ఏసీసీ మెన్స్ అండర్-19 ఆసియా కప్ 2026 విజేతగా భారత్ నిలిచింది. శనివారం అల్ అమెరాత్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరిగిన ఉత్కంఠ భరిత ఫైనల్లో పాకిస్తాన్‌ను ఒక్క వికెట్ తేడాతో చిత్తు చేసిన టీమిండియా.. రికార్డు స్థాయిలో 9వ సారి ఆసియా కప్ ట్రోఫీని ముద్దాడింది.
ఆఖరి వరకు నువ్వానేనా అన్నట్టు సాగిన ఈ తుదిపోరులో పదో నంబర్ ఆటగాడు, ఫాస్ట్ బౌలర్ మోహిత్ ఉల్వా( 49) సంచలన బ్యాటింగ్‌తో భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. అతడితో పాటు మనల్ చౌహాన్(47) కూడా ఈ విజయంలో కీలక పాత్ర పోషించాడు.


