breaking news
Yashbardhan Chauhan
-
10 వికెట్ల తేడాతో ఘన విజయం.. భారత్ చేతిలో ఆసీస్ క్లీన్‌స్వీప్
సొంతగడ్డపై ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరిగిన రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్‌ను భారత యువ జట్టు 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన రెండో అనధికారిక టెస్టులో భారత్ 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 10 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా వికెట్ నష్టపోకుండా 11 పరుగులు చేసి గెలుపొందింది. అంతకముందు ఆస్ట్రేలియా అండర్-19 జట్టు తమ రెండో ఇన్నింగ్స్‌లో 151 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ బ్యాటర్లలో బ్లాక్ కాటిల్ (63) అర్థసెంచరీ సాధించగా, ఎలి బ్రెయిన్ (39) మినహా మిగతావాళ్లంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో స్పిన్నర్ తన్మయ్ బలోడా 8 వికెట్లతో చెలరేగగా, ప్రియాన్షు సింగ్ రెండు వికెట్లు తీశాడు. ఇక భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 315 పరుగులకు ఆలౌటైంది.వికెట్‌కీపర్ అభిప్రయ్ బిశ్వాస్ (73), కెప్టెన్ యశ్‌బర్దన్ చౌహాన్ (52) అర్థసెంచరీలతో రాణించగా, మనాల్ చౌహాన్ (34), ప్రియాన్షు సింగ్ (30 నాటౌట్) రాణించారు. ఆసీస్ బౌలర్లలో స్పెన్సర్ గ్రీన్ ఏడు వికెట్లు తీయగా, థామస్ వెసో 2 వికెట్లు పడగొట్టాడు. ఇక ఆసీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు 174 పరుగులకే కట్టడి చేశారు. తన్మయ్ బలోడా ఆరు వికెట్ల తీయగా, ఆయాన్ అక్రమ్ 2 వికెట్లు తీశాడు.తొలి ఇన్నింగ్స్‌లో ఆరు, రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు.. మొత్తంగా రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 14 వికెట్లు తీసి అండర్-19 క్రికెట్లో బెస్ట్ ప్రదర్శనతో రికార్డు సృష్టించాడు. అంతకముందు జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను కూడా భారత అండర్-19 జట్టు 3-0తో క్లీన్‌స్వీప్ చేయడం విశేషం.ఇదీ చదవండి: శ్రేయస్ మరో ఘనత.. రోహిత్, కోహ్లి సరసన -
7 వికెట్లు తీసిన ఆసీస్ బౌలర్.. 315 పరుగులకు టీమిండియా ఆలౌట్
అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియా అండర్-19 తో జరుగుతున్న రెండో అనధికారిక టెస్ట్‌లో భారత యువ బ్యాటర్లు రాణించారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత అండర్-19 జట్టు 315 పరుగుల భారీ స్కోర్ సాధించింది. దీంతో మొదటి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 141 పరుగుల మెరుగైన అధిక్యం లభించింది.కాగా 38 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన భారత్‌ను వన్‌డౌన్ బ్యాటర్ కుమార్ కుశాగ్రా (61 బంతుల్లో 29), కెప్టెన్ యశ్వర్దన్ చౌహాన్ అర్ధ శతకం (83 బంతుల్లో 52)తో అదుకున్నారు. అనంతరం మిడిలార్డర్ బ్యాటర్లు మనల్ చౌహాన్(34), ఆర్యన్ యాదవ్(30), అభిప్రాయ్ బిశ్వాస్(73) కీలక ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నారు.వీరితో పాటు టెయిలాండర్లు ప్రియాన్ష్ సింగ్(30), తన్మయ్ బలోడా(28) దూకుడగా ఆడారు. టీమ్ మొత్తం సమిష్టంగా రాణించడంతో కంగారులపై భారత్ పై చేయి సాధించింది. ఆసీస్ బౌలర్లలో స్పెన్సార్ గ్రీన్ 7 వికెట్లతో సత్తాచాటాడు. అతడితో పాటు థామస్ రెండు వికెట్లు సాధించాడు. అంతకుముందు ఆస్ట్రేలియా భారత బౌలర్ల ధాటికి తాళలేక తొలి ఇన్నింగ్స్‌లో 174 పరుగులకే కుప్పకూలింది. . ఆతిథ్య జట్టు బౌలర్లలో తన్మయ్ బలోడా ఆరు వికెట్లతో చెలరేగగా.. అయాన్ అక్రం రెండు, మోహిత్ ఉల్వా, ప్రియాన్షు సింగ్ తలా ఒక వికెట్ పడగొట్టారు.చదవండి: IND vs NZ: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. టీమిండియాకు భారీ షాక్! -
IND vs AUS: కెప్టెన్ హాఫ్ సెంచరీ.. ఆధిక్యంలోకి భారత్
ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో రెండో అనధికారిక టెస్టులో భారత జట్టు తిరిగి పుంజుకుంది. మిడిలార్డర్ రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యంలోకి దూసుకువచ్చింది. కాగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం గ్రౌండ్ ‘బి’లో భారత్- ఆసీస్ అండర్-19 జట్ల మధ్య సోమవారం రెండో యూత్ టెస్టు మొదలైంది.174 పరుగులకే ఆలౌట్‌టాస్ గెలిచిన భారల్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. ఆసీస్ బ్యాటింగ్‌కు దిగింది. భారత బౌలర్ల ధాటికి తాళలేక తొలి ఇన్నింగ్స్‌లో 174 పరుగులకే కుప్పకూలింది. నీల్ పటేల్ (31), చార్లీ హెండర్సన్ (37) మాత్రమే ముప్పై పరుగుల స్కోరు దాటగలిగారు. ఆతిథ్య జట్టు బౌలర్లలో తన్మయ్ బలోడా ఆరు వికెట్లతో చెలరేగగా.. అయాన్ అక్రం రెండు, మోహిత్ ఉల్వా, ప్రియాన్షు సింగ్ తలా ఒక వికెట్ పడగొట్టారు.అనంతరం.. తొలి రోజే బ్యాటింగ్ మొదలుపెట్టిన భారత్.. సోమవారం ఆట పూర్తయ్యే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 38 పరుగులే చేయగలిగింది. ఓపెనర్లు లక్ష్య రాయ్ చందాని (1), సాగర్ విర్క్ (16) పూర్తిగా నిరాశపరిచారు. యశ్వర్దన్ చౌహాన్ అర్ధ శతకంఈ క్రమంలో 38/2 ఓవర్‌నైట్ స్కోరుతో మంగళవారం నాటి రెండో రోజు ఆట మొదలుపెట్టిన భారత జట్టు.. నిలకడైన ఆట తీరుతో ఆధిక్యంలోకి వచ్చింది.వన్‌డౌన్ బ్యాటర్ కుమార్ కుశాగ్రా (61 బంతుల్లో 29) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ యశ్వర్దన్ చౌహాన్ అర్ధ శతకం (83 బంతుల్లో 52)తో ఆకట్టుకున్నాడు. మిగిలిన వారిలో మనాల్ చౌహాన్ 34, ఆర్యన్ యాదవ్ 30 పరుగులతో రాణించారు. ఆధిక్యంలోకి భారత్లోయర్ ఆర్డర్లో మోహిత్ ఉల్వా (5), అయాన్ అక్రం (0) విఫలమయ్యారు. వీళ్లిద్దరు ఒకే ఓవర్లో (52వ ఓవర్) అవుట్ కాగా.. అప్పటికి భారత్ ఎనిమిది వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసి.. పది పరుగుల ఆధిక్యంలోకి వెళ్లింది.ఇక 60 ఓవర్ల ఆట పూర్తయ్యేసరికి భారత్ ఓవరాల్‌గా యాభైకి పైగా (55) పరుగుల ఆధిక్యం సంపాదించింది. ప్రియాన్షు సింగ్ (5*), అభిప్రయ్ బిస్వాస్ (47*) క్రీజులో నిలిచారు.చదవండి: టీమిండియా కొత్త కెప్టెన్‌గా స్టార్ ఓపెనర్! -
IND vs AUS: తొలి టెస్టులో ఆసీస్‌ను చిత్తు చేసిన భారత్
భారత అండర్-19 క్రికెట్ జట్టు మరోసారి అదరగొట్టింది. స్వదేశంలో ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో యూత్ వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన భారత్.. తాజాగా యూత్ టెస్టు సిరీస్‌లోనూ శుభారంభం చేసింది.టాస్ గెలిచిన ఆసీస్రాజ్కోట్ వేదికగా ఆదివారం మొదలైన తొలి యూత్ టెస్టులో ఇన్నింగ్స్ 48 పరుగుల తేడాతో ఆసీస్ జట్టును మట్టికరిపించింది. తద్వారా రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. నిరంజన్ షా స్టేడియంలో టాస్ గెలిచిన ఆసీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.చెలరేగిన ఇషాన్ ఓంభారత బౌలర్ల ధాటికి తాళలేక కంగారూ టాపార్డర్ కుదేలు కాగా.. మిడిలార్డర్ కాస్త మెరుగ్గా రాణించింది. ఓపెనర్లు నీల్ పటేల్ (11), హేడేన్ బార్బూలోవిక్ (0).. వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ మాథ్యూ లాఫ్ (1) తేలిపోయారు. నాలుగో స్థానంలో వచ్చిన జేడ్ హాలిక్ అర్ధ శతకం (59) చేయగా.. ఐదో నంబర్ బ్యాటర్ బ్లేక్ క్యాటిల్ (102) శతక్కొట్టాడు.ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 217 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో స్పిన్నర్ ఇషాన్ ఓమ్ ఐదు వికెట్లతో చెలరేగగా.. పేసర్ మోహిత్ ఉల్వా మూడు వికెట్లు కూల్చాడు. కెప్టెన్, పార్ట్‌టైమ్ స్పిన్నర్ యశ్వర్దన్ చౌహాన్ రెండు వికెట్లు తీశాడు.లక్ష్య డబుల్ సెంచరీఈ క్రమంలో తమ తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్.. మంగళవారం నాటి మూడో రోజు ఆట సందర్భంగా 494 పరుగుల మేర భారీ స్కోరు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్ లక్ష్య రాయ్‌చందాని ఆసీస్‌పై రికార్డు డబుల్ సెంచరీ (281 బంతుల్లో 24 ఫోర్లు, 4 సిక్స్‌లు: 240)తో చెలరేగగా.. కెప్టెన్ యశ్వర్దన్ అర్ధ శతకం (54)తో రాణించాడు.లోయర్ ఆర్డర్లో ఊహించని రీతిలో పదో నంబర్ బ్యాటర్ మోహిత్ ఉల్వా 92 పరుగులతో ఆకట్టుకున్నాడు. మిగిలిన వారిలో వికెట్ కీపర్ బ్యాటర్ మానవ్ కృష్ణ 25, ఆయాన్ అక్రం 26 పరుగులతో ఫర్వాలేదనిపించారు. ఆసీస్ బౌలర్లలో కేసీ బార్టన్ మూడు వికెట్లు తీయగా.. థియో సింగోస్, స్పెన్సర్ గ్రీన్, కొనొర్ గ్రెగరీ తలా రెండు.. ఎలి బ్రేయిన్ ఒక వికెట్ తీశారు.ఈసారి కెప్టెన్ సాబ్ఇక తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 277 పరుగుల భారీ ఆధిక్యం లభించగా.. రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆసీస్ 229 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా భారత్ ఇన్నింగ్స్ మీద 48 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ఈసారి కూడా ఇషాన్ ఓం నాలుగు వికెట్లతో చెలరేగగా.. యశ్వర్దన్ అనూహ్యంగా ఆరు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు.భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా తొలి యూత్ టెస్టు సంక్షిప్త స్కోర్లు👉భారత్- 494👉ఆస్ట్రేలియా- 217 & 229👉ఫలితం: ఆసీస్‌పై ఇన్నింగ్స్ 48 పరుగుల తేడాతో భారత్ గెలుపు.చదవండి: IND vs WI: విండీస్‌తో రెండో వన్డే.. భారత తుదిజట్టులో మార్పు! -
IND vs AUS: చరిత్ర సృష్టించిన భారత ఓపెనర్.. ప్రపంచ రికార్డు
భారత యువ క్రికెటర్ లక్ష్య రాజేశ్ రాయ్‌చందాని సరికొత్త చరిత్ర సృష్టించాడు. యూత్ టెస్టుల్లో ఆస్ట్రేలియాపై ఇంత వరకు ఏ బ్యాటర్‌కూ సాధ్యం కాని అత్యంత అరుదైన ఘనత సాధించాడు. మూడు అనధికారిక వన్డేలు, రెండు అనధికారిక టెస్టులు ఆడేందుకు ఆసీస్ అండర్-19 జట్టు భారత పర్యటనకు వచ్చింది. ఇందులో భాగంగా లక్ష్య కెప్టెన్సీలో వన్డే సిరీస్‌ను యువ భారత్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది.217 పరుగులకే ఆలౌట్‌ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య రాజ్‌కోట్ వేదికగా ఆదివారం తొలి యూత్ టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుని.. తొలి ఇన్నింగ్స్‌లో 217 పరుగులకే ఆలౌట్ అయింది. బ్లేక్ క్యాటిల్ సెంచరీ (102) చేయగా.. జేడ్ హాలిక్ (59) అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. భారత బౌలర్లలో ఇషాన్ ఓమ్ ఐదు వికెట్లతో చెలరేగి ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు.అనంతరం తమ మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత అండర్-19 జట్టు.. మంగళవారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా 494 పరుగుల భారీ స్కోరు చేసి ఆలౌట్ అయింది. ఇందులో ఓపెనర్ లక్ష్య రాయ్చందానిదే కీలక పాత్ర.డబుల్ సెంచరీతో దుమ్ములేపిన లక్ష్యఆసీస్తో తొలి యూత్ టెస్టులో లక్ష్య.. ద్విశతకంతో కదంతొక్కాడు. ఈ కుడిచేతివాటం బ్యాటర్ మొత్తంగా 281 బంతులు ఎదుర్కొని 240 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 24 ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. ప్రపంచ రికార్డుఈ క్రమంలోనే ఆసీస్‌పై యూత్ టెస్టుల్లో డబుల్ సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా లక్ష్య ప్రపంచ రికార్డు సాధించాడు. గతంలో పాకిస్తాన్ ఆటగాడు ఆస్ట్రేలియతో యూత్ టెస్టుల్లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధికంగా 175 పరుగులు చేసి.. అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. లక్ష్య ఈ రికార్డును తాజాగా బద్దలు కొట్టాడు. కాగా ఈ మ్యాచ్‌లో లక్ష్య థియో సింగోస్ బౌలింగ్‌లో ఎలి బ్రేయిన్‌కు క్యాచ్ ఇవ్వడంతో లక్ష్య పెవిలియన్ చేరాల్సి వచ్చింది.మరో ఘనతఇక ఓవరాల్‌గా యూత్ టెస్టుల్లో అత్యధిక రెండో వ్యక్తిగత స్కోరు సాధించిన భారత ఆటగాడినూ లక్ష్య నిలిచాడు. 2018లో శ్రీలంకతో యూత్ టెస్టులో భారత ఆటగాడు పవన్ షా 282 పరుగులు చేసి ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.ఇదిలా ఉంటే.. లక్ష్యతో పాటు కెప్టెన్ యశ్వర్దన్ చౌహాన్ (54), మోహిత్ ఉల్వా (92) రాణించారు. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో 494 పరుగులకు ఆలౌట్ అయిన భారత్.. ఆసీస్ కంటే 227 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించింది.చదవండి: Asian Games Cricket: మరో చిన్న జట్టుకు అన్యాయం -
ఐదు వికెట్లతో చెలరేగిన భారత బౌలర్.. ఆసీస్ 217 ఆలౌట్
రాజ్‌కోట్ వేదికగా ఆస్ట్రేలియా-అండర్ 19 జట్టుతో జరుగుతున్న తొలి అనధికారిక టెస్టులో తొలిరోజు భారత యువ జట్టు ఆధిపత్యం ప్రదర్శించింది. మొదటిరోజు ఆట ముగిసే సమయానికి భారత అండర్-19 జట్టు వికెట్ నష్టపోకుండా 8 పరుగులు చేసింది. లక్ష్యరాజేశ్, సాగర్ వీకే క్రీజులో ఉన్నారు. అంతకముందు ఆస్ట్రేలియా భారత బౌలర్ల ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 217 పరుగులకు ఆలౌటైంది. మిడిలార్డర్లో బ్లేక్ కాటిల్ (102) సెంచరీ చేయగా, జెడ్ హొలిక్ (59) అర్థసెంచరీ సాధించగా, మిగతావారిలో ఎవరు పెద్దగా రాణించలేదు. భారత బౌలర్లలో ఇషాన్ ఓం 5 వికెట్లతో ఆసీస్ వెన్ను విరవగా, మోహిత్ ఉల్వా మూడు, కెప్టెన్ యశ్‌బర్దన్ చౌహాన్ రెండు వికెట్లు తీశారు.A five-wicket haul for Ishan Om as India U-19 restricts Australia to 217 in the first innings. @sportstarweb pic.twitter.com/uzkhggtOVx— Shayan Acharya (@ShayanAcharya) September 27, 2026ఇదీ చదవండి: ఈ దశాబ్దంలోనే రూట్ అత్యంత చెత్త రికార్డు! -
IND vs AUS: ద్రవిడ్ కుమారుడిపై వేటు!.. ఆసీస్ 254 ఆలౌట్
రాజ్‌కోట్ వేదికగా ఇండియా అండర్-19 జట్టుతో జరుగుతున్న మూడో అనధికారిక వన్డేలో ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 254 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్లలో జెడ్ హొలిక్ (87) టాప్ స్కోరర్‌గా నిలవగా, నీల్ పటేల్ (51) అర్థసెంచరీ సాధించాడు. భారత బౌలర్లలో మనల్ చౌహాన్, మోహిత్ ఉల్వా చెరో 3 వికెట్లు పడగొట్టగా, కావ్యా పటేల్, ఆర్యన్ సవ్సానీ చెరొక వికెట్ తీశారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన భారత అండర్-19 జట్టు 2-0తో సిరీస్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.ద్రవిడ్ కుమారుడిపై వేటు!కాగా ఈ మ్యాచ్‌కు ద్రవిడ్ కుమారుడు అన్వయ్ ద్రవిడ్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. తొలి వన్డేలో 38 పరుగులు చేసిన అన్వయ్ రెండో వన్డేలో మాత్రం 9 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. దీంతో మూడో వన్డేకు అన్వయ్‌ను పక్కనబెట్టిన జట్టు మేనేజ్మెంట్ అతడి స్థానంలో రజత్ బగేల్‌ను జట్టులోకి తీసుకొచ్చింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత యువజట్టు చివరి వన్డేలో ప్రయోగాలకు తెరలేపింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో తన బౌలింగ్‌తో ఆకట్టుకున్న తెలుగు కుర్రాడు చిగురుపాటి వెంకటతో పాటు రెండో వన్డేలో భారీ సెంచరీ చేసిన యశ్‌బర్దన్ కూడా బెంచ్‌కే పరిమితమయ్యాడు.అదరగొడుతున్న సెహ్వాగ్ కుమారుడుఇక ద్రవిడ్ కుమారుడు అన్వయ్ లంక పర్యటనలో ఆకట్టుకున్నాడు. 17 ఏళ్ల అన్వయ్ రెండు మ్యాచ్‌ల్లో వరుసగా 14, 87 పరుగులు సాధించాడు. ఇక అండర్-19 జట్టులో ద్రవిడ్ కుమారుడు ఒక్కడే కాదు, మాజీ విధ్వంసకర ఆటగాడు సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ సెహ్వాగ్ కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరిగి తొలి వన్డేలో 26 బంతుల్లో 28 పరుగులు, రెండో వన్డేలో 48 బంతుల్లో 47 పరుగులు సాధించాడు. అంతేకాదు బౌలింగ్‌లోనూ ఆర్యవీర్ తన ప్రతిభను ప్రదర్శిస్తూ రెండో వన్డేలో రెండు కీలక వికెట్లు తీసి విజయంలో తన వంతు పాత్రను పోషించాడు.ఇదీ చదవండి: ఆసీస్‌పై కుషాగ్ర సెంచరీ.. ఇండియా-ఏ 334 ఆలౌట్ -
దుమ్మురేపిన యశ్.. ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం
రాజ్‌కోట్ వేదికగా సోమవారం ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరిగిన అనధికారిక వన్డేలో భారత అండర్-19 జట్టు 103 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 342 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు 41.1 ఓవర్లలో 238 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్లలో కెప్టెన్ జాక్ జోస్నెక్ (81), బ్లేక్ కాటిల్ (44), జెడ్ హొలిక్ (33) పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో చిగురుపాటి వెంకట 3 వికెట్లు తీయగా, కావ్యా పటేల్, యశ్బర్ధన్ చౌహాన్లు చెరో 2 వికెట్లు పడగొట్టారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత అండర్-19 జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 341 పరుగుల భారీ స్కోరు చేసింది. యశ్‌బర్దన్ చౌహాన్ (122) సెంచరీతో చెలరేగగా.. వినీత్ (87), ఆర్యవీర్ (47) రాణించారు.ఆస్ట్రేలియా బౌలర్లలో థామస్ వాసో 3 వికెట్లు తీయగా, పాట్రిక్ సుల్లివన్ 2 వికెట్లు పడగొట్టాడు. సెంచరీ సహా రెండు వికెట్లతో ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచిన యశ్బర్ధన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు సొంతం చేసుకున్నాడు. కాగా మూడు మ్యాచ్‌ల అనధికారిక వన్డే సిరీస్‌లో భాగంగా ఇప్పటికే తొలి రెండు వన్డేల్లో గెలిచిన భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఇరుజట్ల మధ్య మూడో వన్డే మ్యాచ్ ఇదే స్టేడియం వేదికగా బుధవారం జరగనుంది. ఇదీ చదవండి: జపాన్ చేరుకున్న టీమిండియా; ఆతిథ్యంపై శ్రేయస్ ఏమన్నాడంటే? -
టీమిండియా వైపు దూసుకొస్తున్న యువ సంచలనం.. ఎవరీ యశ్?
భారత సీనియర్ క్రికెట్ జట్టు వైపు మరో యువ సంచలనం దూసుకొస్తున్నాడు. తన అద్భుత బ్యాటింగ్‌తో మరో వైభవ్ సూర్యవంశీని తలపిస్తున్నాడు. అతడే భారత అండర్-19 జట్టు ఆటగాడు యశ్వర్ధన్ సింగ్ చౌహాన్. ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరుగుతున్న అనధికారిక వన్డే సిరీస్‌లో యశ్వర్ధన్ దుమ్మురేపుతున్నాడు. రాజ్‌కోట్ వేదికగా జరిగిన తొలి వన్డేలో మెరుపు హాఫ్ సెంచరీతో సత్తాచాటిన యశ్వర్ధన్, ఇప్పుడు రెండో వన్డేలో భారీ సెంచరీతో కదం తొక్కాడు.నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ఈ యువ ఆటగాడు ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఫస్ట్-డౌన్ బ్యాటర్ వి.కె. వినీత్‌తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మొత్తంగా 100 బంతులు ఎదుర్కొన్న యశ్వర్ధన్.. 15 ఫోర్లు, 2 సిక్సర్లతో 122 పరుగులు చేసి ఔటయ్యాడు. ఫలితంగా భారత యువ జట్టు నిర్ణీత ఓవర్లలో 341 పరుగుల భారీ స్కోరు సాధించింది. దీంతో ఈ 'యంగ్ సెన్సేషన్' గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు తీవ్ర ఆసక్తి చూపుతున్నారు.ఎవరీ యశ్వర్ధన్?రైట్ హ్యాండ్ బ్యాటర్ అయిన యశ్వర్ధన్ సింగ్, 2009 ఏప్రిల్ 19న నాగాలాండ్‌లోని దిమాపూర్‌లో జన్మించాడు. అయితే అతడు పెరిగింది మాత్రం మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో. ఈ 17 ఏళ్ల క్రికెటర్ రైట్ హ్యాండ్ బ్యాటింగ్‌తో పాటు ఆఫ్ స్పిన్ బౌలింగ్ కూడా చేయగలడు.యశ్వర్ధన్కు చిన్నతనం నుంచే క్రికెట్‌పై మక్కువ ఎక్కువ. అతడి తండ్రి అనామి సింగ్ చౌహాన్ కూడా ఒక క్రికెటరే కావడం విశేషం. లెగ్ స్పిన్నర్ అయిన అనామి గొప్ప క్రికెటర్ కావాలని కలలు కనేవాడు, కానీ అతడు క్లబ్ క్రికెట్ స్థాయిలోనే ఉండిపోయాడు. ఇప్పుడు తండ్రి కలను కొడుకు యశ్వర్ధన్ నిజం చేస్తున్నాడు.మొన్నటి వరకు గ్వాలియర్‌లోని సింధియా స్కూల్ క్లాస్‌రూమ్‌లో చివరి వరుసలో కూర్చుని క్రికెట్ మ్యాచ్ ప్లాన్లు వేసుకునే యశ్వర్ధన్, ఇప్పుడు ఏకంగా భారత అండర్-19 జట్టును నడిపించే స్థాయికి చేరుకున్నాడు. ఈ ఏడాది జూన్‌లో శ్రీలంక పర్యటనలో భారత యువ జట్టు సారథిగా వ్యవహరించిన యశ్వర్ధన్, త్వరలో ఆస్ట్రేలియాతో జరగబోయే అనాధికారిక టెస్టు సిరీస్‌లో కూడా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. యశ్వర్ధన్ సింగ్ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే, అతి త్వరలోనే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌తో పాటు భారత జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.చదవండి: ఆస్ట్రేలియాపై వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడి విధ్వంసం -
యశ్ సెంచరీ.. సెహ్వాగ్ కొడుకు మెరుపులు! భారత్ భారీ స్కోర్
రాజ్‌కోట్ వేదికగా ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరుగుతున్న రెండో అనధికారిక వన్డేలో భారత యువ బ్యాటర్లు సత్తాచాటారు. ఆల్‌రౌండర్ యశ్వర్ధన్ చౌహాన్(100 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్స్‌లతో 122) భారీ సెంచరీతో కదం తొక్కగా.. వీకే వినీత్(87), ఆర్యవీర్ సెహ్వాగ్(47), కుశాగ్ర ఓఝా(34) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. 341 పరుగుల భారీ స్కోర్ఫలితంగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత అండర్-19 జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 341 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆస్ట్రేలియా బౌలర్లలో థామస్ వాసియో మూడు, పాట్రిక్ సుల్లివన్ రెండు వికెట్లు పడగొట్టాడు. కాగా తొలి వన్డేలో ఆసీస్‌పై భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి మరో వన్డే మిగిలుండగానే సిరీస్‌ను సొంతం చేసుకోవాలని యంగ్ ఇండియా పట్టుదలతో ఉంది.తుది జట్లుఆస్ట్రేలియా అండర్-19: నీల్ పటేల్, హేడెన్ బార్బులోవిక్(వికెట్ కీపర్), జెడ్ హోలిక్, జాక్ క్జోస్నెక్(కెప్టెన్), బ్లేక్ కాటిల్, మాథ్యూ లాఫ్, కానర్ గ్రెగొరీ, జాకబ్ పీట్జ్, పాట్రిక్ సుల్లివన్, థామస్ వాసియో, థియో ట్సింగోస్భారత్: లక్ష్య రాజేష్ రాయచందానీ(కెప్టెన్), ఆర్యవీర్ సెహ్వాగ్, కుషాగ్ర ఓజా, యశ్బర్ధన్ చౌహాన్, అన్వయ్ ద్రవిడ్(వికెట్ కీపర్), వీకే వినీత్, యశ్వీర్ గౌడ్, మనల్ చౌహాన్, చిగురుపాటి వెంకట, కావ్య పటేల్, మోహిత్ ఉల్వాచదవండి: Asian Games 2026: పాకిస్తాన్‌కు భారీ షాక్ -
ఆస్ట్రేలియాపై వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడి విధ్వంసం
భారత దిగ్గజ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు, భారత అండర్-19 జట్టు ఓపెనర్ ఆర్యవీర్ సెహ్వాగ్ తృటిలో తన తొలి అర్ధ సెంచరీని చేజార్చుకున్నాడు. రాజ్ కోట్ వేదికగా ఆస్ట్రేలియా యువ జట్టుతో జరుగుతున్న రెండో అనధికారిక వన్డేలో ఆర్యవీర్ మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు. ఆసీస్ బౌలర్లను ఉతికారేసిన ఆర్యవీర్.. 9 ఫోర్లతో విధ్వంసం సృష్టించాడు.ఇన్నింగ్స్ ఆరంభం నుంచే తండ్రిని తలపించేలా ఆకట్టుకునే షాట్లతో చెలరేగిపోయిన జూనియర్ సెహ్వాగ్... మొత్తంగా 48 బంతుల్లో 47 పరుగులు చేశాడు. అయితే హాఫ్ సెంచరీకి కేవలం మూడు పరుగుల దూరంలో ఉండగా అతడు దురదృష్టవశాత్తూ రనౌట్ అయ్యాడు.అంతకుముందు జరిగిన తన అరంగేట్ర మ్యాచ్‌లోనూ ఆర్యవీర్ 28 పరుగులతో పర్వాలేదనిపించాడు. మరోవైపు ఆర్యవీర్ అందించిన శుభారంభంతో భారత యువ జట్టు రెండో వన్డేలో భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. 40 ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్ 3 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది.UPDATE: యశ్ సెంచరీ.. భారత్ భారీ స్కోరుతుది జట్లుఆస్ట్రేలియా అండర్-19: నీల్ పటేల్, హేడెన్ బార్బులోవిక్(వికెట్ కీపర్), జెడ్ హోలిక్, జాక్ క్జోస్నెక్(కెప్టెన్), బ్లేక్ కాటిల్, మాథ్యూ లాఫ్, కానర్ గ్రెగొరీ, జాకబ్ పీట్జ్, పాట్రిక్ సుల్లివన్, థామస్ వాసియో, థియో ట్సింగోస్భారత్: లక్ష్య రాజేష్ రాయచందానీ(కెప్టెన్), ఆర్యవీర్ సెహ్వాగ్, కుషాగ్ర ఓజా, యశ్బర్ధన్ చౌహాన్, అన్వయ్ ద్రవిడ్(వికెట్ కీపర్), వీకే వినీత్, యశ్వీర్ గౌడ్, మనల్ చౌహాన్, చిగురుపాటి వెంకట, కావ్య పటేల్, మోహిత్ ఉల్వాచదవండి: IND vs AUS: తొలి ‘వన్డే’లో ఆసీస్‌ను చిత్తు చేసిన భారత్ -
IND vs SL: శ్రీలంకను మట్టికరిపించిన భారత్
శ్రీలంకతో రెండో అనధికారిక టెస్టులో భారత అండర్-19 జట్టు అదరగొట్టింది. ఆతిథ్య జట్టును ఏకంగా 211 పరుగుల భారీ తేడాతో మట్టికరిపించింది. తద్వారా రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 1-0 తేడాతో కైవసం చేసుకుంది.తొలి టెస్టు డ్రా కాగా మూడు యూత్ వన్డేలు, రెండు యూత్ టెస్టులు ఆడేందుకు భారత అండర్-19 జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా వన్డే సిరీస్‌ను ఆతిథ్య లంక యువ జట్టు 2-1తో వశం చేసుకోగా.. ఇరుజట్ల మధ్య గాలె వేదికగా తొలి అనధికారిక టెస్టు డ్రా అయింది.తొలి ఇన్నింగ్స్‌లో 411ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య సోమవారం రెండో అనధికారిక టెస్టు మొదలైంది. కొలంబోలో టాస్ గెలిచిన శ్రీలంక అండర్-19 తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. భారత్ బ్యాటింగ్‌కు దిగింది. తొలి ఇన్నింగ్స్‌లో 105.2 ఓవర్లలో 411 పరుగుల మేర భారీ స్కోరు చేసి ఆలౌట్ అయింది.శతక్కొట్టిన కుశాగ్ర, మనాల్మొదటి ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లలో ఓపెనర్లు లక్ష్య రాజేశ్ రాయ్ చందాని, సాగర్ విర్క్ డకౌట్ అయ్యారు. అయితే, వన్‌డౌన్ బ్యాటర్ కుశాగ్ర ఓజా (111), ఐదో స్థానంలో వచ్చిన మనాల్ చౌహాన్ (150) శతకాలతో అదరగొట్టారు. వీరికి తోడుగా కెప్టెన్ యశ్వర్దన్ చౌహాన్ అర్ధ శతకం (78)తో రాణించాడు. లోయర్ ఆర్డర్లో చిగురుపాటి వెంకట 25 పరుగులు రాబట్టాడు.148 పరుగులకే లంక ఆలౌట్ఇక శ్రీలంక బౌలర్లలో గిమ్హాన్ మెండిస్ మూడు వికెట్లు తీయగా.. సెత్మిక సెనెవిరత్నె, దుల్నిత్ సిగెర, విఘ్నేశ్వరన్ ఆకాశ్ తలా రెండు వికెట్లు దక్కించుకున్నారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 148 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ దిమంత మహావితన 24, విరాన్ చముదిత 21, దుల్నిత్ సిగెర 31, సెత్మిక 25 పరుగులతో ఫర్వాలేదనిపించారు.భారత బౌలర్లలో ప్రణవ్ రాఘవేంద్ర, చిగురుపాటి వెంకట, జగన్నాథన్ హెంచుదేశన్, రోహిత్ యాదవ్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. కావ్యా పటేల్‌కు ఒక వికెట్ దక్కింది. ఇక శ్రీలంక మొదటి ఇన్నింగ్స్‌లో 148 పరుగులకే ఆలౌట్ కావడంతో భారత్‌కు 263 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.లక్ష్యం 472ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్.. మూడు వికెట్ల నష్టానికి 208 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఈసారి ఓపెనర్లలో లక్ష్య రాయ్‌చందాని అజేయ శతకం (116 బంతుల్లో 100)తో మెరవగా.. సాగర్ విర్క్ (17) నిరాశపరిచాడు. వన్‌డౌన్‌లో వచ్చిన ఆర్యన్ సక్పా (6) విఫలం కాగా.. కెప్టెన్ యశ్వర్దన్ 20 పరుగులు చేయగలిగాడు. మనాల్ చౌహాన్ 51 పరుగలతో అజేయంగా నిలిచాడు.211 పరుగుల తేడాతో భారత్ జయభేరిఇక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని (263+208).. భారత్ శ్రీలంకకు 472 పరుగుల భారీ లక్ష్యాన్ని విధించింది. గురువారం నాటి ఆఖరి రోజు ఆటలో భాగంగా కేవలం 260 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఫలితంగా భారత్ 211 పరుగుల భారీ తేడాతో జయభేరి మోగించి సిరీస్‌ను కైవసం చేసుకుంది.చెలరేగిన భారత బౌలర్లులక్ష్య ఛేదనలో లంక బ్యాటర్లలో సెనుజ వెకునగొడ (64), కెప్టెన్ విమత్ దిన్సార (64) అర్ధ శతకాలతో రాణించగా.. కవిజ గెమాగే 36, సెత్మిక 42 పరుగులతో ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో రోహిత్ యాదవ్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. చిగురుపాటి వెంకట మూడు వికెట్లు దక్కించుకున్నాడు. మిగిలిన వారిలో ప్రణవ్ రాఘవేంద్ర, జగన్నాథన్ హెంచుదేశన్, యశ్వర్దన్ తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.శ్రీలంక వర్సెస్ భారత్ రెండో అనధికారిక టెస్టు సంక్షిప్త స్కోర్లుభారత్: 411 & 208/3 డిక్లేర్డ్శ్రీలంక: 148 & 260చదవండి: IND vs ZIM: తొలి టీ20కి భారత తుదిజట్టు ఇదే! -
IND vs SL: శ్రీలంక ఆలౌట్.. భారీ ఆధిక్యంలో భారత్
భారత్ అండర్-19 జట్టుతో రెండో అనధికారిక టెస్టులో శ్రీలంక యువ జట్టు స్వల్ప స్కోరుకే కుప్పకూలింది. మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 148 పరుగులు చేసి ఆలౌట్ అయింది. కాగా రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్- శ్రీలంక అండర్-19 జట్ల మధ్య సోమవారం రెండో యూత్ టెస్టు మొదలైంది.తొలిరోజే కుశాగ్ర సెంచరీకొలంబోలో టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. భారత్ బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో తొలి రోజు ఆట నిలిచే సమయానికి 65 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది.ఓపెనర్లు లక్ష్య (0), సాగర్ (0) డకౌట్ కావడంతో... స్కోరు బోర్డు మీద ఒక్క పరుగు చేరకముందే మన జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ యశ్వర్ధన్తో కలిసి వన్‌డౌన్ బ్యాటర్ కుశాగ్ర ఓజా ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. కుశాగ్ర ఓజా శతకం (177 బంతుల్లో 103 బ్యాటింగ్; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) సాధించగా... కెప్టెన్ యశ్వర్ధన్ చౌహాన్ (89 బంతుల్లో 78; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు), మనల్ చౌహాన్ (108 బంతుల్లో 55 బ్యాటింగ్; 7 ఫోర్లు) అర్ధసెంచరీలతో మెరిశారు. లంక బౌలర్లను సమర్థంగా అడ్డుకున్న ఈజంట మూడో వికెట్‌కు 122 పరుగులు జోడించింది.రెండోరోజు ఆట సాగిందిలా..అనంతరం కెప్టెన్ అవుట్ కాగా... కుశాగ్రకు మనల్ చౌహాన్ అండగా నిలిచాడు... ఈ జోడీ అబేధ్యమైన నాలుగో వికెట్‌కు 131 పరుగులు జతచేసింది. ఈ క్రమంలో 253/3 ఓవర్‌నైట్ స్కోరుతో మంగళవారం నాటి రెండో రోజు ఆట మొదలుపెట్టిన భారత్.. 411 పరుగులకు ఆలౌట్ అయింది. ఆట మొదలైన కాసేపటికే కుశాగ్ర (111) అవుట్ కాగా.. మనాల్ చౌహాన్ భారీ శతకం (244 బంతుల్లో 150)తో చెలరేగాడు.ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో 105.2 ఓవర్లలో భారత్ 411 పరుగుల భారీ స్కోరు చేసి ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ మొదలుపెట్టిన శ్రీలంక.. మంగళవారం ఆట పూర్తయ్యేసరికి 40 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయి 122 పరుగులు మాత్రమే చేసింది.148 పరుగులకు ఆలౌట్‌ఈ క్రమంలో 122/8 ఓవర్‌నైట్ స్కోరుతో బుధవారం నాటి మూడో రోజు ఆట మొదలుపెట్టిన శ్రీలంక.. కేవలం మరో 26 పరుగులు జతచేసి ఆలౌట్ అయింది. దుల్నిత్ సిగెర 31 పరుగులతో లంక టాప్ రన్ స్కోరర్‌గా నిలవగా.. ఓపెనర్ దిమంత మహావితన 24, విరాన్ చముదిత 21, లోయర్ ఆర్డర్లో సెత్మిక సెనెవిరత్నె 25 (నాటౌట్) పరుగులతో ఫర్వాలేదనిపించారు.మిగిలిన వాళ్లలో అవీష సమాశ్ (9), సెనుజ వెకునగొడ (5), కెప్టెన్ విమత్ దిన్సారా (8), కవిజ గెమాగే (7), వికెట్ కీపర్ బ్యాటర్ జేసన్ ఫెర్నాండో (4), గిమ్హాన్ మెండిస్ (4), విఘ్నేశ్వరన్ ఆకాశ్ (4) పెవిలియన్‌కు వరుస కట్టారు.భారత బౌలర్లలో ప్రణవ్ రాఘవేంద్ర, చిగురుపాటి వెంకట, జగన్నాథన్ హేంచుదేశన్, రోహిత్ యాదవ్ తలా రెండు వికెట్లు కూల్చగా.. కావ్యా పటేల్ ఒక వికెట్ దక్కించుకున్నాడు. ఈ క్రమంలో 263 పరుగుల భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది భారత్.భారత్‌కు భారీ ఆధిక్యంబుధవారం నాటి భోజన విరామ సమయానికి 16 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. ఓపెనర్లలో సాగర్ విర్క్ (17) మరోసారి విఫలం కాగా.. వన్‌డౌన్‌లో వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ ఆర్యన్ సక్పా (6) నిరాశపరిచాడు. ఓపెనర్ లక్ష్య రాయ్‌చందాని 31, కెప్టెన్ యశ్వర్దన్ 5 పరుగులతో క్రీజులో నిలిచారు. లంక బౌలర్లలో కవిజ గెమాగే తొలి రెండు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 330 పరుగుల భారీ ఆధిక్యంలో నిలిచింది.చదవండి: ప్రపంచంలోనే బెస్ట్.. ఎందుకు ఆడించలేదు? -
డబుల్ సెంచరీతో చెలరేగిన భారత ఓపెనర్
శ్రీలంక అండర్-19 జట్టుతో తొలి అనధికారిక టెస్టు మ్యాచ్‌లో భారత ఓపెనర్ లక్ష్య రాజేశ్ రాయ్‌చందాని మారథాన్ ఇన్నింగ్స్ ఆడాడు. నిలకడగా ఆడుతూ డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే, ఆ తర్వాత కాసేపటికే పెవిలియన్ చేరాడు.మూడు యూత్ వన్డేలు, రెండు యూత్ టెస్టులు ఆడేందుకు భారత అండర్-19 జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లింది. వన్డే సిరీస్‌లో ఆతిథ్య జట్టు చేతిలో భారత్ 2-1 తేడాతో ఓటమిపాలైంది. అనంతరం ఇరుజట్ల మధ్య సోమవారం తొలి యూత్ టెస్టు మొదలైంది.గాలె వేదికగా టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్‌కు దిగింది. వన్‌డౌన్ బ్యాటర్ సెనుజ వెకునగొడ డబుల్ సెంచరీ (267 బంతుల్లో 233)తో దుమ్ములేపగా.. కెప్టెన్ విమత్ దిన్సార (52), కవిజ గమాగె (45), ఒషాడా మనాహర (31*) రాణించారు. ఆధిక్యంలోకి భారత్ఫలితంగా శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్‌ను 106.4 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 424 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం తమ ఆట మొదలుపెట్టిన భారత్.. గురువారం భోజన విరామ సమయానికి 55 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. 378/3 ఓవర్‌నైట్ స్కోరుతో చివరి రోజు ఆట ఆరంభించిన భారత జట్టు లంచ్ బ్రేక్ టైమ్‌కి 149 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 479 పరుగులు చేసింది.లక్ష్య డబుల్ సెంచరీతోకాగా బుధవారం 196 పరుగుల వద్ద నిలిచిన లక్ష్య.. గురువారం ద్విశతక మార్కును అందుకున్నాడు. మొత్తంగా 324 బంతుల్లో 22 ఫోర్లు, మూడు సిక్సర్లు బాది 207 పరుగులు సాధించాడు. దిమత్ అబేయ్సింఘే బౌలింగ్‌లో బౌల్డ్ కావడంతో లక్ష్య మారథాన్ ఇన్నింగ్స్‌కు తెరపడింది.ఇక మిగలిన వారిలో మరో ఓపెనర్ సాగర్ విర్క్ శతకం (134) సాధించగా.. వన్‌డౌన్ బ్యాటర్ కుశాగ్రా ఓజా 24 పరుగులు చేశాడు. కెప్టెన్ యశ్వర్దన్ చౌహాన్ (6) విఫలం కాగా.. కుశ్ పటేల్ 42 పరుగులతో రాణించాడు. గురువారం లంచ్ బ్రేక్ సమయానికి బీకే కిషోర్ 1, మానవ్ క్రిష్ణ 35 పరుగులతో క్రీజులో నిలిచారు. అంతకుముందు కావ్యా పటేల్ (8), జగన్నాథన్ హేంచుదేశన్ (0) అవుటయ్యారు. ఆటకు ఇదే చివరి రోజు కావడంతో ఈ మ్యాచ్ డ్రాగా ముగియడం లాంఛనమే కానుంది.చదవండి: విధ్వంసకర శతకాలు.. పంజాబ్ కింగ్స్ ప్రపంచ రికార్డు బద్దలు -
IND vs SL: శతకాలతో చెలరేగిన భారత ఓపెనర్లు
శ్రీలంక అండర్-19 జట్టుతో తొలి అనధికారిక టెస్టు మ్యాచ్‌లో భారత యువ ఓపెనర్లు లక్ష్య రాజేశ్ రాయ్‌చందాని, సాగర్ విర్క్ శతక్కొట్టారు. నిలకడగా, ఓపికగా ఆడుతూ భారీ సెంచరీలతో అదరగొట్టారు. వీరిద్దరి ఇన్నింగ్స్ కారణంగా భారత్ పటిష్ట స్థితికి చేరుకుంది.శ్రీలంక భారీ స్కోరు కాగా భారత్- శ్రీలంక అండర్-19 జట్ల మధ్య సోమవారం తొలి అనధికారిక టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్‌కు దిగింది. వన్‌డౌన్ బ్యాటర్ సెనుజ వెకునగొడ డబుల్ సెంచరీ (233)తో దుమ్ములేపగా.. కెప్టెన్ విమత్ దిన్సార (52) అర్ధ శతకం బాదాడు.మిగిలిన వారిలో కవిజ గమాగే (49), చమిక హీనతిగల (45), ఒషాడా మనాహర (12 బంతుల్లో 31 నాటౌట్) రాణించారు. ఈ క్రమంలో 106.4 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 424 పరుగులు చేసి శ్రీలంక తమ మొదటి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ మంగళవారం నాటి రెండో రోజు ఆట ముగిసేసరికి 58 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 186 పరుగులు చేసింది.ఈ క్రమంలో 186/0 ఓవర్‌నైట్ స్కోరుతో బుధవారం నాటి మూడో రోజు ఆట మొదలుపెట్టిన భారత జట్టుకు వర్షం మరోసారి ఆటంకం కలిగించింది. అయితే, కాసేపటి తర్వాత తెరిపినివ్వడంతో మళ్లీ మ్యాచ్ మొదలైంది. శతకాలతో చెలరేగిన భారత ఓపెనర్లుఈ క్రమంలో శతకం పూర్తి చేసుకున్న ఓపెనర్ సాగర్ (312 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్స్: 134 రన్స్).. లతేంద్ర ఆకాశ్ బౌలింగ్‌లో జేసన్ ఫెర్నాండోకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.ఇక వన్‌డౌన్ బ్యాటర్ కుశాగ్రా ఓజా 24 పరుగులే చేసి నిరాశపరచగా.. కెప్టెన్ యశ్వర్దన్ చౌహాన్ (6) పూర్తిగా విఫలమయ్యాడు. అయితే, మరో ఓపెనర్ లక్ష్య మాత్రం నిలకడగా ఆడుతూ డబుల్ సెంచరీకి చేరువయ్యాడు.గాలేలో బుధవారం ఆట పూర్తయ్యేసరికి మొత్తంగా 306 బంతులు ఎదుర్కొన్న లక్ష్య.. 21 ఫోర్లు, మూడు సిక్స్‌ల సాయంతో 196 పరుగులు చేశాడు. అతడితో పాటు కుశ్ పటేల్ మూడు పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో మూడో రోజు ఆట ముగిసేసరికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 378 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక కంటే ఇంకా 46 పరుగులు వెనుకబడి ఉంది. ఇక ఆటకు గురువారం చివరిరోజు. చదవండి: IND vs ENG: అతడిని ఆరోస్థానంలో ఆడిస్తారా? -
IND vs SL: ఒకే ఒక్కడు!.. శ్రీలంక భారీ స్కోరు
భారత అండర్-19 జట్టుతో తొలి అనధికారిక టెస్టు మ్యాచ్‌లో శ్రీలంక అండర్-19 జట్టు భారీ స్కోరు సాధించింది. భారత బౌలర్ల ధాటికి మెజారిటీ బ్యాటర్లు పెవిలియన్‌కు వరుస కట్టినా.. వన్‌డౌన్ బ్యాటర్ సెనుజ వెకునగొడ ఒంటిచేత్తో జట్టును పటిష్ట స్థితికి చేర్చాడు.కాగా రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్- శ్రీలంక మధ్య గాలె వేదికగా సోమవారం తొలి అనధికారిక టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన ఆతిథ్య శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఆరంభంలోనే ఓపెనర్లు దుల్నిత్ సిగెర (0), దిమంత మహవితన (2) వికెట్లు కోల్పోయింది.సెనుజ డబుల్ సెంచరీఇలాంటి తరుణంలో వన్‌డౌన్ బ్యాటర్ సెనుజ ఆచితూచి ఆడుతూ క్రీజులో పట్టుదలగా నిలబడ్డాడు. తొలి రోజు ఆటలోనే డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతడికి తోడుగా కెప్టెన్ విమత్ దిన్సారా అర్ధ శతకం (52)తో రాణించగా.. కవిజ గమాగే 49 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ఈ క్రమంలో సోమవారం నాటి తొలి రోజు ఆట పూర్తయ్యేసరికి శ్రీలంక 89 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 344 పరుగులు సాధించింది. ఇక 344/4 ఓవర్‌నైట్ స్కోరుతో మంగళవారం నాటి రెండో రోజు ఆట మొదలుపెట్టిన శ్రీలంక.. 9 వికెట్ల నష్టానికి 424 పరుగుల భారీ స్కోరు వద్ద తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.సెనుజ వెకునగొడ మొత్తంగా 267 బంతుల్లో 33 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 233 పరుగులు సాధించాడు. జిడ్డులా క్రీజులో పాతుకుపోయిన అతడిని జగన్నాథన్ హెంచుదేశన్ బౌల్డ్ చేసి పెవిలియన్‌కు పంపించాడు.వర్షం వల్ల నిలిచిన ఆటఇక మిగిలిన వారిలో చమిక హీనతిగల 45 పరుగులు చేయగా.. పదకొండో నంబర్ బ్యాటర్ ఒషాడా మనాహర అనూహ్య రీతిలో 12 బంతుల్లోనే 31 పరుగులతో అజేయంగా నిలిచాడు. భారత బౌలర్లలో జగన్నాథన్ హెంచుదేశన్ మూడు వికెట్లు తీయగా.. కావ్యా పటేల్, ప్రియాన్షు సింగ్ చెరో రెండు.. ప్రణవ్ రాఘవేంద్ర, కెప్టెన్ యశ్వర్దన్ చౌహాన్ తలా ఒక వికెట్ పడగొట్టారు.అనంతరం భారత్ తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టగా వర్షం వల్ల ఆటకు అంతరాయం కలిగింది. వాన వల్ల ఆట నిలిచే సమయానికి భారత జట్టు ఏడు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 25 పరుగులు చేసి.. లంక కంటే 399 పరుగులు వెనుకబడి ఉంది. ఓపెనర్లలో లక్ష్య రాజేశ్ రాయ్‌చందాని 16, సాగర్ విర్క్ 8 పరుగులతో క్రీజులో నిలిచారు.చదవండి: టీమిండియాలోకి సూర్యకుమార్ యాదవ్! -
భారత్‌తో మ్యాచ్.. శ్రీలంక బ్యాటర్ డబుల్ సెంచరీ
భారత్ అండర్-19 జట్టుతో తొలి అనధికారిక టెస్టు మ్యాచ్‌లో శ్రీలంక అండర్-19 జట్టు భారీ స్కోరు సాధించింది. వన్‌డౌన్ బ్యాటర్ సెనుజ వెకునగొడ డబుల్ సెంచరీతో చెలరేగి.. లంక జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు.కాగా మూడు యూత్ వన్డేలు, రెండు యూత్ టెస్టులు ఆడేందుకు భారత యువ జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా తొలుత వన్డే సిరీస్ జరుగగా.. శ్రీలంక 2-1తో గెలిచింది. తొలి మ్యాచ్‌లో భారత్ విజయం సాధించగా.. చివరి రెండు మ్యాచ్‌లు గెలిచి శ్రీలంక సిరీస్‌ను కైవసం చేసుకుంది.ఓపెనర్లను త్వరగానే అవుట్ చేసినా..ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య గాలే వేదికగా సోమవారం తొలి యూత్ టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. భారత్ బౌలింగ్‌కు దిగింది. భారత పేసర్ కావ్యా పటేల్ ఆరంభంలోనే ప్రత్యర్థిని దెబ్బ కొట్టాడు.ఓపెనర్లలో దుల్నిత్ సిగెరను డకౌట్ చేసిన కావ్యా పటేల్.. దిమంత మహవితనను రెండు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌కు పంపాడు. అయితే, భారత జట్టుకు ఈ ఆనందం ఎంతో కాసేపే మిగిలింది. వన్‌డౌన్‌లో వచ్చిన సెనుజ వెకునగొడ క్రీజులో పాతుకుపోయి డబుల్ సెంచరీ కొట్టాడు.203 పరుగులతో అజేయంగా..తొలి రోజు ఆట ముగిసే సరికి సెనుజ మొత్తంగా 227 బంతులు ఎదుర్కొని 31 ఫోర్ల సాయంతో 203 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడికి తోడుగా కెప్టెన్ విమత్ దిన్సారా అర్ధ శతకం (52)తో ఆకట్టుకోగా.. కవిజ గెమాగే 49 పరుగులతో రాణించాడు. చమిక హీనతిగల 33 పరుగులతో సెనుజతో కలిసి క్రీజులో నిలిచాడు.ఫలితంగా సోమవారం నాటి మొదటి రోజు ఆట పూర్తయ్యేసరికి శ్రీలంక 89 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 344 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. భారత్ ఆదిలో వికెట్లు తీసినప్పటికీ.. సెనుజ ద్విశతక ఇన్నింగ్స్ కారణంగా లంకదే పైచేయి అయింది. భారత బౌలర్లలో కావ్యా పటేల్ రెండు వికెట్లు తీయగా.. ప్రణవ్ రాఘవేంద్ర, కెప్టెన్ యశ్వర్దన్ చౌహాన్ తలా ఒక వికెట్ పడగొట్టారు.చదవండి: చారిత్రక మ్యాచ్‌లో టీమిండియా సంచలన విజయం


