ఉద్ధవ్ ఠాక్రే శివసేన (యూబీటీ) కార్పొరేటర్ సంజయ్ గవాలే ఓ మున్సిపల్ అధికారిపై దాడికి పాల్పడ్డారు. అమరావతి మున్సిపల్ కార్పొరేషన్ జోన్-3 అసిస్టెంట్ కమిషనర్ నితిన్ బొబాడేపై కార్యాలయంలోనే దాడి చేశారు. ఈ ఘటన కార్యాలయంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. తనపై దాడికి ముందు గవాలే కులం పేరుతో దూషించారని బొబాడే ఆరోపించారు. అయితే, సమావేశం సందర్భంగా అధికారి అహంకారపూరితంగా, అవమానకరంగా మాట్లాడారని గవాలే చెబుతున్నారు.
కొన్ని అధికారిక పనుల నిమిత్తం ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన శివసేన నాయకుడు గవాలే, తన సహచరుడితో కలిసి మున్సిపల్ కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సీసీటీవీ ఫుటేజీలో గవాలే, బొబాడే ఒకరిపై ఒకరు వేళ్లు చూపించుకుంటూ తీవ్ర వాగ్వాదానికి దిగడం కనిపించింది. అనంతరం గవాలే తన కుర్చీలో నుంచి లేచి, ఫైబర్ ప్లాస్టిక్‌తో తయారైన టేబుల్ టాప్ లెక్టర్న్ (ప్రసంగాల కోసం ఉపయోగించే స్టాండ్) తీసుకుని బొబాడే తలపై కొట్టారు. ఈ ఘటన అనంతరం మున్సిపల్ అధికారులు, ఉద్యోగులు నిరసనకు దిగారు.
ఇదీ చదవండి: తమిళనాడు రహస్యాలు ఏపీకి లీక్.. 15 మందిపై వేటు!
🚨 Amravati Civic Row! AMC Assistant Commissioner Nitin Bobde alleges Shiv Sena (UBT) corporator Sanjay Gavhale & aides assaulted him inside his office—caught on CCTV. Gavhale denies the claim, alleging rude behavior by the officer. #Amravati #MaharashtraNews #ShivSenaUBT https://t.co/eBuwQBwEMg
— Raita Meter (@raitameter) November 20, 2026


