మౌంట్ మౌంగనుయి వేదికగా టీమిండియాతో జరిగిన నాలుగో వన్డేలో న్యూజిలాండ్ స్టార్ పేసర్ మాట్ హెన్రీ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ సీఎస్‌కే ఫాస్ట్ బౌలర్ తన సంచలన బౌలింగ్‌తో భారత బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. హెన్రీ 334 పరుగుల లక్ష్య చేధనలో తొలి ఓవర్‌లోనే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్‌లను ఔట్ చేసి భారత్‌ను దెబ్బతీశాడు.
మొత్తంగా 6 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా అతడు నిలిచాడు. హెన్రీ దెబ్బకు టీమిండియా కేవలం 89 పరుగులకే కుప్పకూలింది. ఇషాన్ కిషన్(27), అక్షర్ పటేల్(21), నమన్ ధీర్(21) మినహా మిగతా బ్యాటర్లందరూ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.
విరాట్ కోహ్లి స్పెషల్ గిప్ట్
అయితే అసాధరణ ప్రదర్శన కనబరిచిన హెన్రీకి టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి ఊహించని గిప్ట్ ఇచ్చాడు. కివీస్ డ్రెస్సింగ్ రూమ్ వద్దకు వెళ్లి కోహ్లి తను స్వయంగా సంతకం చేసిన టీమిండియా జెర్సీని బహుమతిగా అందజేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను కివీస్ క్రికెట్ బోర్డు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఇది చూసిన నెటిజన్లు కోహ్లిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో కోహ్లిని హెన్రీ అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. అతడి దెబ్బకు కోహ్లి ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. అయినప్పటికి కోహ్లి తన మంచి మనసుతో జెర్సీని బహుకరించడం విశేషం.
చదవండి: IND vs NZ: టీమిండియాతో మ్యాచ్.. న్యూజిలాండ్ బౌలర్ ప్రపంచ రికార్డు


