source: X
ఫామ్ కోల్పోయి సొంత అభిమానుల చేతనే విమర్శలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం, తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నాడు. శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌ను 1-0తో చేజిక్కించుకున్న అనంతరం (ఇరు జట్ల ఆటగాళ్లు పరస్పరం కరచాలనం చేసుకుంటున్న సమయంలో), తనకంటే సీనియర్ ఆటగాడు దినేశ్ చండీమల్ (శ్రీలంక) పట్ల అగౌరవంగా వ్యవహరించి నెటిజన్లచే చివాట్లు తింటున్నాడు.
Dinesh Chandimal to Babar Azam. 🗣️ "Do me a favour. I need a shirt with your signature because I've played against you for the last time." 🥹 Babar Azam said, "I'll try." https://t.co/VYov8Z1TeQ
— چودھری 🇵🇸 (@HANZALAx56) November 20, 2026
కెరీర్ చరమాంకంలో ఉన్న చండీమల్ మరోసారి బాబర్‌తో కలిసి ఆడతానో లేదో అని అతడు సంతకం చేసిన జెర్సీ ఇవ్వాలని కోరాడు. ఇందుకు అతడు ‘ప్రయత్నిస్తా’ అంటూ బదులిచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో క్రికెట్ అభిమానులు బాబర్‌పై మండిపడుతున్నారు. సీనియర్ ఆటగాడి పట్ల గౌరవం చూపలేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
టెక్నికల్‌గా తనకంటే మెరుగైన బ్యాటర్ అయిన చండీమల్ పట్ల మర్యాదగా వ్యవహరించి ఉండాల్సిందని అభిప్రాయపడుతున్నారు. కొందరేమో బాబర్‌కు సంభాషణ నైపుణ్యాలు లేవని, అందులో భాగంగా జరిగిన పొరపాటిదని అంటున్నారు.
కాగా, లంకతో నిన్న ముగిసిన టెస్ట్ సిరీస్‌లో పాక్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించి, రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-0తో చేజిక్కించుకుంది. ఈ సిరీస్‌లో బాబర్ ప్రదర్శన నిరాశజనకంగా ఉంది. మూడు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 92 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక అర్ధసెంచరీ ఉంది.
ఇదీ చదవండి: IND VS NZ 1st Test: రిషబ్ పంత్ మరో భారీ 'సిక్సర్ల' రికార్డు


