Photo Credit: Twitter
మౌంట్ మాంగనూయ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో వన్డేలో టీమిండియా 244 పరుగుల తేడాతో భారీ ఓటమిని చవిచూసింది. తద్వారా వన్డేల్లో భారత్‌కు పరుగుల పరంగా రెండో అతిపెద్ద ఓటమిని మూటగట్టుకుంది. గతంలో 2000, అక్టోబర్ 29న శ్రీలంకతో జరిగిన వన్డేలో 245 పరుగుల తేడాతో ఓటమి భారత్‌కు అతిపెద్ద ఓటమిగా ఉంది.
తాజాగా పరుగు తేడాతో అతిపెద్ద ఓటమి గండాన్ని తప్పించుకుంది. ఇక 2015లో సౌతాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో 214 పరుగుల ఓటమి భారత్‌కు మూడో అతిపెద్ద ఓటమిగా ఉంది. 2004లో సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 208 పరుగుల ఓటమి భారత్‌కు నాలుగో అతిపెద్ద ఓటమిగా ఉంది.
మ్యాచ్ విషయానికొస్తే.. 334 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 26.4 ఓవర్లలో 89 పరుగులకు ఆలౌటయ్యింది. ఇషాన్ కిషన్ (27) పరుగులు టాప్ స్కోరర్‌గా నిలవగా, అక్షర్‌పటేల్ (21), నమన్ ధీర్ (21) పర్వాలేదనిపించారు. భారత టాపార్డర్ వరుసగా 0,5,0,0 స్కోర్లు నమోదు చేయడం భారత్ ఓటమిని ఖరారు చేసింది.
న్యూజిలాండ్ బౌలర్లలో మాట్ హెన్రీ 6 వికెట్లతో చెలరేగగా, మాథ్యూ ఫిషర్ 3 వికెట్లు పడగొట్టగా, కైల్ జేమీసన్ ఒక వికెట్ తీశాడు. అంతకముందు న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసి 50 ఓవర్లలో 333 పరుగులకు ఆలౌటైంది. విల్ యంగ్ (125) శతకం సాధించగా, టిమ్ సీఫెర్ట్ (58) అర్థశతకం చేశాడు. భారత బౌలర్లలో అకిబ్ నబీ, గుర్నూర్ బ్రార్, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.
TRIPLE-WICKET MAIDEN! 😳 Matt Henry couldn't have scripted a more explosive start! Watch the HERO VIDA India Tour of New Zealand 4th ODI LIVE NOW on Sony Sports Network TV channels, Sony Vizha & Sony LIV. #SonySportsNetwork #SonyVizha #SonyLIV #NZvIND https://t.co/9gipGvgUIw
— Sony Sports Network (@SonySportsNetwk) November 13, 2026
ఇదీ చదవండి:


