ ప్రకటనలో పేర్కొంది.

సక్సెస్ ఫుల్ కెప్టెన్‌
37 ఏళ్ల హర్మన్‌ప్రీత్ కౌర్ తొలుత 2012 మహిళల టీ20 ఆసియా కప్‌లో తాత్కాలిక సారథిగా బాధ్యతలు చేపట్టి భారత్‌కు ట్రోఫీనందించింది. ఆ తర్వాత 2016లో పూర్తిస్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించి, భారత మహిళల క్రికెట్‌ను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లింది.

తన కెరీర్‌లో భారత్ తరఫున 5 టెస్టులు, 51 వన్డేలు, 155 టీ20 మ్యాచ్‌లకు హర్మన్‌ప్రీత్ నాయకత్వం వహించింది. ఆమె సారథ్యంలోనే భారత్ వన్డే ప్రపంచకప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. దీంతో భారత మహిళల జట్టుకు ఐసీసీ ట్రోఫీని అందించిన తొలి కెప్టెన్‌గా హర్మన్ చరిత్ర సృష్టించింది. ఆమె స్ధానంలో స్మృతి మంధాన భారత జట్టు బాధ్యతలు చేపట్టే అవకాశముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement