ముగిసిన యూత్ ఒలింపిక్స్
డకర్ (సెనెగల్): ఎనిమిదేళ్ల విరామం జరిగిన యూత్ ఒలింపిక్స్‌లో భారత బృందం 21వ స్థానంలో నిలిచింది. శుక్రవారం ముగిసిన ఈ యువ విశ్వ క్రీడల్లో భారత క్రీడాకారులు 2 స్వర్ణాలు, 3 రజతాలు, 5 కాంస్యాలతో కలిపి మొత్తం 10 పతకాలు సాధించారు. బాక్సర్లు అంబేకర్ మీటీ (పురుషుల 50 కేజీల విభాగం), గుంజన్ (మహిళల 48 కేజీల విభాగం) భారత్‌కు పసిడి పతకాలు అందించారు. తన్వీ పత్రి (బ్యాడ్మింటన్), తానియా (బీచ్ రెజ్లింగ్), ఖుష్బూ (జూడో) రజత పతకాలు సొంతం చేసుకున్నారు.
స్విమ్మర్ ధీనిధి డెసింఘూ రెండు కాంస్యాలు గెలుపొందగా... స్విమ్మర్ తీర్థాంక్ పేగు, లాన్‌చెన్‌బి రాజ్‌కుమారి (వుషు), శౌర్య అంబురే (మహిళల అథ్లెటిక్స్) కూడా కాంస్య పతకాలు సాధించారు. ఆఫ్రికాలో తొలిసారి నిర్వహించిన ఈ యూత్ ఒలింపిక్స్‌లో 207 దేశాల నుంచి 2700 మందికిపైగా క్రీడాకారులు 25 క్రీడాంశాల్లో పోటీపడ్డారు. 18 స్వర్ణాలు, 8 రజతాలు, 7 కాంస్యాలతో కలిపి 33 పతకాలు సాధించిన చైనా టాప్ ర్యాంక్‌ను అందుకుంది. 28 పతకాలతో జపాన్ (11 స్వర్ణాలు, 8 రజతాలు, 9 కాంస్యాలు) రెండో స్థానంలో... 14 పతకాలతో రష్యా (8 స్వర్ణాలు, 4 రజతాలు, 2 కాంస్యాలు) మూడో స్థానంలో నిలిచాయి.


