source: X
ఏసీసీ మెన్స్ అండర్ 19 ఆసియా కప్ 2026 ఫైనల్లో ఇవాళ భారత్, పాక్ తలపడుతున్నాయి. అల్ అమీరట్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పాక్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ టోర్నీలో పాక్ అజేయ జట్టుగా ఫైనల్‌కు చేరగా.. భారత్ గ్రూప్ దశలో పాక్ చేతిలో ఓడింది. సెమీఫైనల్స్‌లో భారత్ ఆఫ్ఘనిస్తాన్‌పై, పాక్ బంగ్లాదేశ్‌పై విజయాలు సాధించి ఫైనల్స్‌కు చేరాయి.
పాక్‌తో జరిగిన గ్రూప్ దశ మ్యాచ్‌లో భారత మిడిలార్డర్ బ్యాటర్ అర్జున్ రాజ్‌పుత్ అద్భుమైన సెంచరీతో మెరిసిన విషయం తెలిసిందే. నేటి మ్యాచ్‌లో అందరి కళ్లు అర్జున్ రాజ్‌పుత్‌పైనే ఉన్నాయి. మరోవైపు భీకర ఫామ్‌లో ఉన్న ఆర్యవీర్ సెహ్వాగ్ కోసం కూడా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాహుల్ ద్రవిడ్ తనయుడు అన్వయ్ ద్రవిడ్, కెప్టెన్ లక్ష్య రాజేశ్ రాయ్‌చందనీపై కూడా ఫ్యాన్స్ ఓ కన్నేసి ఉంచారు.
అండర్ 19 విభాగంలో భారత్-పాక్ ఇప్పటివరకు 31 మ్యాచ్‌ల్లో తలపడగా.. భారత్ 17, పాక్ 13 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.
తుది జట్లు..
భారత్: లక్ష్య రాజేష్ రాయచందనీ (సి), ఆర్యవీర్ సెహ్వాగ్, వికె వినీత్, యశ్బర్ధన్ చౌహాన్, అర్జున్ రాజ్‌పుత్, అన్వయ్ ద్రవిడ్(w), మనల్ చౌహాన్, మోహిత్ ఉల్వా, ఆర్యన్ సావ్సాని, కావ్య పటేల్, చిగురుపాటి వెంకట
పాకిస్తాన్: ఉస్మాన్ ఖాన్, హయామ్ ఖాన్, అబ్దుల్ ఖాదిర్, ఫర్హాన్ యూసఫ్(సి), అహ్మద్ హుస్సేన్, అలీ రజా, హమ్జా జహూర్(w), హస్నైన్ అబ్బాస్ దార్, మహ్మద్ సయ్యమ్, రిజ్వానుల్లా, నికాబ్ షఫీక్
ఇదీ చదవండి: న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్.. టీమిండియాలో కీలక మార్పు


