SMAT 2026: రెండు రనౌట్లు.. ఆట మొత్తం తారుమారు | Madhya Pradesh-Five Runs-Win Vs Maharashtra-Comical-Runouts-SMAT 2026 | Sakshi
Sakshi News home page

SMAT 2026: రెండు రనౌట్లు.. ఆట మొత్తం తారుమారు

Nov 22 2026 4:41 PM | Updated on Nov 22 2026 4:57 PM

Madhya Pradesh-Five Runs-Win Vs Maharashtra-Comical-Runouts-SMAT 2026

Photo Credit: Twitter

స‌య్య‌ద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మ‌ధ్యప్ర‌దేశ్ జ‌ట్టు ఉత్కంఠ విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఎలైట్ గ్రూప్‌-సిలో మ‌హారాష్ట్రతో జ‌రిగిన మ్యాచ్‌లో మ‌ధ్యప్ర‌దేశ్ ఐదు ప‌రుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన మ‌ధ్య‌ప్ర‌దేశ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 208 ప‌రుగులు చేసింది. 

అక్ష‌త్ ర‌ఘువంశీ (50), హ‌ర్ష్ గ‌వాలి (55) అర్థ‌సెంచ‌రీలు సాధించగా, కెప్టెన్ ర‌జ‌త్ ప‌టీదార్ (31), చివ‌ర్లో రాహుల్ బాథ‌మ్ (28 నాటౌట్‌) రాణించాడు. మ‌హారాష్ట్ర బౌల‌ర్ల‌లో వివేక్ షీల‌ర్ మూడు వికెట్లు తీయ‌గా, ముకేశ్ చౌద‌రీ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. అనంత‌రం బ్యాటింగ్ చేసిన మ‌హారాష్ట్ర నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 203 ప‌రుగుల‌కు ప‌రిమిత‌మైంది. 

పృథ్వీ షా (51), సాహిల్ ప‌రాక్ (50), అర్షిన్ కుల‌క‌ర్ణి (54 నాటౌట్‌) చివ‌రి వ‌ర‌కు నిలిచిన‌ప్ప‌టికీ జ‌ట్టును గెలిపించ‌డంలో విఫ‌ల‌మ‌య్యాడు. ఆఖ‌ర్లో రామ‌క్రిష్ణ ఘోష్ (15)తో పాటు చివరి బంతికి సిద్ధేవ్‌ వీర్‌ రనౌట్ కావ‌డం జ‌ట్టును కొంప‌ముంచింది. మ‌ధ్య‌ప్ర‌దేశ్ బౌల‌ర్ల‌లో కుమార్ కార్తికేయ రెండు వికెట్లు తీయ‌గా, శివ‌మ్ శుక్లా, శివాంగ్ కుమార్ చెరొక వికెట్ ప‌డ‌గొట్టారు.

ఇదీ చదవండి: IND VS PAK: పెను ప్రమాదం తప్పించుకున్న వైభవ్‌ సూర్యవంశీ..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement