రెడ్‌బాల్‌ క్రికెట్‌ జట్టు ప్రకటన.. కేకేఆర్‌ స్టార్‌కు ప్రమోషన్‌ | BCCI Announces Rest Of India U23 Squad Angkrish Raghuvanshi Promoted To | Sakshi
Sakshi News home page

‘రెస్టాఫ్‌ ఇండియా’ జట్టు ప్రకటన.. వైస్‌ కెప్టెన్‌గా కేకేఆర్‌ స్టార్‌

Sep 23 2026 2:43 PM | Updated on Sep 23 2026 2:48 PM

BCCI Announces Rest Of India U23 Squad Angkrish Raghuvanshi Promoted To

PC: Instagram/IPL

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ యువ ఆటగాడు అంగ్‌క్రిష్‌ రఘువంశీకి ప్రమోషన్‌ వచ్చింది. రెస్టాఫ్‌ అండర్‌-23 క్రికెట్‌ జట్టుకు అతడు వైస్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. కాగా కల్నల్‌ సీకే నాయుడు ట్రోఫీ రెడ్‌ బాల్‌ టోర్నీ-2026లో తమిళనాడు జట్టు విజేతగా నిలిచింది.

వేదిక ఇదే
ఈ నేపథ్యంలో కల్నల్‌ సీకే నాయుడు ట్రోఫీ విన్నర్స్‌ మ్యాచ్‌లో తమిళనాడుతో తలపడే రెస్టాఫ్‌ ఇండియా అండర్‌-19 జట్టును భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) తాజాగా ప్రకటించింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం (చెపాక్‌) వేదికగా గురువారం నుంచి ఆదివారం (అక్టోబరు 1-4) మధ్య ఈ మ్యాచ్‌ నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైనట్లు తెలిపింది.

హైదరాబాదీకి చోటు
ఇక ఈ జట్టుకు బరోడా బ్యాటర్‌ ప్రియాన్షు మోలియా కెప్టెన్‌గా ఎంపిక కాగా.. అతడికి డిప్యూటీగా అంగ్‌క్రిష్‌ రఘువంశీకి అవకాశం ఇచ్చింది జూనియర్‌ క్రికెట్‌ సెలక్షన్‌ కమిటీ. ఇక ఈ జట్టులో హైదరాబాద్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ అరవెల్లి అవినాశ్‌ రావుకు కూడా చోటు దక్కింది.

కాగా ఢిల్లీకి చెందిన 22 ఏళ్ల రఘువంశీ.. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇప్పటికి ఐపీఎల్‌లో 35 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న రఘువంశీ ఖాతాలో 885 పరుగులు ఉన్నాయి. ఇందులో ఏడు హాఫ్‌ సెంచరీలు ఉండటం విశేషం.

కల్నల్‌ సీకే నాయుడు ట్రోఫీ విన్నర్స్‌ మ్యాచ్‌కు రెస్టాఫ్‌ ఇండియా అండర్‌-23 జట్టు ఇదే
ప్రియాన్షు మోలియా (కెప్టెన్‌), అంగ్‌క్రిష్‌ రఘువంశీ (వైస్‌ కెప్టెన్‌), ఆయుశ్‌ జత్వా, మనన్‌ భట్‌, దిగ్విజయ్‌ పాటిల్‌, రక్షిత్‌ మెహతా, అరవెల్లి అవినాశ్‌ రావు (వికెట్‌ కీపర్‌), మయాంక్‌ వర్మ (వికెట్‌ కీపర్‌), ఇమన్‌జోత్‌ సింగ్‌ చాహల్‌, చంద్రరాజ్‌ రాథోడ్‌, వరుణ్‌ సింగ్‌ భుయ్‌, గణేశ్‌ సుతార్‌, నిఖిల్‌ గిరి, చేతన్‌ శర్మ, జి.సుమిత్‌.

చదవండి: సెంచరీతో చెలరేగిన భారత క్రికెటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement