కోహ్లి వద్దన్నా వినలేదు.. కంట్రోల్ తప్పిన భారత బౌలర్‌ | Gurnoor-Aggressive-Behaviour-Tim Seifert-Face-Kohli Saved-Match Ban | Sakshi
Sakshi News home page

కోహ్లి వద్దన్నా వినలేదు.. కంట్రోల్ తప్పిన భారత బౌలర్‌

Nov 13 2026 9:15 AM | Updated on Nov 13 2026 9:20 AM

Gurnoor-Aggressive-Behaviour-Tim Seifert-Face-Kohli Saved-Match Ban

Photo Credit: Twitter

న్యూజిలాండ్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో టీమిండియా బౌలర్ గుర్నూర్ బ్రార్ కంట్రోల్ తప్పాడు. కివీస్ ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ వికెట్ తీసిన ఆనందంలో అతడి ముఖంపై విజయగర్జన చేస్తూ సెలబ్రేట్‌ చేసుకున్నాడు. అంతటితో ఆగకుండా అతడిని దూషిస్తూ హద్దు మీరాడు. ఒకపక్క విరాట్ కోహ్లి వద్దని వారిస్తున్నా గుర్నూర్ వినకుండా సీఫెర్ట్‌ పైపైకి వెళ్లి మాటల యుద్ధానికి దిగడం కనిపించింది.

అంతకముందు ఏం జరిగిందంటే?
అంతకముందు ఓవర్లో ఇదే బ్రార్ బౌలింగ్‌లో సీఫెర్ట్ 14 పరుగులు పిండుకున్నాడు. దీంతో బ్రార్‌.. ఈరోజు నీ అదృష్టం బాగుంది.. అందుకే ఇలా బ్యాటింగ్ ఆడుతున్నావు’ అని పేర్కొన్నాడు. దీనికి సీఫెర్ట్ బదులుగా..‘నువెళ్లి బౌలింగ్ వెయ్యు.. నేను బ్యాటింగ్ ఇలాగే చేస్తా’ అని తెలిపాడు. దీంతో కోపంతో రగిలిపోయిన బ్రార్ తన మరుసటి ఓవర్లోనే సీఫెర్ట్‌ను ఔట్ చేయడంతో సంబరాల్లో మునిగిపోయాడు. 

అందుకే ‘పెవిలియన్ వెళ్లు’ అంటూ సీఫెర్ట్  ముఖంపై గర్జిస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. తప్పు ఎవరిదైనా గుర్నూర్ చర్య క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ఉంది. అందుకే ఓవర్ పూర్తయ్యాకా గుర్నూర్‌ను ఫీల్డ్ అంపైర్ మందలించడం కనిపించింది. ఐసీసీ రిఫరీ కూడా గుర్నూర్ బ్రార్‌పై చర్యలు తీసుకునే అవకాశముంది. బ్రార్‌, సీఫెర్ట్ మధ్య జరిగిన గొడవ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక గుర్నూర్ బ్రార్ వన్డే సిరీస్‌లో ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటిదాకా మూడు వన్డేలు కలిపి 8 వికెట్లు తీసిన గుర్నూర్ ఆరంభంలోనే వికెట్లు తీస్తూ ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెంచడంలో సఫలమవుతున్నాడు. తన కెరీర్‌ను ఘనంగా ప్రారంభించిన గుర్నూర్ బ్రార్ ఇలాంటి చర్యలకు పాల్పడకుండా జాగ్రత్తగా ఆడితే మంచి భవిష్యత్తు ఉంటుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

 

ఇదీ చదవండి: భారత్‌తో నాలుగో వన్డే.. రికార్డులకెక్కిన కివీస్ ఓపెనర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement