Photo Credit: Twitter
మౌంట్ మాంగనూయ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకుంది. 334 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత్ తొలి ఓవర్‌లోనే పరుగులేమి చేయకుండానే మూడు వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్‌లు గోల్డెన్ డకౌటవ్వగా, విరాట్ కోహ్లి డకౌట్‌గా వెనుదిరిగాడు.
తద్వారా వన్డే క్రికెట్‌లో సున్నా పరుగుల వద్ద మూడు వికెట్లు కోల్పోయిన నాలుగో జట్టుగా టీమిండియా నిలిచింది. అయితే తమ వన్డే చరిత్రలో తొలి ఓవర్‌లోనే సున్నా పరుగుల వద్ద మూడు వికెట్లు కోల్పోవడం మాత్రం టీమిండియాకు ఇదే తొలిసారి. ఇక ఈ చెత్త రికార్డును పాకిస్తాన్ రెండుసార్లు నమోదు చేయగా, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా చెరొకసారి ఈ చెత్త ఫీట్‌ను సాధించాయి.
వన్డేల్లో సున్నా పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన సందర్భాలు
👉పాకిస్థాన్ వర్సెస్ న్యూజిలాండ్, ఎడ్జ్‌బాస్టన్, 1983 వన్డే ప్రపంచకప్
👉పాకిస్థాన్ వర్సెస్ దక్షిణాఫ్రికా, లాహోర్, 1997లో
👉బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక, పీటర్మారిట్జ్‌బర్గ్, 2003 వన్డే ప్రపంచకప్‌లో
👉ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్, మీర్పూర్, 2026లో
👉భారత్ వర్సెస్ న్యూజిలాండ్, మౌంట్ మాంగనుయ్, 2026లో
ఇది రెండోసారి..
ఇక వన్డేల్లో ఒకే మ్యాచ్‌లో కోహ్లి, రోహిత్ శర్మ డకౌట్ కావడం ఇది రెండోసారి. గతంలో 2010లో డంబుల్లా వేదికగా శ్రీలంకతో మ్యాచ్‌లోనూ వీరిద్దరూ డకౌట్‌గా వెనుదిరిగారు. అయితే ఇదే మ్యాచ్‌లో వీరేంద్ర సెహ్వాగ్ 99 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు.
👉ఇక వన్డేల్లో తొలి బంతికే వెనుదిరిగిన టీమిండియా ఓపెనర్లలో రోహిత్ శర్మ చోటు సంపాదించాడు. ఈ జాబితాలో సౌరవ్ గంగూలీ (మూడుసార్లు), సెహ్వాగ్ (మూడుసార్లు) గోల్డెన్ డకౌట్ కాగా, సునీల్ గావస్కర్, రవిశాస్త్రి, క్రిష్ శ్రీకాంత్, మనోజ్ ప్రభాకర్, తాజాగా రోహిత్ శర్మలు తాము ఆడిన తొలి బంతికే వెనుదిరిగారు.
ఇదీ చదవండి: ఆసీస్ బౌలర్ల విజృంభణ.. 131 రన్స్‌కే చాప చుట్టిన ఇంగ్లండ్


