Photo Credit: Twitter
రావల్పిండి వేదికగా పాకిస్తాన్, శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్టు డ్రా దిశగా పయనిస్తోంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్తాన్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 21.2 ఓవర్లలో వికెట్ నష్టానికి 57 పరుగులు చేసింది. అజాన్ అవైస్ (22), మొహమ్మద్ తాహా (24) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ 45 పరుగుల స్వల్ప ఆధిక్యం సాధించింది.
అంతకముందు శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్‌లో 446 పరుగులకు ఆలౌటైంది. ధనంజయ డిసిల్వా (167), కెప్టెన్ కుశాల్ మెండిస్ (119) శతకాలతో చెలరేగారు. ఈ ఇద్దరు ఐదో వికెట్‌కు 249 పరుగులు జోడించారు. మిగతా బ్యాటర్లలో కమిందు మెండిస్ (58) అర్థసెంచరీ చేయగా, లాహిరు ఉదార (42) పర్వాలేదనిపించాడు.
డెబ్యూ మ్యాచ్‌లోనే ఏడు వికెట్లు..
పాక్ బౌలర్లలో సకిబ్ ఖాన్ ఏడు వికెట్లతో చెలరేగగా, మొహమ్మద్ అబ్బాస్ రెండు వికెట్లు తీశాడు. ఈ క్రమంలో సకిబ్ ఖాన్ ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. కెరీర్‌లో తొలి టెస్టు ఆడుతున్న సకిబ్ ఖాన్ డెబ్యూ మ్యాచ్‌లో ఒక ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లు (34-5-130-7) తీసిన నాలుగో పాకిస్తాన్ బౌలర్‌గా నిలిచాడు.
ఇక టెస్టుల్లో అరంగేట్రం మ్యాచ్‌లోనే ఏడు వికెట్లు పడగొట్టిన తొలి పాక్ బౌలర్‌గా మహమ్మద్ నజీర్ నిలిచాడు. అతడు 1969లో కరాచీ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 30.1 ఓవర్లు వేసి 99 పరుగులిచ్చి ఏడు వికెట్లు పడగొట్టాడు. నజీర్ తర్వాత 1996లో రావల్పిండి వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ జాహిద్ 20 ఓవర్లలో 66 పరుగులిచ్చి ఏడు వికెట్లు తీశాడు.
టెస్టు అరంగేట్రంలో పాక్ తరఫున అత్యుత్తమ బౌలింగ్ గణాంకాల రికార్డు ఇప్పటికీ మహమ్మద్ జాహిద్ పేరిట ఉంది. 2022లో ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్‌తో టెస్టులో అబ్రార్ అహ్మద్ 22 ఓవర్లు బౌలింగ్ వేసి 114 పరుగులిచ్చి ఏడు వికెట్లు పడగొట్టాడు. తాజాగా వీరి ముగ్గురి సరసన సకిబ్ ఖాన్ చేరాడు.
ఓవరాల్‌గా టెస్టుల్లో అరంగేట్రం మ్యాచ్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాల రికార్డు ఆస్ట్రేలియా బౌలర్ ఆల్బర్ట్ ట్రాట్ పేరిట ఉంది. అడిలైడ్ వేదికగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ట్రాట్ 27 ఓవర్లు వేసి 43 పరుగులిచ్చి 8 వికెట్లు పడగొట్టాడు. మరో ఆస్ట్రేలియా బౌలర్ బాబ్ మాసీ 27.2 ఓవర్లు వేసి 53 పరుగులిచ్చి 8 వికెట్లు తీసి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. టీమిండియాకు చెందిన నరేంద్ర హిర్వాణి 18.3 ఓవర్లలో 61 పరుగులిచ్చి 8 వికెట్లు తీసి మూడో స్థానంలో ఉండగా, లాన్స్ క్లుసేనర్ (8 వికెట్లు- దక్షిణాఫ్రికా) నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.
🚨 HISTORY FOR SAQIB KHAN. 🚨 - Saqib Khan becomes the only Pakistani fast bowler to take 7 wickets on Test debut in this century. 🇵🇰🔥 - I hope, PCB keeps him in Tests only and don't waste him by rushing him in all formats like other youngsters. https://t.co/CxGTSJOi6T
— Salman. (@TsMeSalman1_) November 12, 2026
ఇదీ చదవండి: NPL 2026: చరిత్ర సృష్టించిన నేపాల్ స్టార్ క్రికెటర్


