రెండు అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లు, మూడు అనధికారిక వన్డేల కోసం ఆస్ట్రేలియా-ఏ జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా తొలుత టెస్ట్ సిరీస్ జరుగనుంది. తొలి టెస్ట్ పుదుర్చేరి వేదికగా ఇవాల్టి నుంచి ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో భారత్-ఏ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
తుది జట్లు..
ఇండియా-ఏ: అమన్ మొఖడే, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్(కెప్టెన్), షేక్ రషీద్, యశ్ రాథోడ్, కుమార్ కుషాగ్రా(వికెట్‌కీపర్), తనుష్ కొటియన్, షమ్స్ ములానీ, అన్షుల్ కాంబోజ్, తుషార్ దేశ్‌పాండే, ప్రఫుల్ హింగే
ఆస్ట్రేలియా-ఏ: సామ్ కొన్‌స్టాస్, క్యాంప్‌బెల్ కెల్లావే, నాథన్ మెక్‌స్వీనీ, పీటర్ హ్యాండ్‌స్కాంబ్(కెప్టెన్), జాసన్ సంఘా, జోష్ ఫిలిప్(వికెట్‌కీపర్), లియామ్ స్కాట్, ఫెర్గస్ ఓ నీల్, టాడ్ మర్ఫీ, కోరీ రోకిసియోలీ, బ్రెండన్ డాగెట్
ఇదీ చదవండి: Asian Games 2026: క్రికెట్‌లో పాక్‌కు కాంస్య పతకం


