ఆసీస్‌తో తొలి టెస్ట్‌.. సెంచరీతో కదంతొక్కిన టీమిండియా ప్లేయర్‌ | India A kumar kushagra slams century against Australia A in 1st Unofficial Test | Sakshi
Sakshi News home page

ఆసీస్‌తో తొలి టెస్ట్‌.. సెంచరీతో కదంతొక్కిన టీమిండియా ప్లేయర్‌

Sep 23 2026 10:58 AM | Updated on Sep 23 2026 11:14 AM

India A kumar kushagra slams century against Australia A in 1st Unofficial Test

source: X

పుదుచ్చేరి వేదికగా ఆస్ట్రేలియా-ఏతో జరుగుతున్న తొలి అనధికారిక టెస్ట్‌ మ్యాచ్‌లో భారత-ఏ ఆటగాడు కుమార్‌ కుషాగ్రా అద్భుతమైన సెంచరీతో కదంతొక్కాడు. ఝార్ఖండ్‌కు చెందిన వికెట్‌కీపర్‌ బ్యాటర్‌​ అయిన 21 ఏళ్ల కుషాగ్రా.. ఇటీవల జరిగిన దులీప్‌ ట్రోఫీ ఫైనల్లోనూ సెంచరీతో అదరగొట్టాడు. 

మళ్లీ బరిలోకి దిగి.. 
తొలి రోజు ఆటలో 82 పరుగుల వద్ద రిటైర్డ్‌ హర్ట్‌ అయిన అతడు.. రెండో రోజు తొలి సెషన్‌లోనే సెంచరీ పూర్తి చేశాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగిన కుషాగ్రా 202 బంతుల్లో మూడంకెల మార్కును అందుకున్నాడు.

కుషాగ్రా సెంచరీ కారణంగా భారత్‌ గౌరవప్రదమైన స్కోర్‌ దిశగా సాగుతోంది. రెండో రోజు తొలి సెషన్‌ సమయానికి భారత్‌-ఏ స్కోర్‌ 299-7గా (105.1 ఓవర్లలో) ఉంది. కుషాగ్రా 103, అన్షుల్‌ కంబోజ్‌ 12 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.

అంతకుముందే తనుష్‌ కోటియన్‌ ఓవర్‌నైట్‌ స్కోర్‌కు కేవలం ఒక్క పరుగు మాత్రమే జోడించి 69 పరుగుల వద్ద ఔటయ్యాడు. తనుష్‌ కోటియన్‌ స్థానంలోనే కుషాగ్రా క్రీజ్‌లోకి వచ్చి సెంచరీ పూర్తి చేశాడు. మరో ఓవర్‌నైట్‌ బ్యాటర్‌ షమ్స్‌ ములానీ తన స్కోర్‌కు 8 పరుగులు జోడించి పెవిలియన్‌కు చేరాడు.

భారత ఇన్నింగ్స్‌లో సాయి సుదర్శన్‌ (57) అర్ద సెంచరీతో రాణించగా.. అమన్‌ మోఖడే 6, కెప్టెన్‌ దేవదత్‌ పడిక్కల్‌ 3, షేక్‌ రషీద్‌ 16, యశ్‌ రాథోడ్‌ ఒక్క పరుగు చేసి ఔటయ్యారు.

కాగా, రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్ట్‌ సిరీస్‌, 3 మ్యాచ్‌ల అనధికారిక వన్డే సిరీస్‌ కోసం ఆస్ట్రేలియా-ఏ జట్టు భారత్‌లో పర్యటిస్తుంది.

ఇదీ చదవండి: భీకర ఫామ్‌కు బ్రేక్‌.. నిరాశపరిచిన భారత కెప్టెన్‌


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement