మితిమీరిన క్రికెట్‌.. జనాలకు బోర్‌ కొట్టదా..? | Special story on excess cricket in recent times | Sakshi
Sakshi News home page

మితిమీరిన క్రికెట్‌.. జనాలకు బోర్‌ కొట్టదా..?

Sep 24 2026 8:26 AM | Updated on Sep 24 2026 8:26 AM

Special story on excess cricket in recent times

source: BCCI X

క్రికెట్‌.. ఈ క్రీడ భారతీయులకు ఓ ఎమోషన్‌. టీమిండియా మ్యాచ్‌ ఉందంటే చాలు, జనాలు పనులు పక్కనపెట్టి మరీ టీవీలకు అతుక్కుపోతారు. వీలైతే నేరుగా మ్యాచ్‌ చూసేందుకు స్టేడియాలకు క్యూ కడతారు. భారత్‌ గెలిస్తే పండుగ చేసుకుంటారు. ఓడితే నిరాశ చెందుతారు. గెలిచినా, ఓడినా గల్లీ నుంచి ఢిల్లీ దాకా డిబేట్లు పెడుతుంటారు. అయితే ప్రస్తుతం ఈ డిబేట్లలో ఓ ఆసక్తికర అంశం చేరింది. అదే.. 'మితిమీరిన క్రికెట్‌'.

ఇటీవలికాలంలో భారత క్రికెట్‌ జట్లు విపరీతంగా మ్యాచ్‌లు ఆడేస్తున్నాయి. ఆ స్థాయి, ఈ విభాగం అని ప్రతి రోజూ ఏదో ఒక మ్యాచ్‌ జరుగుతూనే ఉంటుంది. తాజాగా ఒకే రోజు మూడు వేర్వేరు విభాగాలు, స్థాయిలకు సంబంధించి ఏకంగా మూడు మ్యాచ్‌లు జరిగాయి. భారత-ఏ జట్టు, భారత మహిళల-ఏ జట్టు, భారత అండర్‌-19 జట్టు.. ఇలా మూడు జట్లు ఒకే రోజు, ఒకే ప్రత్యర్దితో (ఆస్ట్రేలియా) మ్యాచ్‌లు ఆడాయి.

ఇది చూసి అభిమానులు తెగ తికమకపడ్డారు. ఎక్కడ ఏ జట్టు ఆడుతుందో అర్దం కాక జట్టు పీక్కున్నారు. ఒక్కప్పుడు భారత క్రికెట్‌ జట్టు మ్యాచ్‌ ఆడుతుందంటే ఓ క్లారిటీ ఉండేది. కానీ, ప్రస్తుతం​ పరిస్థితి అలా లేదు. ఏ ఆటగాడు ఏ జట్టులో ఉంటాడో ఎవరికీ తెలీదు.

పురుషుల క్రికెట్‌ వరకు తీసుకుంటే.. భారత్‌కు ఒక్క జట్టు చాలా తక్కువైపోతుంది. అందుకే టీ20లకు ఒ‍కటి, వన్డేలకు ఒకటి, టెస్ట్‌లకు మరో జట్టు ఉంటుంది.  ఇవి కాకుండా భారత-ఏ జట్టు, భారత అండర్‌ 19, 23 విభాగాల జట్లు.. ఇలా విభాగానికి ఓ జట్టు ఉంది.  

ఈ జట్లన్నీ ఏడాది పొడవునా ఏదో ఒక మ్యాచ్‌ ఆడుతూనే ఉంటాయి. ఇవి కావని దేశవాలీ క్రికెట్‌, ఐపీఎల్‌, స్థానిక లీగ్‌లతో ఆటగాళ్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇక్కడి వరకు సమస్య ఆటగాళ్ల వరకే ఉంది. మితిమీరిన క్రికెట్‌ వల్ల ఇప్పుడు, అభిమానులూ ఇబ్బంది పడుతున్నారు. ఆడేందుకు ఆటగాళ్లకు అలసట రాకపోయినా, చూసేందుకు మాత్రం అభిమానులకు బోర్‌ కొడుతుంది.

ఈ పరిస్థితి కేవలం భారత క్రికెట్‌ వరకు మాత్రమే. ప్రపంచవ్యాప్త క్రికెట్‌ను తీసుకుంటే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఏడాది పొడవునా అంతర్జాతీయ మ్యాచ్‌లు, దేశవాలీ మ్యాచ్‌లు, ప్రైవేట్‌ టీ20 లీగ్‌లతో ఆటగాళ్లకు, అభిమానులకు క్షణం తీరిక లేకుండా పోతుంది. ఈ మితిమీరిన క్రికెట్‌ ఆడేందుకు ఎలా ఉన్నా, చూసేందుకు మాత్రం ఎబ్బేట్టుగా మారిపోతుంది.

ఈ పరిస్థితి వల్ల కొందరు అభిమానులు క్రికెట్‌ చూడటమే మానేశారు. ప్రస్తుతం క్రికెట్‌ బోర్‌ కొట్టే దశ నుంచి విరక్తి వచ్చే దశకు రూపాంతరం చెందుతుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే అతి త్వరలో జనాలు క్రికెట్‌ను పూర్తిగా విస్మరించే ప్రమాదం ఉంది. 

కాబట్టి అ​ంతర్జాతీయ షెడ్యూల్‌, ప్రైవేట్‌ లీగ్‌ల సంఖ్య తగ్గించి, మ్యాచ్‌లను పరిమితం చేస్తే క్రికెట్‌ బ్రతుకుతుంది. ఇప్పటికే ఆటలో నాణ్యత తగ్గిపోయి చాలామంది క్రికెట్‌ చూడటం మానేశారు. ఇదే కొనసాగితే మిగతా జనాలు కూడా కాలక్రమేనా ఆటకు దూరమవుతారు.

ఇదీ చదవండి: టీమిండియాను ఫాలో అవ్వండి.. పాక్‌ జట్టుకు సూచన


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement