"ఇది చాలా అన్యాయం.. అతడిని టూర్ కోసం​ న్యూజిలాండ్‌కు తీసుకెళ్లారా?" | Former India captain on Mohammed Sirajs non-selection for NZ vs IND 2026 4th ODI | Sakshi
Sakshi News home page

"ఇది చాలా అన్యాయం.. అతడిని టూర్ కోసం​ న్యూజిలాండ్‌కు తీసుకెళ్లారా?"

Nov 13 2026 7:58 PM | Updated on Nov 13 2026 8:04 PM

Former India captain on Mohammed Sirajs non-selection for NZ vs IND 2026 4th ODI

మౌంట్ మాంగనూయి వేదిక‌గా న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో వ‌న్డేలో 244 పరుగుల భారీ తేడాతో టీమిండియా ఓటమిపాలైన సంగ‌తి తెలిసిందే. 334 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన భార‌త్‌.. కివీస్ బౌల‌ర్ల ధాటికి కేవ‌లం 89 ప‌రుగుల‌కే కుప్ప‌కూలి ఘోర ప‌రాభ‌వం చ‌విచూసింది.

ఈ నేప‌థ్యంలో భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అంజుమ్ చోప్రా కీలక వ్యాఖ్య‌లు చేశారు. నాలుగో వన్డేలో స్టార్ పేసర్ మొహమ్మద్ సిరాజ్‌ను తుది జట్టులోకి తీసుకోకపోవడంపై ఆమె  తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా నాలుగో వన్డే కోసం భారత తుది జట్టులో మూడు మార్పులు చోటు చేసుకున్నప్పటికి, సిరాజ్‌కు మాత్రం అవకాశం దక్కలేదు.  ఈ క్రమంలోనే సోనీ స్పోర్ట్స్ చర్చా కార్యక్రమంలో అంజుమ్ చోప్రా మాట్లాడుతూ జట్టు యాజమాన్య తీరును తప్పుబట్టారు.

"ఇది చాలా అన్యాయం. భారత జట్టులో ఆడాలంటే కనీస ప్రతిభ ఉండాలి. కానీ అద్భుత ప్రదర్శన చేసి జట్టును గెలిపించినప్పుడే అసాధారణ ఆటగాడిగా గుర్తింపు వస్తుంది.  కొందరు ఆటగాళ్లకు వరుస అవకాశాలు ఇవ్వడం మంచిదే,  కానీ గతంలో అద్భుతంగా రాణించి, ఇండియా-ఏ తరఫున కూడా సత్తా చాటి వచ్చిన ఆటగాడిని కేవలం ప్రాక్టీస్‌కే పరిమితం చేయడం మంచి పద్దతి కాదు.

సిరాజ్ ఒక అద్భుతమైన బౌలర్. ఇప్పటికే చాలా మ్యాచ్‌లలో భారత్‌ను గెలిపించాడు. ఒక అనుభవజ్ఞుడైన ఆటగాడి పట్ల ఇలా వ్యవహరించడం స‌రికాదు . సిరాజ్‌ను ఆడించే ఉద్దేశం లేనప్పుడు జట్టుతో పాటు న్యూజిలాండ్‌కు ఎందుకు తీసుకెళ్లారు? అత‌డికి బ‌దులుగా వేరే యువ బౌలర్లను పంపించాల్సింది కదా! అత‌డు న్యూజిలాండ్ ప‌ర్య‌ట‌న అంతటా బెంచ్‌కే ప‌రిమిత‌మ‌య్యాడు. క‌నీసం ఒక్క మ్యాచ్‌లోనైనా ఆడించాల్సింది" అని అంజుమ్ పేర్కొన్నారు.
చదవండి: ష‌కీల్ అద్భుత పోరాటం.. డ్రాగా ముగిసిన పాక్‌-శ్రీలంక తొలి టెస్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement