తొలి వన్డేకు ముందు టీమిండియాకు భారీ షాక్‌ | Shubman Gill Injury Scare Ahead Of West Indies ODIs As Siraj Delivery Strikes His Elbow In Nets, Check More Details | Sakshi
Sakshi News home page

తొలి వన్డేకు ముందు టీమిండియాకు భారీ షాక్‌

Sep 26 2026 7:41 AM | Updated on Sep 26 2026 10:23 AM

Shubman Gill Injured As India Suffer Massive Blow Before West Indies ODIs

source: BCCI X

వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ ప్రారంభానికి ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలే పరిస్థితి ఏర్పడింది. కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ నెట్స్‌లో గాయపడ్డాడు. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో శుక్రవారం (సెప్టెంబర్‌ 25) ప్రాక్టీస్‌ చేస్తుండగా మహ్మద్‌ సిరాజ్‌ వేసిన బంతి గిల్‌ కుడి మోచేతికి బలంగా తగిలింది.

దీంతో గిల్‌ నెట్స్‌ నుంచి మధ్యలోనే బయటకు వచ్చాడు. 30 నిమిషాలకు పైగా మైదానం వెలుపలే ఉన్న అతడు తిరిగి ప్రాక్టీస్‌లో పాల్గొనలేదు. అతడి కుడి మోచేతికి బ్యాండేజ్‌ కూడా కట్టినట్లు సమాచారం. గాయం తీవ్రతపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.

కాగా, వెస్టిండీస్‌తో తొలి వన్డే తిరువనంతపురం వేదికగా సెప్టెంబర్‌ 27న జరుగనుంది. ఈ మ్యాచ్‌కు గిల్‌ అందుబాటులో ఉండకపోతే, అది టీమిండియాకు మైనస్‌ అవుతుంది. నాయకత్వంతో పాటు గిల్‌ టాపార్డర్‌లో చాలా కీలకం. మ్యాచ్‌కు ఇంకా సమయం ఉన్నందుకు గిల్‌ కోలుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ మ్యాచ్‌ రేపు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. 

ఇదీ చదవండి: బ్యాటర్ల విధ్వంసం.. భారత్‌ సంచలన విజయం; సిరీస్‌ కైవసం


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement