PC: SA Twitter
ఆస్ట్రేలియాతో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు ముందు దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టును గాయాల బెడద తీవ్రంగా వేధిస్తోంది. ఇప్పటికే స్టార్ పేసర్లు కగిసో రబాడ, లుంగీ ఎంగిడి గాయాల కారణంగా సిరీస్‌కు దూరం కాగా.. తాజాగా మరొక యువ ఫాస్ట్ బౌలర్ క్వేనా మఫాకా కూడా ఈ జాబితాలో చేరాడు.
ఆస్ట్రేలియాతో సిరీస్ కోసం నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్‌లో మఫాకా తొడ కండరాల గాయానికి గురయ్యాడు. దీంతో అతడు ప్రాక్టీస్‌ను మధ్యలోనే వదిలి వెళ్లిపోవాల్సి వచ్చింది. తాజాగా నిర్వహించిన స్కాన్లలో అతడి గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తేలింది.
ఈ క్రమంలోనే మూడు వన్డేల సిరీస్‌కు అతడు దూరమైనట్లు సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు అధికారికంగా ధ్రువీకరించింది. 20 ఏళ్ల మఫాకా స్థానంలో లిజాడ్ విలియమ్స్‌ను జట్టులోకి తీసుకున్నారు. కాగా మఫాకా ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.
ఇటీవల నమీబియాతో జరిగిన రెండు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లోనూ యంగ్ పేసర్ సత్తాచాటాడు. దీంతో ఆసీస్ సిరీస్‌లోనూ ఎంగిడీ, రబాడా లేని లోటును మఫాకా తీరుస్తాడని ప్రోటీస్ టీమ్ మేనెజ్‌మెంట్ భావించింది. కానీ ఇప్పుడు అతడు కూడా గాయం కారణంగా దూరం కావడంతో సౌతాఫ్రికా బౌలింగ్ లైనప్ బలహీనంగా మారింది. సెప్టెంబర్ 24 నుంచి ఈ మూడు వన్డేల సిరీస్ ఆరంభం కానుంది.
చదవండి: ICC T20 Rankings: ప్రపంచ నెం1 వన్ బౌలర్‌గా పాకిస్తాన్ స్టార్.. ఇదే తొలిసారి


