ఇన్‌సెట్‌లో ఇశాన్ ఓం (Photo Credit: Twitter)
రాజ్‌కోట్ వేదికగా ఆస్ట్రేలియా-అండర్ 19 జట్టుతో జరుగుతున్న తొలి అనధికారిక టెస్టులో తొలిరోజు భారత యువ జట్టు ఆధిపత్యం ప్రదర్శించింది. మొదటిరోజు ఆట ముగిసే సమయానికి భారత అండర్-19 జట్టు వికెట్ నష్టపోకుండా 8 పరుగులు చేసింది. లక్ష్యరాజేశ్, సాగర్ వీకే క్రీజులో ఉన్నారు.
అంతకముందు ఆస్ట్రేలియా భారత బౌలర్ల ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 217 పరుగులకు ఆలౌటైంది. మిడిలార్డర్‌లో బ్లేక్ కాటిల్ (102) సెంచరీ చేయగా, జెడ్ హొలిక్ (59) అర్థసెంచరీ సాధించగా, మిగతావారిలో ఎవరు పెద్దగా రాణించలేదు. భారత బౌలర్లలో ఇషాన్ ఓం 5 వికెట్లతో ఆసీస్ వెన్ను విరవగా, మోహిత్ ఉల్వా మూడు, కెప్టెన్ యశ్‌బర్దన్ చౌహాన్ రెండు వికెట్లు తీశారు.
A five-wicket haul for Ishan Om as India U-19 restricts Australia to 217 in the first innings. @sportstarweb pic.twitter.com/uzkhggtOVx
— Shayan Acharya (@ShayanAcharya) September 27, 2026
ఇదీ చదవండి: ఈ దశాబ్దంలోనే రూట్ అత్యంత చెత్త రికార్డు!


