విండీస్‌తో తొలి వన్డే.. టీమిండియాకు గుడ్‌ న్యూస్‌ | Shubman Gill cleared after elbow blow, set to play West Indies ODI | Sakshi
Sakshi News home page

విండీస్‌తో తొలి వన్డే.. టీమిండియాకు గుడ్‌ న్యూస్‌

Sep 27 2026 11:05 AM | Updated on Sep 27 2026 11:43 AM

Shubman Gill cleared after elbow blow, set to play West Indies ODI

source: BCCI X

వెస్టిండీస్‌తో ఇవాళ జరుగబోయే తొలి వన్డేకు ముందు టీమిండియాకు గుడ్‌న్యూస్‌ అందింది. ప్రాక్టీస్‌ సమయంలో గాయపడిన కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌, మ్యాచ్‌  ఆడేందుకు ఫిట్‌గా ఉన్నాడని బ్యాటింగ్‌ కోచ్‌ సితాన్షు కోటక్‌ తెలిపారు. శుక్రవారం ప్రాక్టీస్‌ సందర్భంగా మహ్మద్‌ సిరాజ్‌ వేసిన బంతి వేగంగా పైకి ఎగిసి గిల్‌ కుడి మోచేతికి బలంగా తాకింది. దీంతో అతడు తొలి వన్డే ఆడటం అనుమానంగా ఉండింది. అయితే కోటక్‌ తాజా ప్రకటనతో గిల్‌ తొలి వన్డే ఆడటం​ ఖరారైపోయింది.

కాగా, తిరువనంతపురం వేదికగా భారత్‌-వెస్టిండీస్‌ మధ్య తొలి వన్డే ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్‌లో అందరి చూపు దిగ్గజాలు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి వైపు ఉంది. అలాగే రుతురాజ్‌ గైక్వాడ్‌, శుభ్‌మన్‌ గిల్‌ ప్రదర్శనల కోసం కూడా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తుది జట్లు (అంచనా)..
భారత్‌: శుభమన్ గిల్ (సి), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, కెఎల్ రాహుల్ (వికెట్), నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, గుర్నూర్ బ్రార్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్

వెస్టిండీస్‌: జాన్ కాంప్‌బెల్, జస్టిన్ గ్రీవ్స్, కీసీ కార్టీ, షాయ్ హోప్ (c & wk), అమీర్ జాంగూ, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, గుడాకేష్ మోటీ, అల్జారీ జోసెఫ్, జేడెన్ సీల్స్

ఇదీ చదవండి: ఇవాళ క్రికెట్‌ ఫ్యాన్స్‌కు పండగే.. ! గంటన్నర వ్యవధిలో 3 మ్యాచ్‌లు


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement