వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌ను దురదృష్టం వెంటాడింది. దేవ్‌దత్త్ పడిక్కల్ ఔటయ్యాక నాలుగో స్ధానంలో క్రీజులోకి వచ్చిన గిల్.. కేఎల్ రాహుల్‌తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు.
అతడి ఆటను చూసిన ప్రతీ ఒక్కరూ సునయాసంగా తన సెంచరీ మార్క్‌ను అందుకుంటాడని అంతాభావించారు. కానీ గిల్ తన 12వ టెస్ట్ సెంచరీని కేవలం రెండు పరుగుల తేడాతో చేజార్చుకున్నాడు. 98 పరుగుల వద్ద జాకబ్ డఫీ బౌలింగ్‌లో గిల్ క్లీన్ బౌల్డయ్యాడు.
HEARTBREAK FOR SHUBMAN GILL 💔 Just two runs short of a well deserved century the Indian captain looked in sublime touch, showed composure under pressure and played a crucial knock to put india in a commanding position 98 runs of pure class 👏 #INDvsNZ #gill https://t.co/1NHR0fWGZR
— Why Cricket (@whycrickect) November 21, 2026
ఛాన్స్ లభించినా?
కాగా మొదటి గిల్ 77 పరుగుల వద్ద ఉన్నప్పుడు నాథన్ స్మిత్ బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూ కోసం న్యూజిలాండ్ అప్పీల్ చేయగా.. తొలుత ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇచ్చాడు. అయితే రివ్యూలో బంతి స్వల్పంగా బ్యాట్ ఇన్ సైడ్ ఎడ్జ్ తగిలినట్లు తేలడంతో గిల్ బతికిపోయాడు. కానీ తనకు దక్కిన అవకాశాన్ని శుబ్‌మన్ సెంచరీగా మాత్రం మలుచుకోలేకపోయాడు.
కాగా మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 486 పరుగుల స్కోర్ సాధించింది. ప్రస్తుతం టీమిండియా 118 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.
చదవండి: IND vs NZ: చరిత్ర సృష్టించిన శుబ్‌మన్ గిల్.. 50 ఏళ్ల తర్వాత


