‘అతడు చెప్పేవన్నీ నూటికి నూరుశాతం అబద్ధాలే’ | AUS Captain-Pat Cummins Rejects Khawaja-Sandpaper Scandal Claims | Sakshi
Sakshi News home page

‘అతడు చెప్పేవన్నీ నూటికి నూరుశాతం అబద్ధాలే’

Nov 13 2026 7:41 AM | Updated on Nov 13 2026 7:52 AM

AUS Captain-Pat Cummins Rejects Khawaja-Sandpaper Scandal Claims

Photo Credit : Twitter

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా ‘సబర్‌’ పేరుతో విడుదల చేసిన ఆత్మకథ ఆసీస్ క్రికెట్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ‘సాండ్‌ పేపర్‌గేట్‌ వివాదం (బాల్‌ టాంపరింగ్‌)’ విషయంలో ఖవాజా చేసిన వ్యాఖ్యల్లో వంద శాతం నిజముందని మరో మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ పేర్కొనడంతో అగ్గి మరింత రాజుకున్నట్లయింది. 

అయితే ఉస్మాన్ ఖవాజా ‘సాండ్‌పేపర్ గేట్‌’ వివాదంపై తాజాగా ప్రస్తుత కెప్టెన్ పాట్ కమిన్స్ స్పందించాడు. శుక్రవారం ఉదయం సిడ్నీలోని క్రికెట్ సెంట్రల్ వేదికగా  జరిగిన మీడియా సమావేశంలో కమిన్స్ సుదీర్ఘంగా మాట్లాడాడు.


Photo Credit: Twitter

2018 నాటి సంచలనాత్మక 'శాండ్‌పేపర్ గేట్' (బాల్ ట్యాంపరింగ్) వివాదంపై మాజీ క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా చేసిన వ్యాఖ్యలు వంద శాతం అబద్ధమని, అదంతా పూర్తిగా అర్ధంలేని చెత్త వాగుడని కమిన్స్ మండిపడ్డాడు. మైదానంలోకి శాండ్‌పేపర్ వెళ్తోందనే విషయం తమకు (బౌలర్లకు) ముందే తెలుసనడం అబద్ధమని తెలిపాడు. తాను గానీ, ఇతర బౌలర్లు గానీ ఆ కుట్రకు సూత్రధారులని ఖవాజా అనడం పూర్తిగా నిరాధారమని మండిపడ్డాడు.


Photo Credit: Twitter

కమిన్స్ మాట్లాడుతూ.."ఉస్మాన్ నాకు మంచి స్నేహితుడే కావచ్చు, కానీ స్నేహితులు ఒకరి జీవితాలు, ప్రతిష్ఠతో ఇంత బాధ్యతారాహిత్యంగా ఆడుకోరు. అతని వ్యాఖ్యలు ఆస్ట్రేలియా క్రికెట్ కీర్తిని దెబ్బతీసేలా ఉన్నాయి. జట్టు మొత్తం సమిష్టి బాధ్యత తీసుకోవాలని ఖవాజా ఏ జట్టు సమావేశంలోనూ ప్రతిపాదించినట్లు నాకు గుర్తులేదు. కాబట్టి దానిని అడ్డుకున్న ఆ ఇద్దరు ఆటగాళ్లు ఎవరో కూడా నాకు తెలియదు. 


Photo Credit: Twitter

కేవలం చర్మం రంగు ఆధారంగా క్రికెట్ ఆస్ట్రేలియా కెప్టెన్సీని దూరం చేసిందన్న ఖవాజా వాదనను కూడా నేను పూర్తిగా తోసిపుచ్చుతున్నా. అతడి వ్యాఖ్యల్లో అర్థం లేదు. ఈ వివాదంపై మళ్లీ విచారణ జరపబోమని క్రికెట్ ఆస్ట్రేలియా ఇప్పటికే స్పష్టం చేసింది. 2018 నాటి జట్టులో గెలుపు కోసం కొన్నిసార్లు అహంకారం కనిపించిన మాట నిజమేనని ఒప్పుకున్నాడు. కానీ నేను కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాక జట్టు సంస్కృతిని పూర్తిగా మార్చాననే అనుకుంటున్నా’ అని కమిన్స్ చెప్పుకొచ్చాడు.

ఇదీ చదవండి: టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement