అతడు విధ్వంసం సృష్టించినా.. టీమిండియాలోకి తీసుకోలేము! | Suryakumar Not In IndiaT20I Scheme Of Things Despite Stellar Form Report | Sakshi
Sakshi News home page

అతడు విధ్వంసం సృష్టించినా.. టీమిండియాలోకి తీసుకునే ప్రసక్తే లేదు!

Nov 21 2026 3:53 PM | Updated on Nov 21 2026 4:03 PM

Suryakumar Not In IndiaT20I Scheme Of Things Despite Stellar Form Report

PC: BCCI X

టీమిండియాకు టీ20 ప్రపంచకప్‌ టైటిల్‌ అందించిన కెప్టెన్లలో.. మహేంద్ర సింగ్‌ ధోని, రోహిత్‌ శర్మ.. తర్వాతి స్థానాన్ని సూర్యకుమార్‌ యాదవ్‌ ఆక్రమించాడు. ఈ ముంబైకర్‌ సారథిగా పగ్గాలు చేపట్టిన తర్వాత ద్వైపాక్షిక సిరీస్‌లలో భారత్‌కు ఎదురేలేకుండా పోయింది.

బ్యాటర్‌గా విఫలం
అదే జోరు కొనసాగిస్తూ సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్‌-2026లో టీమిండియా చాంపియన్‌గా నిలిచింది. అయితే, కెప్టెన్‌ విజయవంతమైనప్పటికీ.. బ్యాటర్‌గా విఫలం కావడం సూర్య కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపింది. టీ20 కెప్టెన్‌గా ఎన్నికైన నాటి నుంచి అతడు.. వ్యక్తిగతంగా రాణించలేకపోయాడు. ఒకప్పుడు ఐసీసీ నంబర్‌ వన్‌ టీ20 బ్యాటర్‌గా ఉన్న సూర్య.. ఆటగాడిగా జట్టుకు భారంగా మారాడు.

జట్టులో చోటూ గల్లంతు
ఈ నేపథ్యంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) సంచలన రీతిలో సూర్యపై వేటు వేసింది. టీ20 వరల్డ్‌కప్‌ గెలిచిన తర్వాత టీమిండియా ఆడే సిరీస్‌ నుంచి సూర్యను కెప్టెన్‌గానే కాకుండా ఆటగాడిగానూ తప్పించి.. జట్టులోనూ చోటు లేకుండా చేసింది.

అయితే, సూర్య మాత్రం మళ్లీ టీమిండియాలో పునరాగమనం చేస్తాననే ఆశతో ఉన్నాడు. ఇటీవల మొదలైన దేశీ టీ20 టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ-2026లో కెప్టెన్‌గా ముంబై జట్టును ముందుకు నడిపిస్తున్న సూర్యకుమార్‌... బ్యాటర్‌గానూ అదరగొడుతున్నాడు.

విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడుతూ..
హైదరాబాద్‌తో మ్యాచ్‌లో కేవలం 15 బంతుల్లోనై యాభై పరుగుల మార్కు అందుకున్న సూర్య.. 21 బంతుల్లోనే 60 పరుగులు సాధించాడు. గుజరాత్‌తో మ్యాచ్‌లో కేవలం 29 బంతుల్లోనే 82 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. అనంతరం గోవాతో మ్యాచ్‌లో 12 బంతుల్లో 25 పరుగులు చేసిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. ఈ మూడు మ్యాచ్‌లలోనూ జట్టును గెలిపించాడు.

అతడు విధ్వంసం సృష్టించినా.. టీమిండియాలోకి తీసుకోలేము!
ఈ నేపథ్యంలో సూర్య టీమిండియా పునరాగమనంపై వార్తలు వస్తుండగా.. బీసీసీఐ వర్గాలు స్పందించాయి. ANIతో మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం టీమిండియా సెలక్షన్‌ ప్రణాళికల్లో సూర్య లేనేలేడు. యశస్వి జైస్వాల్‌ను వైట్‌ బాల్‌ క్రికెట్‌ ఆడించడమే కుదరడం లేదు. అలాంటిది సూర్య గురించి ఎలా ఆలోచించగలము?

లిస్ట్‌-ఎ క్రికెట్‌లోనూ సూర్య రాణిస్తున్నాడు. కానీ ప్రస్తుతం జట్టులో అతడికి చోటు లేదు. యువ ఆటగాడైన జైస్వాల్‌నే మేము జట్టులో ఇమడ్చలేకపోతున్నాము. అలాంటపుడు సూర్యకు ఎలా స్థానం ఇవ్వగలము? అతడు మా ప్రణాళికల్లో లేడు’’ అని బీసీసీఐ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.

ఇదీ చదవండి: అతడిని వదిలేశారు.. బెయిల్‌ మీదొచ్చి విధ్వంసకర బ్యాటింగ్‌తో కౌంటర్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement