బెడిసి కొట్టిన టీమిండియా ప్ర‌యోగం.. ఉతికారేసిన విండీస్‌ బ్యాటర్‌ | Team Indias experiment backfired in Thiruvananthapuram odi | Sakshi
Sakshi News home page

IND vs WI: బెడిసి కొట్టిన టీమిండియా ప్ర‌యోగం.. ఉతికారేసిన విండీస్‌ బ్యాటర్‌

Sep 27 2026 2:50 PM | Updated on Sep 27 2026 3:36 PM

Team Indias experiment backfired in Thiruvananthapuram odi

తిరువనంతపురం వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ వేసిన మొదటి వ్యూహమే బెడిసికొట్టింది. మ్యాచ్ ఆరంభంలోనే విండీస్‌పై ఒత్తిడి పెంచేందుకు గిల్ తీసుకున్న ఒక నిర్ణయం భారత్‌కు షాకిచ్చింది. 

మహ్మద్ సిరాజ్‌కు తుది జట్టులో చోటు దక్కకపోవడంతో ఇన్నింగ్స్ తొలి ఓవర్‌ను పేసర్ ప్రసిద్ధ్ కృష్ణతో గిల్ వేయించాడు. ఆ తర్వాత రెండో ఓవర్ వేసేందుకు గుర్నూర్ బ్రార్ వస్తాడని అంతా భావించినప్పటికీ.. గిల్ అందరినీ ఆశ్చర్యపరుస్తూ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్‌కు బంతిని అప్పగించాడు. 

అయితే ఈ నిర్ణయానికి టీమిండియా భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది.ఈ ఆంధ్రా ఆల్‌రౌండర్ చెత్త బంతులు విసిరి తీవ్రంగా నిరాశపరిచాడు. నితీష్‌ బౌలింగ్‌ను విండీస్ ఓపెనర్ జస్టిన్ గ్రీవ్స్ ఉతికారేశాడు. ఆ ఓవర్‌లో నాలుగు ఫోర్లతో మొత్తం 16 పరుగులు పిండుకున్నాడు. 

ఈ క్రమంలో కొత్త బంతిని నితీష్‌కు అప్పగించడాన్ని నెటిజన్లు తప్పుపడుతున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో టీమిండియా తరపున ముంబై ఇండియన్స్‌ ఆటగాడు నమన్‌ ధీర్‌ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.

తుది జట్లు
వెస్టిండీస్: జాన్ కాంప్‌బెల్, జస్టిన్ గ్రీవ్స్, కీసీ కార్తీ, షాయ్ హోప్(కెప్టెన్‌), అమీర్ జాంగూ, జ్యువెల్ ఆండ్రూ, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డే, గుడాకేష్ మోటీ, అల్జారీ జోసెఫ్, జేడెన్ సీల్స్

భారత్: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్‌), విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్‌), నమన్ ధీర్, రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, గుర్నూర్ బ్రార్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ
చదవండి: విండీస్‌తో తొలి వన్డే.. విధ్వంసకర బ్యాటర్‌ అరంగేట్రం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement