వెల్లింగ్టన్‌లోని బేసిన్ రిజర్వ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 486 పరుగుల స్కోర్ సాధించింది. ప్రస్తుతం టీమిండియా 118 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.
క్రీజులో రిషబ్ పంత్(55), అన్షుల్ కాంబోజ్(0) ఉన్నారు. కాగా159/1 ఓవర్‌నైట్ స్కోరుతో 3వ రోజు ఆట ప్రారంభించిన రాహుల్, దేవ్‌దత్ పడిక్కల్ తొలి సెషన్‌లో కివీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. రాహుల్‌తో కలిసి 165 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పిన దేవ్‌దత్ పడిక్కల్ (175 బంతుల్లో 80 పరుగులు చేసి కైల్ జేమీసన్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.
పడిక్కల్ ఔటైనప్పటికి రాహుల్ (290 బంతుల్లో 136 పరుగులు, 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) మాత్రం ఆచితూచి ఆడి తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. తద్వారా సేనా దేశాలన్నింటిలోనూ టెస్ట్ సెంచరీ చేసిన తొలి భారత ఓపెనర్‌గా చరిత్ర సృష్టించాడు.
అయితే జట్టు స్కోరు 386 వద్ద నాథన్ స్మిత్ బౌలింగ్‌లో రాహుల్ ఔటయ్యాడు. కానీ కెప్టెన్ గిల్ మాత్రం వన్డే తరహాలో బ్యాటింగ్ చేశాడు. కానీ 98 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద గిల్ ఔటై తృటిలో తన 12వ సెంచరీని చేజార్చుకున్నాడు. కివీస్ బౌలర్లలో మాట్ హెన్రీ, కైల్ జామీసన్, జాకబ్ ఢఫీ , నాథన్ స్మిత్ తలా వికెట్ సాధించారు.
చదవండి: IND vs NZ: చరిత్ర సృష్టించిన శుబ్‌మన్ గిల్.. 50 ఏళ్ల తర్వాత


