సచిన్ రికార్డును సమం చేసిన కోహ్లి | Kohli-Registered-20th-Duck-ODIs-Unwanted-Record-Equals-Sachin | Sakshi
Sakshi News home page

సచిన్ రికార్డును సమం చేసిన కోహ్లి

Nov 13 2026 1:43 PM | Updated on Nov 13 2026 1:45 PM

Kohli-Registered-20th-Duck-ODIs-Unwanted-Record-Equals-Sachin

Photo Credit: BCCI Twitter

న్యూజిలాండ్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో టీమిండియా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. 334 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో భారత్ సున్నా పరుగుల వద్దే మూడు వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్‌లు గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరగ్గా, కోహ్లి నాలుగు బంతులాడి పరుగులేమి చేయకుండానే వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో డకౌట్ల విషయంలో కోహ్లి చెత్త రికార్డును నమోదు చేశాడు.

వన్డేల్లో కోహ్లి డకౌటవ్వడం ఇది 20వ సారి కావడం గమనార్హం. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా వన్డే క్రికెట్‌లో 20 సార్లు డకౌట్‌గా వెనుదిరిగాడు. తాజాగా డకౌట్‌తో కోహ్లి.. సచిన్ రికార్డును సమం చేశాడు. కోహ్లి 321 వన్డే మ్యాచ్‌ల్లో 20 సార్లు డకౌట్ అవ్వగా, సచిన్ తన కెరీర్‌లో మొత్తం 463 మ్యాచ్‌ల్లో 20 సార్లు డకౌటయ్యాడు. 

ఈ జాబితాలో కోహ్లి, సచిన్‌లు సంయుక్తంగా తొలి స్థానంలో ఉన్నప్పటికీ.. మ్యాచ్‌ల పరంగా చూసుకుంటే మాత్రం కోహ్లి మ్యాచ్‌ల పరంగా సచిన్‌ను అధిగమించాడని చెప్పొచ్చు. ఇక  19 డకౌట్లతో జవగళ్ శ్రీనాథ్ (229 మ్యాచ్‌లు) రెండో స్థానంలో, 18 డకౌట్లతో కుంబ్లే (269 మ్యాచ్‌లు), రోహిత్ శర్మ (295 మ్యాచ్‌లు) సంయుక్తంగా మూడో స్థానంలో కొనసాగుతున్నారు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 333 పరుగులకు ఆలౌటైంది. విల్ యంగ్ (125) శతకంతో చెలరేగగా, టిమ్ సీఫెర్ట్ (58) అర్థసెంచరీ సాధించాడు. అకిబ్ నబీ, గుర్నూర్‌, అక్షర్ తలా 2 వికెట్లు పడగొట్టారు. ఛేదనలో భారత బ్యాటర్లు విఫలం కావడంతో ప్రస్తుతం భారత్ 6 వికెట్ల నష్టానికి 61 పరుగులతో ఆడుతోంది.

ఇదీ చదవండి: IND vs NZ: ‘నీ చేతులతో నువ్వే అంతా నాశనం చేసుకున్నావు’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement