పాక్‌ను ఛీకొట్టి.. చిన్న జ‌ట్టులోకి వెళ్లిపోయాడు! | Pakistan Coach Resigns From Post To Join An Associate Nation | Sakshi
Sakshi News home page

పాక్‌ను ఛీకొట్టి.. చిన్న జ‌ట్టులోకి వెళ్లిపోయాడు!

Sep 23 2026 5:13 PM | Updated on Sep 23 2026 5:32 PM

Pakistan Coach Resigns From Post To Join An Associate Nation

PC: Pak cricket

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైన పాకిస్తాన్ క్రికెట్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు బౌలింగ్ అండ్ అసిస్టెంట్ కోచ్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ యాష్లీ నోఫ్కే తన పదవికి రాజీనామా చేశాడు. 2026 ఆసియా క్రీడలు ముగిసిన వెంటనే ఆయన పాక్ కోచింగ్ బాధ్యతల నుంచి తప్పుకోనున్నాడు.

ఆ తర్వాత నెదర్లాండ్స్ పురుషుల క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా నోఫ్కే బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ విషయాన్ని రాయల్ డచ్ క్రికెట్ అసోసియేషన్ (KNCB) అధికారికంగా ధ్రువీకరించింది. 2027 వన్డే ప్రపంచకప్‌తో పాటు 2028 టీ20 వరల్డ్‌కప్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నియామకం చేపట్టినట్లు డచ్‌ క్రికెట్‌ తెలిపింది.

49 ఏళ్ల నోఫ్కే గతేడాది మేలో పాకిస్తాన్ వైట్ బాల్ జట్టు బౌలింగ్ కోచ్‌గా చేరారు. అయితే గత నెలలో ఇంగ్లండ్ పర్యటన సమయంలో బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్‌ను ఉన్నపళంగా తప్పించిన పీసీబీ, ఆ బాధ్యతలను నోఫ్కేకు అప్పగించింది. కానీ అతడు హఠాత్తుగా రాజీనామా చేయడంతో పీసీబీ ఇప్పుడు కొత్త లెవెల్-3 బౌలింగ్ కోచ్ కోసం అన్వేషణ మొదలుపెట్టింది.

కాగా 49 ఏళ్ల నోఫ్కేకు కోచ్‌గా అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. గతంలో మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో బ్రిస్బేన్ హీట్ జట్టుకు, ది హండ్రెడ్ టోర్నీలో లండన్ స్పిరిట్ జట్టుకు కోచ్‌గా పనిచేశారు. అదేవిధంగా డబ్ల్యూపీఎల్‌లో యూపీ వారియర్స్ జట్టు కోచ్‌గాను అతడు సేవలు అందించాడు.
చదవండి: సెహ్వాగ్ కొడుకు మెరుపులు.. కెప్టెన్‌ సెంచరీ! ఆసీస్‌ను చిత్తు చేసిన భారత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement