source: X
పాకిస్తాన్ మిడిలార్డర్ బ్యాటర్ సౌద్ షకీల్ అత్యంత అరుదైన ఆటగాళ్ల జాబితాలో చేరాడు. శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీకి చేరువగా వచ్చి ఔటైన అతడు.. టెస్టు క్రికెట్ చరిత్రలో ఒకే మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో 90ల్లో (93, 97) ఔటైన ఐదో బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. సౌద్‌కు ముందు క్లెమ్ హిల్ (98, 97), ఫ్రాంక్ వూలీ (95, 93), గార్డర్ గ్రీనిడ్జ్ (రెండు సార్లు (91, 96), (91, 97)), మహేళ జయవర్దనే (93, 97) ఈ అరుదైన ఫీట్‌ను సాధించారు.
మ్యాచ్ విషయానికొస్తే.. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శ్రీలంక, పాకిస్తాన్ మధ్య రావల్పిండి వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 434-9 (డిక్లేర్), రెండో ఇన్నింగ్స్‌లో 284-8 (డిక్లేర్) చేయగా.. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 446 పరుగులకు ఆలౌటైంది.
పాక్ రెండు ఇన్నింగ్స్‌లో సౌద్ షకీల్ కీలకమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. శ్రీలంక ఆడిన ఏకైక ఇన్నింగ్స్‌లో ధనంజయ డిసిల్వ (167), కెప్టెన్ కుసాల్ మెండిస్ (119) శతకాలతో మెరిశారు. ఈ సిరీస్‌లోని రెండో టెస్ట్ నవంబర్ 17న ఇదే రావల్పిండి మైదానంలో ప్రారంభం కానుంది.
నిలకడైన ప్రదర్శన
సౌద్ షకీల్ ఇటీవలి కాలంలో టెస్ట్ క్రికెట్‌లో నిలకడగా పరుగులు సాధిస్తున్నాడు. శ్రీలంకతో సిరీస్‌కు ముందు జరిగిన ప్రెసిడెంట్స్ ట్రోఫీ 2026లోనూ అతడు అద్భుతంగా రాణించాడు. ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో 62.57 సగటుతో 438 పరుగులు చేశాడు.ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి.
ఇదీ చదవండి: శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డు


