చరిత్ర సృష్టించిన లక్ష్యసేన్ | Japan Masters 2026: Lakshya Sen Scripts History, Beats Koki Watanabe In Final Thriller | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన లక్ష్యసేన్

Nov 15 2026 10:56 AM | Updated on Nov 15 2026 11:16 AM

Japan Masters 2026: Lakshya Sen Scripts History, Beats Koki Watanabe In Final Thriller

source: X

భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ చరిత్ర సృష్టించాడు. జపాన్‌లో జరుగుతున్న కుమామోటో మాస్టర్స్ జపాన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో పురుషుల సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఆదివారం (నవంబర్ 15) జరిగిన హోరాహోరీ ఫైనల్లో స్థానిక ఆటగాడు కోకి వటనాబేపై అద్భుత విజయం సాధించాడు. తద్వారా ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్ టైటిల్ గెలిచిన తొలి భారతీయ ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.

మూడు గేమ్‌ల పాటు ఉత్కంఠగా సాగిన ఫైనల్లో లక్ష్యసేన్ 13-21, 21-18, 21-14 తేడాతో వటనాబేను ఓడించాడు. తొలి గేమ్‌లో ఓటమి ఎదురైనా అద్భుతంగా పుంజుకుని వరుసగా రెండు గేమ్‌లు గెలిచి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.

వరుసగా రెండో టైటిల్
ఇటీవలే హైలో ఓపెన్ టైటిల్ గెలిచిన లక్ష్యసేన్.. ఇప్పుడు జపాన్ మాస్టర్స్ టైటిల్‌ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. వరుసగా రెండో టోర్నీలో ఫైనల్‌కు చేరడమే కాకుండా రెండింటిలోనూ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

జపాన్ మాస్టర్స్ విజయం ద్వారా లక్ష్యసేన్‌కు 9,200 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ పాయింట్లతో బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ర్యాంకింగ్స్‌లో 12వ స్థానం నుంచి ఆరో స్థానానికి చేరుకునే అవకాశం ఉంది. జపాన్ మాస్టర్స్ టైటిల్‌తో లక్ష్య సేన్‌ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు అర్హత సాధించే అవకాశాలు మరింత మెరుగయ్యాయి.

ఇదీ చదవండి: ఉత్కంఠపోరు.. పాకిస్తాన్‌పై టీమిండియా సంచలన విజయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement