Photo Credit: Twitter
ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ టీ20ల్లో అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఇంగ్లండ్ తరఫున టీ20ల్లో అత్యధికసార్లు డకౌట్ అయిన ఆటగాళ్ల జాబితాలో సాల్ట్ చోటు దక్కించుకున్నాడు. మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టీ20లో జోయల్ డేవిస్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్ తొలి బంతికే మిచెల్ మార్ష్‌కు క్యాచ్ ఇచ్చిన ఫిల్ సాల్ట్ గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు.
కాగా టీ20ల్లో సాల్ట్ డకౌట్‌గా వెనుదిరగడం ఇది ఎనిమిదోసారి. ఈ ఏడాదిలో ఫిల్ సాల్ట్ డకౌటవ్వడం ఇది మూడోసారి కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో జేసన్ రాయ్ (7 సార్లు)ను అధిగమించిన సాల్ట్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. తొలి స్థానంలో జోస్ బట్లర్ (11 సార్లు) ఉండగా, లూక్ రైట్ (9 సార్లు), మోయిన్ అలీ (9 సార్లు) సంయుక్తంగా రెండో స్థానంలో కొనసాగుతున్నారు.
మ్యాచ్ విషయానికొస్తే, తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. కెప్టెన్ హ్యారీబ్రూక్ (28 బంతుల్లో 65; 4 ఫోర్లు, 6 సిక్సర్లు), అర్థసెంచరీ చేయగా, టామ్ బాంటన్ (22 బంతుల్లో 39), జోర్డాన్ కాక్స్ (20 బంతుల్లో 27) రాణించారు. ఆసీస్ బౌలర్లలో జాక్ ఎడ్వర్డ్స్, నిఖిల్ చౌదరీ చెరో 2 వికెట్లు పడగొట్టారు.
Phil Salt has registered his 8th duck in T20Is #PhilSalt #JosButtler #AUSvENG #AUSvsENG #cricket #SBM https://t.co/6TsSI3bZ0u
— SBMCricket (@WicketWatcher_) November 21, 2026
ఇదీ చదవండి: IND vs NZ: చరిత్ర సృష్టించిన టీమిండియా.. 94 ఏళ్లలో ఇదే తొలిసారి


