లక్ష్యసేన్, శ్రీకాంత్‌ ముందంజ | Lakshya Sen and Kidambi Srikanth have advanced to the second round at the Japan Masters | Sakshi
Sakshi News home page

లక్ష్యసేన్, శ్రీకాంత్‌ ముందంజ

Nov 12 2026 4:08 AM | Updated on Nov 12 2026 4:08 AM

Lakshya Sen and Kidambi Srikanth have advanced to the second round at the Japan Masters

కుమమొటో: బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 టోర్నీ జపాన్‌ మాస్టర్స్‌లో భారత ఆటగాళ్లు లక్ష్యసేన్, కిడాంబి శ్రీకాంత్‌ రెండో రౌండ్‌లోకి అడుగు పెట్టారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌లో ఎనిమిదో సీడ్‌ లక్ష్య సేన్‌ 21–19, 21–18 స్కోరుతో షి యు జెన్‌ (చైనీస్‌ తైపీ)పై విజయం సాధించాడు. మరో పోరులో శ్రీకాంత్‌ 18–21, 21–16, 24–22తో రస్మస్‌ గెమ్కె (డెన్మార్క్‌)ను ఓడించి ముందంజ వేశాడు.

 అయితే మిక్స్‌డ్‌ డబుల్స్‌ బరిలో నిలిచిన రెండు భారత జోడీలు కూడా తొలి రౌండ్‌లోనే ఓటమిపాలై నిష్క్రమించాయి. హరిహరన్‌–తనీషా క్రాస్టో 7–21, 9–21 తేడాతో టాప్‌ సీడ్‌ జియాంగ్‌ జెన్‌ బాంగ్‌–వీ యా గ్జిన్‌ (చైనా) చేతిలో...ధ్రువ్‌ రావత్‌–కె.మనీషా 21–16, 14–21, 14–21తో నాలుగో సీడ్‌ యి హాంగ్‌ వీ–నికోల్‌ చాన్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో ఓడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement