జపాన్‌ ఓపెన్‌ ఫైనల్లో లక్ష్యసేన్‌ | Lakshya Sen in Japan Open final | Sakshi
Sakshi News home page

జపాన్‌ ఓపెన్‌ ఫైనల్లో లక్ష్యసేన్‌

Nov 15 2026 4:31 AM | Updated on Nov 15 2026 4:31 AM

Lakshya Sen in Japan Open final

కుమామోటో: భారత యువ షట్లర్‌ లక్ష్యసేన్‌... జపాన్‌ ఓపెన్‌ మాస్టర్స్‌ సూపర్‌–500 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో భారత నంబర్‌వన్‌ లక్ష్యసేన్‌ 21–12, 15–21, 21–11తో ప్రపంచ పదో ర్యాంకర్‌ అల్వీ ఫర్హాన్‌ (ఇండోనేసియా)పై విజయం సాధించాడు. ప్రస్తుతం ప్రపంచ 13వ ర్యాంక్‌లో ఉన్న లక్ష్యసేన్‌... ఈ టోర్నీలో విజేతగా నిలిస్తే బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌కు అర్హత సాధించే అవకాశాలు మరింత మెరుగవుతాయి. 

ఫర్హాన్‌తో ఆడిన గత రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైన లక్ష్యసేన్‌... ఈసారి పట్టు వదలకుండా ప్రయత్నించి విజయం సాధించాడు. తొలి గేమ్‌ను సునాయాసంగా చేజిక్కించుకున్న లక్ష్యసేన్‌కు రెండో గేమ్‌లో ఇండోనేసియా షట్లర్‌ నుంచి గట్టిపోటీ ఎదురైంది. ఇక నిర్ణయాత్మక మూడో గేమ్‌ ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన భారత షట్లర్‌ చివరి వరకు అదే జోరు కొనసాగిస్తూ మ్యాచ్‌ను ముగించాడు. నేడు జరిగే ఫైనల్లో కొకి వతనాబే (జపాన్‌)తో లక్ష్య తలపడనున్నాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement