క్రికెట్ అభిమానులకు ఇవాళ పండగ లాంటిది. గంటన్నర వ్యవధిలో మూడు అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లు జరుగనున్నాయి. అది కూడా అగ్రశ్రేణి జట్ల మధ్య. భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 గంటలకు సౌతాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే ప్రారంభం కానుండగా.. 2 గంటలకు భారత్-వెస్టిండీస్ మధ్య తొలి వన్డే, 3 గంటలకు ఇంగ్లండ్-శ్రీలంక మధ్య మూడో వన్డే మొదలవనున్నాయి. 2027 వన్డే వరల్డ్‌కప్ సమీపిస్తున్న తరుణంలో వరుస మ్యాచ్‌లు జరగడం అభిమానులను ఉత్సాహాన్నిస్తుంది.
ఆయా మ్యాచ్‌ల పూర్తి వివరాల్లోకి వెళితే.. 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా జరుగుతున్న తొలి వన్డే ఇది. ఈ మ్యాచ్ తిరువనంతపురం వేదికగా జరుగనుంది. టీమిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి బరిలోకి దిగనుండటం ఈ మ్యాచ్ ప్రాధాన్యతను పెంచింది.
సౌతాఫ్రికా-ఆస్ట్రేలియా వన్డే విషయానికొస్తే.. 3 వన్డేలు, 3 టెస్ట్‌ల సిరీస్‌ల కోసం ఆస్ట్రేలియా వెస్టిండీస్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా జరుగుతున్న రెండో వన్డే ఇది. ఈ మ్యాచ్ జోహనెస్‌బర్గ్ వేదికగా జరుగనుంది. ఈ సిరీస్‌లోని తొలి వన్డే గెలిచి ఆతిథ్య సౌతాఫ్రికా 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది.
ఇంగ్లండ్-శ్రీలంక మ్యాచ్ విషయానికొస్తే.. 3 వన్డేలు, 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం శ్రీలంక జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. తొలుత జరిగిన టీ20 సిరీస్‌ను ఇంగ్లండ్ క్లీన్ స్వీప్ చేయగా.. తొలి రెండు వన్డేల్లో ఇంగ్లండ్, శ్రీలంక చెరో మ్యాచ్ గెలిచాయి. నేటి మ్యాచ్‌లో గెలిచిన జట్టు సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. ఈ మ్యాచ్ లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో జరుగనుంది.
వీటిలో పాటు ఇవాళ మరో ఆసక్తికర మ్యాచ్ కూడా మొదలుకానుంది. భారత్, ఆస్ట్రేలియా అండర్-19 జట్ల మధ్య రాజ్‌కోట్ వేదికగా తొలి అనధికారిక టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానుంది. 3 అనధికారిక వన్డేలు, 2 టెస్ట్‌ల సిరీస్‌ల కోసం ఆస్ట్రేలియా అండర్-19 జట్లు భారత్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా తొలుత వన్డే సిరీస్ జరగ్గా, భారత్ 3-0తో పర్యాటక జట్టును క్లీన్ స్వీప్ చేసింది.
ఇదీ చదవండి: వైభవ్ రూపంలో వారికి ప్రమాదం పొంచి ఉంది..!


