హాంకాంగ్‌ ఓపెన్‌ సెమీస్‌లో సాత్విక్‌-చిరాగ్‌ జోడీ ఓటమి | Hong Kong Open 2026, Satwiksairaj Rankireddy And Chirag Shetty Suffer Straight Game Defeat In Men Doubles Semifinals | Sakshi
Sakshi News home page

హాంకాంగ్‌ ఓపెన్‌ సెమీస్‌లో సాత్విక్‌-చిరాగ్‌ జోడీ ఓటమి

Nov 21 2026 11:17 AM | Updated on Nov 21 2026 12:06 PM

Hong Kong Open Badminton: Satwiksairaj Rankireddy, Chirag Shetty Pair Lose In Semi Finals

source: X

హాంకాంగ్‌ ఓపెన్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ డబుల్స్‌ జోడీ సాత్విక్‌సాయిరాజ్‌ రాంకిరెడ్డి-చిరాగ్‌ శెట్టి పోరాటం ముగిసింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్‌ సెమీఫైనల్లో ఈ ప్రపంచ ఆరో ర్యాంకు జోడీ.. మలేషియాకు చెందిన ఎనిమిదో సీడ్‌ మాన్‌ వీ చోంగ్‌-టీ కై వున్‌ చేతిలో ఓటమి పాలైంది. 41 నిమిషాల పాటు సాగిన హోరాహోరీ పోరులో భారత జోడీ 18-21, 19-21తో వరుస గేముల్లో పరాజయం పాలైంది.

ఈ ఏడాది సింగపూర్‌, చైనా ఓపెన్‌ టైటిళ్లను గెలుచుకున్న సాత్విక్‌-చిరాగ్‌ జోడీ.. హాంకాంగ్‌లోనూ అద్భుత ప్రదర్శనతో సెమీస్‌ వరకు చేరుకుంది. అయితే ప్రపంచ తొమ్మిదో ర్యాంకులో ఉన్న మలేషియా జోడీని దాటలేకపోయింది. 2025 ఇండోనేషియా ఓపెన్‌లోనూ ఈ మలేషియా జోడీనే సాత్విక్‌-చిరాగ్‌ను ఓడించింది.

లక్ష్యసేన్‌ సెమీస్‌ పోరు
ఇవాళే జరుగనున్న పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో భారత ఆటగాడు లక్ష్యసేన్‌ బరిలోకి దిగనున్నాడు. డెన్మార్క్‌కు చెందిన మూడో సీడ్‌ ఆండర్స్‌ ఆంటోన్సెన్‌తో అతడు తలపడనున్నాడు.

ఇదీ చదవండి: సెమీస్‌లో తెలుగు బ్లాక్‌ హాక్స్‌


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement