యశ్‌ సెంచరీ.. సెహ్వాగ్ కొడుకు మెరుపులు! భారత్‌ భారీ స్కోర్‌ | Yashbardhan Chauhans century takes India U19 to 341-7 against Australia | Sakshi
Sakshi News home page

IND vs AUS: యశ్‌ సెంచరీ.. సెహ్వాగ్ కొడుకు మెరుపులు! భారత్‌ 341 పరుగుల భారీ స్కోర్‌

Sep 21 2026 1:15 PM | Updated on Sep 21 2026 1:28 PM

Yashbardhan Chauhans century takes India U19 to 341-7 against Australia

PC: bcci

రాజ్‌కోట్ వేదిక‌గా ఆస్ట్రేలియా అండ‌ర్‌-19 జ‌ట్టుతో జ‌రుగుతున్న రెండో అనధికారిక వ‌న్డేలో భార‌త యువ బ్యాట‌ర్లు స‌త్తాచాటారు. ఆల్‌రౌండర్‌ యశ్‌వర్ధన్ చౌహాన్(100 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్స్‌లతో 122) భారీ సెంచరీతో కదం తొక్కగా.. వీకే వినీత్(87), ఆర్యవీర్ సెహ్వాగ్(47), కుశాగ్ర ఓఝా(34) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. 

341 పరుగుల భారీ స్కోర్
ఫలితంగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత అండర్‌-19 జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 341 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆస్ట్రేలియా బౌలర్లలో థామస్ వాసియో మూడు, పాట్రిక్ సుల్లివన్ రెండు వికెట్లు పడగొట్టాడు. 

కాగా తొలి వన్డేలో ఆసీస్‌పై భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి మరో వన్డే మిగిలుండగానే సిరీస్‌ను సొంతం చేసుకోవాలని యంగ్ ఇండియా పట్టుదలతో ఉంది.

తుది జ‌ట్లు
ఆస్ట్రేలియా అండ‌ర్‌-19: నీల్ పటేల్, హేడెన్ బార్బులోవిక్(వికెట్ కీప‌ర్‌), జెడ్ హోలిక్, జాక్ క్జోస్నెక్(కెప్టెన్‌), బ్లేక్ కాటిల్, మాథ్యూ లాఫ్, కానర్ గ్రెగొరీ, జాకబ్ పీట్జ్, పాట్రిక్ సుల్లివన్, థామస్ వాసియో, థియో ట్సింగోస్

భార‌త్‌: లక్ష్య రాజేష్ రాయచందానీ(కెప్టెన్‌), ఆర్యవీర్ సెహ్వాగ్, కుషాగ్ర ఓజా, యశ్బర్ధన్ చౌహాన్, అన్వయ్ ద్రవిడ్(వికెట్ కీప‌ర్‌), వీకే వినీత్, యశ్వీర్ గౌడ్, మనల్ చౌహాన్, చిగురుపాటి వెంకట, కావ్య పటేల్, మోహిత్ ఉల్వా
చదవండి: Asian Games 2026: పాకిస్తాన్‌కు భారీ షాక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement