టీమిండియా ప్లేయర్‌కు తీవ్ర గాయం.. స్ట్రెచ్చర్‌పై మైదానం బ‌య‌ట‌కు! | Pranav Raghavendra stretched off the field during IND vs AUS U-19 Test | Sakshi
Sakshi News home page

IND vs AUS: టీమిండియా ప్లేయర్‌కు తీవ్ర గాయం.. స్ట్రెచ్చర్‌పై మైదానం బ‌య‌ట‌కు!

Sep 27 2026 3:07 PM | Updated on Sep 27 2026 3:28 PM

Pranav Raghavendra stretched off the field during IND vs AUS U-19 Test

రాజ్‌కోట్ వేదికగా ఆస్ట్రేలియా అండర్‌-19 జట్టుతో జరుగుతున్న తొలి మల్టీ-డే మ్యాచ్‌లో భారత అండర్-19 జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. యువ ఫాస్ట్‌ బౌలర్ ప్రణవ్ రాఘవేంద్ర తీవ్రంగా గాయపడ్డాడు. మ్యాచ్ తొలి రోజు ఫీల్డింగ్ చేస్తుండగా అతడి కాలికి గాయమైంది.

గాయం తీవ్రత కారణంగా ప్రణవ్ అడుగు తీసి అడుగు వేయడానికి కూడా తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. దీంతో వైద్య సిబ్బంది అతడిని స్ట్రెచర్‌పై మైదానం వెలుపలికి తీసుకెళ్లారు. ప్రణవ్ కాలి లిగమెంట్‌కు గాయమైనట్లు సమాచారం. వెంటనే అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి స్కానింగ్ నిర్వహించగా.. గాయం కాస్త తీవ్రంగానే ఉన్నట్లు తేలింది.

ఈ క్రమంలో అతడికి వైద్యులు విశ్రాంతి తీసుకోమని సూచించడంతో, ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో అతడు మళ్లీ బౌలింగ్ చేసే అవకాశాలు కనిపించడం లేదు. గాయపడటానికి ముందు ప్రణవ్ 10 ఓవర్లు బౌలింగ్ చేసి వికెట్ ఏమీ తీసుకోకుండా 25 పరుగులు ఇచ్చాడు. తొలి రోజే కీలక పేసర్ గాయపడటం భారత టీమ్ మేనేజ్‌మెంట్‌ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

కాగా ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా యువ జట్టు నిలకడగా ఆడుతోంది. 67 ఓవర్లకు ముగిసే సరికి ఆసీస్‌ 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. బ్లేక్ క్యాటిల్(101) అద్బుతమైన సెంచరీతో మెరిశాడు.
చదవండి: IND vs WI: బెడిసి కొట్టిన టీమిండియా ప్ర‌యోగం.. ఉతికారేసిన విండీస్‌ బ్యాటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement