భారత్‌తో చివరి రెండు వన్డేలు.. న్యూజిలాండ్‌ జట్ల ప్రకటన | New Zealand team announced for 4, 5 ODIs Vs India | Sakshi
Sakshi News home page

భారత్‌తో చివరి రెండు వన్డేలు.. న్యూజిలాండ్‌ జట్ల ప్రకటన

Nov 12 2026 7:47 AM | Updated on Nov 12 2026 7:47 AM

New Zealand team announced for 4, 5 ODIs Vs India

ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరుగనున్న చివరి రెండు వన్డేల (4, 5) కోసం వేర్వేరు న్యూజిలాండ్‌ జట్లను ఇవాళ ప్రకటించారు. ఈ జట్లలో పలు కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ రెండు జట్లలో 31 ఏళ్ల పేసర్ బ్రెట్ రాండెల్‌కు చోటు దక్కింది. అతడు తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. కేవలం ఐదో వన్డే కోసం ఆల్‌రౌండర్ జోష్ క్లార్క్‌సన్‌ జట్టులోకి వచ్చాడు. మిచెల్‌ సాంట్నర్‌ కెప్టెన్‌గా కొనసాగనున్నాడు.

తదుపరి భారత్‌తో జరుగబోయే టెస్ట్‌ సిరీస్‌ కోసం​ సన్నద్దమయ్యేందుకు పలువురు సీనియర్‌ ఆటగాళ్లు (టామ్‌ లాథమ్‌, డారిల్‌ మిచెల్‌, హెన్రీ నికోల్స్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, నాథన్‌ స్మిత్‌) జట్టు నుంచి తప్పుకున్నారు. గాయపడిన బ్లెయిర్‌ టిక్నర్‌ స్థానంలో క్రిస్టియన్‌ క్లార్క్‌ జట్టులోకి వచ్చాడు. అలాగే గాయం నుంచి కోలుకుని మ్యాట్‌ హెన్రీ జట్టులో చేరాడు. గాయం కారణంగా లోకీ ఫెర్గూసన్‌ జట్టు నుంచి నిష్క్రమించాడు.

మరోవైపు నాలుగు, ఐదు వన్డేల కోసం భారత జట్టులోనూ పలు కీలక మార్పులు జరిగాయి. టెస్ట్‌ సిరీస్‌ సన్నద్దత కోసం కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ సహా పలువురు జట్టు నుంచి తప్పుకున్నారు. గిల్‌ స్థానంలో ఈ రెండు మ్యాచ్‌లకు శ్రేయస్‌ అయ్యర్‌ నాయకత్వం​ వహించనున్నాడు. అతడికి డిప్యూటీగా ఇషాన్‌ కిషన్‌ వ్యవహరించనున్నాడు.

ఈ సిరీస్‌లో భారత్మ ఇప్పటికే 2-0తో ఆధిక్యంలో ఉంది. హామిల్టన్‌లో జరగాల్సిన మూడో వన్డే టాస్ అనంతరం వర్షం కారణంగా రద్దయింది. నాలుగు, ఐదు వన్డేలు మౌంట్‌ మాంగనూయ్‌ వేదికగా నవంబర్‌ 15, 19 తేదీల్లో జరుగనున్నాయి.

నాలుగో వన్డేకు న్యూజిలాండ్ జట్టు:
మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్‌వెల్, క్రిస్టియన్ క్లార్క్, జాకబ్ డఫీ, మాట్ ఫిషర్, డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్, మిచ్ హే (వికెట్ కీపర్), మాట్ హెన్రీ, కైల్ జేమీసన్, నిక్ కెల్లీ, బ్రెట్ రాండెల్, టిమ్ సీఫర్ట్ (వికెట్ కీపర్), విల్ యంగ్.

ఐదో వన్డేకు న్యూజిలాండ్ జట్టు:
మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్‌వెల్, క్రిస్టియన్ క్లార్క్, జోష్ క్లార్క్‌సన్, జాకబ్ డఫీ, మాట్ ఫిషర్, డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్, మిచ్ హే (వికెట్ కీపర్), నిక్ కెల్లీ, బ్రెట్ రాండెల్, టిమ్ సీఫర్ట్ (వికెట్ కీపర్), బ్లెయిర్ టిక్నర్, విల్ యంగ్.

ఇదీ చదవండి: న్యూజిలాండ్‌తో చివరి 2 వన్డేలు.. టీమిండియాలో కీలక మార్పులు


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement