మరో చరిత్ర సృష్టించనున్న వైభవ్‌ సూర్యవంశీ..! | Vaibhav Suryavanshi will create history in Asian Games 2026, will become the youngest player as soon as he steps on the field | Sakshi
Sakshi News home page

మరో చరిత్ర సృష్టించనున్న వైభవ్‌ సూర్యవంశీ..!

Sep 21 2026 1:33 PM | Updated on Sep 21 2026 1:39 PM

Vaibhav Suryavanshi will create history in Asian Games 2026, will become the youngest player as soon as he steps on the field

source: BCCI X

టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ మరో చరిత్ర సృష్టించేందుకు సిద్దంగా ఉన్నాడు. ఏషియన్‌ గేమ్స్‌ 2026లో అతడు బరిలోకి దిగితే, ఈ గేమ్స్‌లో పాల్గొనే అన్ని దేశాల సభ్యుల (అథ్లెట్‌ లేదా క్రికెటర్‌) ​కంటే అతి పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పుతాడు.

ఏషియన్‌ గేమ్స్‌లో భారత్‌ క్రికెట్‌ జట్టు ఆడబోయే తొలి మ్యాచ్‌ సమయానికి (సెప్టెంబర్‌ 29, రెండో క్వార్టర్‌ ఫైనల్‌) వైభవ్‌ వయసు 15 ఏళ్ల 178 రోజులుగా ఉంటుంది. ఇంత కంటే చిన్న వయసు సభ్యుడు ఎవరూ ప్రస్తుత ఆసియా క్రీడల్లో పాల్గొనడం లేదు. 

మరోవైపు ఈ ఏషియన్‌ గేమ్స్‌లో అత్యంత పెద్ద వయస్కురాలైన అథ్లెట్ కూడా భారత్‌ నుంచే బరిలోకి దిగుతుండటం విశేషం. 55 ఏళ్ల 8 నెలల వయసున్న భారత అశ్వ క్రీడాకారిణి శృతి వోరా ఈ ఘనత సాధించారు.

కాగా, ఇటీవలికాలంలో వైభవ్‌ వయసు విషయంలో దాదాపు అన్ని పాత రికార్డులను బద్దలు కొడుతున్నాడు. ఏషియన్‌ గేమ్స్‌లో కూడా అతడికి తుది జట్టులో చోటు దక్కితే మరో రికార్డు ఖాతాలో వేసుకుంటాడు.

అయితే తాజాగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో వైభవ్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. మరి ఏషియన్‌ గేమ్స్‌లో అయినా అవకాశం దక్కుతుందో లేదో చూడాలి.

ఏషియన్‌ గేమ్స్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ టీమిండియా పూర్తి స్థాయి జట్టుతోనే బరిలోకి దిగుతుంది. ఓపెనర్లుగా సంజూ శాంసన్‌, అభిషేక్‌ శర్మ బరిలోకి దిగడం దాదాపుగా ఖరారైనట్లే. వీరిద్దరూ అద్భుతమైన ఫామ్‌లో ఉండటంతో వైభవ్‌ తుది జట్టు బెర్త్‌పై అనుమానాలు నెలకొన్నాయి. ఈ క్రీడల్లో భారత్‌ గరిష్టంగా మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడగలుగుతుంది. ఏదో ఒక మ్యాచ్‌లో వైభవ్‌కు ఆడే అవకాశం వచ్చినా, ఏషియన్‌ గేమ్స్‌ అతి పిన్న వయస్కుడి రికార్డు అతడి ఖాతాలో వచ్చి పడుతుంది. 

ఇదీ చదవండి: రాజకీయాల్లోకి షమీ..?


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement