చైనా చేతిలో ఓటమి.. కాంస్యంతో సరిపెట్టుకున్న భారత జట్టు | Indian Mens Team Loss To China 3-1 In Semis Wins Bronze Medal | Sakshi
Sakshi News home page

చైనా చేతిలో ఓటమి.. కాంస్యంతో సరిపెట్టుకున్న భారత జట్టు

Sep 23 2026 6:37 PM | Updated on Sep 23 2026 6:58 PM

Indian Mens Team Loss To China 3-1 In Semis Wins Bronze Medal

PC: BAI X

ఆసియా క్రీడలు-2026 టోర్నీ పురుషుల బ్యాడ్మింటన్‌ టీమ్‌ ఈవెంట్లో భారత్‌కు చుక్కెదురైంది. సెమీ ఫైనల్లో భారత జట్టు చైనా చేతిలో ఓడిపోయింది. తద్వారా కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

సెమీస్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ చైనాతో తలపడ్డ భారత జట్టు ఆరంభంలో అలరించినా ఆ తర్వాత ప్రత్యర్థి ముందు తలొగ్గింది. సింగిల్స్‌లో షి యు కీ చేతిలో లక్ష్య సేన్‌ 21-16, 21-18 పాయింట్ల తేడాతో ఓడిపోగా.. డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌- చిరాగ్‌ శెట్టి.. లియాండ్‌ వెయ్‌ కెంగ్‌, వాంగ్‌ చాంగ్‌లపై 21-11, 22-20 తేడాతో గెలిచారు.

ఇక మూడో మ్యాచ్‌లో లి షి ఫెంగ్‌ ఆయుశ్‌ శెట్టిని 21-19, 21-13 తేడాతో ఓడించగా.. నాలుగో మ్యాచ్‌లో హి ఝి టింగ్‌, లియూ యీ- హరిహరన్‌ అమ్సకరుణన్‌, ఎంఆర్‌ అర్జున్‌లపై 21-16, 18-21, 21-9 తేడాతో విజయం సాధించారు. దీంతో భారత బ్యాడ్మింటన్‌ జట్టు చైనా చేతిలో 3-1 తేడాతో ఓటమిపాలైంది. దీంతో భారత్‌ కాంస్యానికి పరిమితమైంది.

ఇప్పటి వరకు లభించిన పతకాలు ఇవే
కాగా ఆసియా క్రీడల తాజా ఎడిషన్‌లో భారత్‌ ఇప్పటి వరకు ఒకే ఒక్క స్వర్ణం గెలిచింది. భారత మహిళల క్రికెట్‌ జట్టు ఫైనల్లో శ్రీలంకను ఓడించి పసిడి పతకం సాధించింది. 

ఇక మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ టీమ్‌ విభాగంలో రజతం, మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో ఇలవేణిల్‌ వలరివన్‌ రజతం గెలవగా.. పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ టీమ్‌ విభాగంలో రజతం, పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో హిమాన్షు ధిల్లాన్‌ రజతం వచ్చాయి.

ఇక మహిళల 49 కిలోల వెయిట్‌లిఫ్టింగ్‌ విభాగంలో మీరా బాయి చాను వెండి పతకం గెలవగా.. రుద్రాంక్ష్‌ పాటిల్‌ (షూటింగ్‌), సుచిక తరియాల్‌ (మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌) కాంస్యం కైవసం చేసుకున్నారు. మహిళల, పురుషుల స్కీట్‌ టీమ్‌లో కాంస్యాలు వచ్చాయి. ఇక మెన్స్‌ సింగిల్స్‌ సాఫ్ట్‌ టెన్నిస్‌లో జై మీనా కాంస్యం గెలిచాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement